2 Samuel · బైబిల్ (తెలుగు)

2 Samuel 22

1యెహోవా తనను సౌలు బారి నుండి, తన శత్రువులందరి నుండి తప్పించిన రోజున దావీదు యెహోవాకు ఈ పాట పాడాడు. అతడిలా ప్రార్థించాడు. 1

2యెహోవా నా ఆశ్రయ శిల, నా కోట, నా రక్షకుడు. 1

3నా ఆశ్రయ శిల, నేను ఆయన సంరక్షణలో ఉంటాను. 1 నా డాలు, నా రక్షణ కొమ్ము, నా సురక్ష. ఆశ్రయస్థానం. 1 హింస నుండి నన్ను కాపాడేవాడు. 1

4స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను మొర్రపెట్టాను. 1 నా శత్రువుల చేతిలోనుండి నేను తప్పించుకుంటాను. 1

5మృత్యుకెరటాలు నన్ను చుట్టుకున్నాయి. 1 భక్తిహీనుల వరద పొంగు నన్ను ముంచెత్తింది. 1

6పాతాళ + 22:6 పాతాళ చనిపోయిన వారి ప్రదేశం పాశాలు నన్ను కట్టి వేశాయి. 1 మరణపు ఉచ్చులు నన్ను చిక్కించుకున్నాయి. 1

7నా దురవస్థలో నేను యెహోవాకు మొర్ర పెట్టాను. 1 నా దేవునికి విన్నవించుకున్నాను. 1 ఆయన తన ఆలయంలో నా ఆక్రోశం విన్నాడు. 1 నా మొర్ర ఆయన చెవులకు చేరింది. 1

8అప్పుడు భూమి కంపించింది. అదిరింది. 1 పరమండలపు పునాదులు వణికాయి. 1 ఆయన కోపానికి అవి కంపించాయి. 1

9ఆయన ముక్కుపుటాల్లో నుంచి నుండి పొగ లేచింది. 1 ఆయన నోట నుండి జ్వాలలు వచ్చాయి. 1 అవి నిప్పు కణాలను రగిల్చాయి. 1

10ఆకాశాన్ని చీల్చి ఆయన దిగి వచ్చాడు 1 ఆయన పాదాల కింద చిక్కటి చీకటి కమ్మి ఉంది. 1

11ఆయన కెరూబును అధిరోహించి వచ్చాడు. 1 గాలి రెక్కల మీద స్వారీ చేస్తూ కనిపించాడు. 1

12అంధకారాన్ని తన చుట్టూ గుడారంగా చేసుకున్నాడు. 1 దట్టమైన కారుమబ్బులను ఆకాశంలో రాశి పోశాడు. 1

13ఆయన సన్నిధి మెరుపుల్లోనుండి అగ్ని కణాలు కురిశాయి. 1

14యెహోవా ఆకాశం నుండి గర్జించాడు. 1 సర్వోన్నతుడు భీకర ధ్వని చేశాడు. 1

15తన బాణాలు వేసి శత్రువులను చెదరగొట్టాడు. 1 ఉరుములు కురిపించి వారిని కకావికలు చేశాడు. 1

16యెహోవా యుధ్ధ ధ్వనికి 1 ఆయన ముక్కుపుటాల నుండి వెలువడిన సెగకి 1 భూగోళం పునాది రాళ్లు బయట పడ్డాయి. 1

17పైనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. 1 నురగలు కక్కుతున్న జలరాసుల్లో నుండి నన్ను బయటికి తీశాడు. 1

18బలవంతులైన పగవారి నుండి, నన్ను ద్వేషించే వారినిండి, 1 నన్ను లొంగదీసుకునే వారి నుండి ఆయన నన్ను రక్షించాడు. 1

19విపత్కర సమయంలో వారు నా మీదికి వచ్చారు. 1 కానీ యెహోవా నాకు అండగా ఉన్నాడు. 1

20యెహోవా విశాలమైన చోటికి నన్ను తోడుకుని వచ్చాడు. 1 నేనంటే ఆయనకు ఇష్టం గనక ఆయన నన్ను రక్షించాడు. 1

21నా నీతినిబట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చాడు. 1 నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు పూర్వ క్షేమ స్థితి కలిగించాడు. 1

22ఎందుకంటే యెహోవా మార్గాలను నేను అనుసరిస్తున్నాను. 1 నా దేవుని నుండి వైదొలగి దుర్మార్గంగా ప్రవర్తించలేదు. 1

23ఆయన న్యాయవిధులన్నీ నా కళ్ళెదుటే ఉన్నాయి. 1 ఆయన కట్టడల నుండి ఎప్పుడూ దారి తొలగ లేదు. 1

24ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాను. 1 పాపానికి దూరంగా ఉన్నాను. 1

25నా నీతినిబట్టి యెహోవా నాకు పూర్వ క్షేమస్థితి కలిగించాడు 1 తన దృష్టిలో నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలమిచ్చాడు. 1

26నమ్మదగిన వారికి నీవు నమ్మదగిన వాడిగా ఉంటావు. 1 యథార్థవంతుల పట్ల నీవు యథార్థవంతుడవుగా ఉంటావు. 1

27నిష్కళంకుల యెడల నీవు నిష్కళంకంగా ఉంటావు. 1 వక్ర బుద్ది గలవారి యెడల వికటంగా ఉంటావు. 1

28యాతన పడే వారిని రక్షిస్తావు 1 గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేస్తావు. 1

29యెహోవా, నీవు నాకు దీపం. 1 యెహోవా నా చీకటిని వెలుగుగా మార్చు. 1

30నీ సహాయంతో నేను అడ్డుకంచెలు అధిగమిస్తాను + 22:30 అధిగమిస్తాను అణిచివేస్తాను. 1 నా దేవుని సహాయంతో నేను ప్రాకారాలను దాటుతాను. 1

31దేవుని మార్గం పరిపూర్ణం 1 యెహోవా వాక్కు నిర్మలం 1 ఆయన అండజేరిన వారికందరికి ఆయన డాలు. 1

32యెహోవా తప్ప దేవుడేడి? 1 మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? 1

33దేవుడు నాకు బలమైన కోట. 1 ఆయన తన మార్గాల్లో యథార్థవంతులను నడిపిస్తాడు. 1

34ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేస్తాడు. 1 పర్వతాలపై నన్ను నిలుపుతాడు. 1

35నా చేతులకు యుద్ధం నేర్పేవాడు ఆయనే 1 నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెడతాయి. 1

36నీవు నీ రక్షణ డాలును నాకు అందిస్తావు. 1 నీ అనుగ్రహం నన్ను గొప్పచేస్తుంది. 1

37నా పాదాల కింద స్థలం విశాలం చేస్తావు. 1 అందువల్ల నా కాళ్ళు జారవు. 1

38నా శత్రువులను తరిమి నాశనం చేస్తాను. 1 వారిని నాశనం చేసేదాకా నేను వెనుదిరగను. 1

39నేను వారిని మింగి వేశాను. ముక్కలుచెక్కలు చేశాను. వారిక లేవలేరు. 1 వారు నా కాళ్ళ కింద ఉన్నారు. 1

40నడికట్టు బిగించి కట్టినట్టు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపజేస్తావు. 1 నా మీదికి లేచిన వారిని నీవు అణచివేస్తావు. 1

41నా శత్రువుల మెడలను నా ముందు వంచావు. 1 నన్ను ద్వేషించే వారిని నేను సమూలనాశనం చేస్తాను. 1

42వారు సహాయం కోసం అరిచారు. కానీ రక్షించే వాడు ఎవడూ లేడు. 1 వారు యెహోవా కోసం ఎదురు చూసినా ఆయన వారికి జవాబియ్యడు. 1

43నేను నేల దుమ్ము లాగా వారిని పొడి చేస్తాను. 1 వీధిలోని బురదలాగా నేను వారిని వెదజల్లి అణగదొక్కుతాను. 1

44నా స్వజనుల కలహాల్లో నుండి కూడా నీవు నన్నువిడిపించావు. 1 ప్రజల అధికారిగా నన్ను నిలిపావు. 1 నేను ఎరుగని ప్రజానీకం నన్ను సేవిస్తారు. 1

45పరదేశులు గత్యంతరం లేక నాకు లోబడతారు. 1 వారు నన్నుగూర్చి వింటే చాలు, నాకు విధేయులౌతారు. 1

46అన్యులు వణకుతూ తమ భద్రమైన స్థలాలు విడిచి వస్తారు. 1

47యెహోవా సజీవుడు. నాకు అండ అయిన వాడికి స్తుతి. 1 నా విముక్తి శిల అయిన దేవుడు ఘనత నొందుగాక. 1

48ఆయన నా పక్షంగా ప్రతీకారం చేసే దేవుడు 1 జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే. 1

49ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిస్తాడు. 1 నా మీద దాడి చేసే వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చిస్తావు. 1 హింసాత్మకుల నుండి నన్ను కాపాడుతావు. 1

50కాబట్టి యెహోవా, జాతుల మధ్య నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. నీ నామానికి స్తుతి పాడుతాను. 1

51తాను నియమించిన రాజుకు ఆయన గొప్ప విజయాన్నిస్తాడు. 1 తాను అభిషేకించిన దావీదుకు అతని సంతానానికి నిబంధన విశ్వసనీయత చూపే వాడు ఆయన.

← 2 Samuel 21Read In The App, Free →2 Samuel 23 →

Study 2 Samuel 22

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324