Jonah · బైబిల్ (తెలుగు)

Jonah 2

1ఆ చేప కడుపులోనుంచి యోనా యెహోవాకు ఇలా ప్రార్థించాడు, 1

2“నా ఆపదలో నేను యెహోవాకు మొర్రపెట్టాను. 1 ఆయన నాకు జవాబిచ్చాడు. 1 మృత్యులోకం నుంచి నేను కేకలు వేస్తే నువ్వు నా స్వరం విన్నావు. 1

3నువ్వు నన్ను అగాధంలో, సముద్రగర్భంలో పడవేశావు. ప్రవాహాలు నన్ను చుట్టుకున్నాయి. 1 నీ అలలూ తరంగాలూ నా మీదుగా వెళ్తున్నాయి. 1

4నీ సన్నిధినుంచి నన్ను తరిమి వేసినా, 1 నీ పరిశుద్ధాలయం వైపు మళ్ళీ చూస్తాను అనుకున్నాను. 1

5నీళ్ళు నన్ను చుట్టుకోవడంతో నేను కొనప్రాణంతో ఉన్నాను. 1 సముద్రాగాధం నన్ను ఆవరించి ఉంది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకుంది. 1

6నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు నన్ను మూసివేశాయి. 1 పర్వతాల పునాదుల్లోకి నేను దిగిపోయాను. 1 నా దేవా, యెహోవా, నువ్వు నా జీవాన్ని అగాధంలో నుంచి పైకి రప్పించావు. 1

7నా ప్రాణం నాలో కృశిస్తూ ఉంటే నేను యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాను. 1 నీ పరిశుద్ధాలయంలోకి నీదగ్గరికి నా ప్రార్థన చేరింది. 1

8వ్యర్థమైన విగ్రహ దేవుళ్ళ మీద లక్ష్యం ఉంచేవాళ్ళు తమ కొరకైన నీ విశ్వాస్యతను నిరాకరిస్తున్నారు. 1

9నా మట్టుకు నేను కృతజ్ఞతాస్తుతులతో నీకు బలి సమర్పిస్తాను. 1 నేను మొక్కుకున్న దాన్ని తప్పక నెరవేరుస్తాను. 1 యెహోవా దగ్గరే రక్షణ దొరుకుతుంది.”

10అప్పుడు యెహోవా చేపకు ఆజ్ఞాపించగానే అది యోనాను పొడి నేల మీద కక్కి వేసింది.

← Jonah 1Read In The App, Free →Jonah 3 →

Study Jonah 2

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

1234