Judges · బైబిల్ (తెలుగు)

Judges 5

1ఆ రోజు దెబోరా, అబీనోయము కొడుకు బారాకు, ఈ కీర్తన పాడారు, 1

2ఇశ్రాయేలులో నాయకులు నాయకత్వం వహించినపుడు 1 ప్రజలు సంతోషంగా, స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొన్నారు. 1 మేము యెహోవాను స్తుతిస్తాం! 1

3రాజులారా వినండి! అధికారులారా ఆలకించండి! 1 నేను యెహోవాకు కీర్తన పాడుతాను. 1 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నేను స్తుతుల కీర్తన పాడుతాను. 1

4యెహోవా, నువ్వు శేయీరు నుంచి బయలుదేరినప్పుడు, 1 ఎదోము పొలం నుంచి యుద్ధానికి బయలుదేరినప్పుడు, 1 భూమి కంపించింది. ఆకాశం వణికింది. 1 మేఘాలు నీళ్ళు కుమ్మరించాయి. 1

5యెహోవా సముఖంలో కొండలు కంపించాయి. 1 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సముఖంలో సీనాయి కొండ కూడా కంపించింది. 1

6అనాతు కొడుకు షమ్గరు దినాల్లో యాయేలు దినాల్లో రాజమార్గాలు ఎడారులుగా మారాయి. 1 ప్రయాణికులు ఎవరూ నడవని పక్క త్రోవల్లోనే నడిచారు. 1

7దెబోరా అనే నేను రాకముందు, ఇశ్రాయేలీయుల్లో పనివాళ్ళు లేకుండా పోయారు. 1 ఒక తల్లి ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించ వలసి వచ్చింది! 1

8ఇశ్రాయేలీయులు కొత్త దేవుళ్ళను ఎంపిక చేసుకున్నారు. 1 యుద్ధం వాళ్ళ ముఖ ద్వారాల దగ్గరికి వచ్చింది. 1 ఇశ్రాయేలీయుల్లో నలభై వేలమందిలో 1 ఒక్కడికైనా ఒక డాలే గానీ ఒక ఈటె గానీ కనిపించలేదు. 1

9ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషంగా తమకైతాముగా యుద్ధానికి సిద్ధపడ్డారు. 1 వారిని బట్టి యెహోవాను స్తుతించండి! 1

10తెల్ల గాడిదల మీద స్వారీ చేసేవారూ, తివాచీల మీద కూర్చునేవారూ, 1 త్రోవల్లో నడిచేవారూ, ఇది వినండి! 1

11పశువులు నీళ్ళు తాగే చోట విల్లుకాండ్రు చేసే + 5:11 విల్లుకాండ్రు చేసే పాటలు పాడేవాళ్ళ స్వరాలు వినండి. 1 యెహోవా నీతిక్రియల గురించి వాళ్ళు చెబుతున్నారు. 1 ఇశ్రాయేలీయుల యుద్ధశూరులకు తమ శత్రువుల మీద ఆయన జయం ఇచ్చాడని వాళ్ళు చెబుతున్నారు. 1 “యెహోవా ప్రజలు పట్టణ ద్వారాల దగ్గరికి కవాతుగా వెళ్ళారు. 1

12మేలుకో, మేలుకో దెబోరా, మేలుకో, మేలుకో, కీర్తన పాడు! 1 బారాకూ వెళ్ళు, అబీనోయము కుమారా, వెళ్ళు. నీ శత్రువులను బంధించు. 1

13ప్రాణాలతో ఉన్న కొందరు ఇశ్రాయేలు ప్రజలు 1 తాబోరు కొండ దిగి ప్రముఖుల దగ్గరికి వచ్చారు. 1 యెహోవా ప్రజలు యుద్ధ శూరులతో ఉన్న నా దగ్గరికి వచ్చారు. 1

14కొందరు ఎఫ్రాయీము నుంచి వచ్చినవాళ్ళు. 1 వాళ్ళు ఒకప్పుడు అమాలేకీయుల దేశ నివాసులు. బెన్యామీనీయుల ప్రజలు నీ వెంటే వచ్చారు. 1 మాకీరు నుంచి న్యాయాధిపతులు, జెబూలూనీయుల నుంచి నాయకదండం మోసేవాళ్ళూ వచ్చారు. 1

15ఇశ్శాఖారులోని అధిపతులు దెబోరాతో కలిసి వచ్చారు. 1 ఇశ్శాఖారీయులు బారాకుతో కలిసి అతివేగంగా లోయలోకి చొరబడ్డారు. 1 రూబేనీయుల తెగలవారికి గొప్ప హృదయాన్వేషణలు కలిగాయి. 1

16గొర్రెల మందల కోసం కాపరులు వాయించే ఈలలు వినడానికి నీ గొర్రెల దొడ్ల మధ్య నువ్వెందుకు ఉన్నావు? 1 రూబేనీయుల తెగల వారికి గొప్ప హృదయాన్వేషణలు కలిగాయి. 1

17గిలాదువారు యొర్దాను అవతల ప్రాంతాల్లో నివాసం ఉన్నారు. 1 దానీయులు ఓడల్లో ఎందుకు తిరుగుతున్నారు? 1 ఆషేరీయులు సముద్రతీరాన తమ ఓడరేవుల్లో ఎందుకు ఉన్నారు? 1

18జెబూలూనీయులకు మరణభయం లేదు. 1 వారు ప్రాణాలు సైతం లెక్కచెయ్యని ప్రజలు. 1 నఫ్తాలీయులు కూడా యుద్ధభూమిలో ప్రాణాలు లెక్క చెయ్యలేదు. 1

19రాజులు వచ్చి యుద్ధం చేశారు. 1 మెగిద్దో జలాల దగ్గర ఉన్న తానాకులో కనాను రాజులు యుద్ధం చేశారు. 1

20కాని వాళ్ళు ఆ యుద్ధం నుంచి వెండిని కొల్లసొమ్ముగా తీసుకువెళ్ళలేదు. 1 నక్షత్రాలు ఆకాశం నుంచి యుద్ధం చేశాయి. 1 నక్షత్రాలు తమ ఆకాశమార్గాల్లో నుంచి సీసెరాతో యుద్ధం చేశాయి. 1

21కీషోను వాగులో, పురాతన వాగైన కీషోనులో వాళ్ళు కొట్టుకుపోయారు. 1 నా ప్రాణమా, నువ్వు బలం తెచ్చుకుని సాగిపో! 1

22గుర్రాల డెక్కల శబ్దాలతో నేల దద్దరిల్లింది. యుద్ధశూరుల గుర్రాలు కదం తొక్కాయి. 1

23యెహోవా దూత ఇలా అన్నాడు ‘మేరోజును శపించండి.’ 1 ‘దాని నివాసులను తప్పనిసరిగా శపించండి. యెహోవాకు సహాయంగా వాళ్ళు రాలేదు. 1 బలిష్ఠులైన యుద్ధశూరులతో చేసిన యుద్ధంలో యెహోవాకు సహాయంగా వాళ్ళు రాలేదు.’ 1

24కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు గుడారాల్లో నివసించే స్త్రీలందరికన్నా ఎక్కువ దీవెన పొందింది. 1

25అతడు దాహానికి నీళ్ళు అడిగాడు. ఆమె పాలు తెచ్చి ఇచ్చింది. 1 సైన్యాధిపతులకు తగిన పాత్రతో వెన్న తెచ్చి ఇచ్చింది. 1 ఆమె తన చేతితో గుడారపు మేకు పట్టుకుంది. 1

26పనివాని సుత్తెను కుడిచేత్తో పట్టుకుని సీసెరాను కొట్టింది. 1 ఆమె అతని తల పగలగొట్టింది. 1 ఆమె అతని తల ప్రక్కన సుత్తెతో కొడితే అతని తల బద్దలైంది. 1

27అతడు ఆమె కాళ్ల దగ్గర కూలిపడి ఉన్నాడు. 1 ఆమె కాళ్ల మధ్య చలనం లేకుండా పడి ఉన్నాడు. 1 అతడు క్రుంగి పడి ఉన్న చోటే దారుణంగా చచ్చాడు. 1

28సీసెరా తల్లి కిటికీలోనుంచి చూస్తూ ఉంది. 1 అల్లిక కిటికీలోనుంచి చూస్తూ ఆందోళనగా కేక పెడుతోంది 1 అతని రథం తిరిగి రావడానికి ఇంత సమయం పడుతోందేమిటి? 1 అతని రథాన్ని లాగే గుర్రాల డెక్కల శబ్ధాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? 1

29ఆమె దగ్గర ఉన్న జ్ఞానం కలిగిన రాకుమార్తెలు జవాబిచ్చారు. 1 ఆమె తనకు తాను మళ్ళీ అదే జవాబు చెప్పుకుంది. 1

30‘కొల్లసొమ్ము వాళ్ళకు దొరకలేదా? దాన్ని వాళ్ళు పంచుకోలేదా? 1 యోధులందరూ ఒకరు, లేక ఇద్దరు స్త్రీలను తీసుకోలేదా? 1 సీసెరాకు రంగులు అద్దిన వస్త్రం దోపుడు సొమ్ముగా దొరకుతుంది. 1 రంగులు దిద్ది బుటా పని చేసిన వస్త్రం దోపుడు సొమ్ముగా దొరుకుతుంది. 1 రెండు వైపులా రంగులు అద్ది, బుటాదారీ పనిచేసిన వస్త్రం దోచుకొన్నవాళ్ళ మెడలకు తగినది వాళ్లకు దొరుకుతుంది.’ 1

31యెహోవా, నీ శత్రువులందరూ అలాగే నశించాలి. 1 ఆయన్ని ప్రేమించేవాళ్ళు బలిష్టమైన ఉదయించే సూర్యుడిలా ఉంటారు అని పాడారు.” 1 ఆ తరువాత దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.

← Judges 4Read In The App, Free →Judges 6 →

Study Judges 5

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021