3 John · బైబిల్ (తెలుగు)

3 John 1

1ప్రియమైన గాయికి, పెద్దనైన నేను యథార్థమైన ప్రేమతో రాస్తున్నది.

2ప్రియ సోదరా, నీవు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఉన్నట్టుగానే అన్ని విషయాల్లో వర్ధిల్లాలనీ, ఆరోగ్యవంతుడివిగా ఉండాలనీ నేను ప్రార్ధిస్తున్నాను.

3నీవు ఎప్పుడూ నడుస్తున్నట్టే సత్యమార్గంలో నడచుకొంటున్నావని నీ గురించి కొందరు సోదరులు వచ్చి చెప్పగా విని చాలా సంతోషించాను.

4నా పిల్లలు సత్యమార్గంలో నడుచుకుంటున్నారని తెలుసుకోవడం కన్నా నాకు గొప్ప సంతోషం మరేదీ లేదు. 1 సువార్త పరిచర్య చేసే వారి గురించి

5ప్రియ సోదరా, నీవు సోదరుల కోసం అపరిచితుల కోసం చేస్తున్నది నమ్మకంగా చేస్తున్నావు.

6వారు సంఘం ఎదుట నీ ప్రేమను గూర్చి సాక్ష్యం ఇచ్చారు. దేవునికి తగినట్టుగా వారి ముందున్న ప్రయాణానికి తోడ్పాటు ఇచ్చి పంపించు.

7వారు దేవుని నామం కోసం వెళ్తున్నారు. యూదేతరుల నుండి వారు ఏమీ తీసుకోవడం లేదు.

8కాబట్టి మనం సత్యం విషయంలో జత పనివారమయ్యేలా వారిని స్వీకరించాలి. 1 పెత్తనం చెలాయిస్తున్న దియోత్రెఫే

9అక్కడి సంఘానికి నేను రాశాను గాని, వారిలో గొప్పవాడుగా ఉండాలని కోరుకొనే దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించడం లేదు.

10కాబట్టి, నేను అక్కడికి వచ్చినప్పుడు అతడు చేసిన పనులు, మా విషయంలో మాట్లాడిన చెడ్డ మాటలు గుర్తు చేసుకుంటాను. అంతే కాదు, తాను స్వయంగా సోదరులను ఆహ్వానించడు, ఆహ్వానించిన వారిని కూడా అడ్డగించి, సంఘంలో నుండి వెళ్ళగొడుతున్నాడు.

11ప్రియ సోదరా, చెడునుగాక మంచినే అనుకరించు. మంచి జరిగించేవాడు దైవ సంబంధి. చెడు జరిగించేవాడు దేవుణ్ణి చూడలేదు. 1 మంచివాడు దేమేత్రి

12దేమేత్రి గురించి అందరూ మంచి సాక్ష్యం చెప్పారు. సత్యం విషయంలో అతడు మంచి సాక్ష్యం పొందాడు. మేము కూడా మంచి సాక్ష్యం ఇస్తున్నాం. మా సాక్ష్యం సత్యం అని నీకు తెలుసు.

13ఇంకా చాలా సంగతులు నీకు రాయాలనుకున్నాను గాని కలంతో, సిరాతో రాయడం నాకు ఇష్టం లేదు.

14కానీ నేను నిన్ను త్వరలోనే చూడగలనని ఆశిస్తున్నాను. అప్పుడు మనం ముఖాముఖీ మాట్లాడుకుందాం.

15నీకు శాంతి కలుగు గాక. స్నేహితులు నీకు అభివందనాలు చెబుతున్నారు. అక్కడి స్నేహితులకు పేరు పేరునా మా అభివందనాలు తెలియజెయ్యి.

← 2 John 1Read In The App, Free →Jude 1 →

Study 3 John 1

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

1