Luke · బైబిల్ (తెలుగు)

Luke 3

1సీజరు తిబెరియస్ పాలించిన పదిహేనవ సంవత్సరంలో పొంతి పిలాతు యూదయకు గవర్నర్. హేరోదు గలిలయకు చతుర్థాధికారి. అతని సోదరుడు ఫిలిప్పు ఇతూరయకూ, త్రకోనీతి ప్రాంతాలకూ పాలకుడు. లుసానియ అబిలేనే పరగణాకు రాష్ట్రాధికారి.

2అన్న, కయప ముఖ్య యాజకులు. అప్పుడు అరణ్యంలో ఉన్న జెకర్యా కుమారుడు యోహాను దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది.

3అతడు యొర్దాను నదీ ప్రాంతమంతా తిరుగుతూ పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిసాన్ని ప్రకటించాడు.

4యెషయా ప్రవక్త వాక్కుల గ్రంథంలో ఇలా రాసి ఉంది, 1 “అరణ్యంలో ఒక కేక వినిపిస్తున్నది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి. 1 ఆయన బాటలు తిన్నగా చేయండి. 1

5ప్రతి లోయనూ పూడ్చాలి. ప్రతి పర్వతాన్నీ, మెరకనూ పల్లం చేయాలి. 1 వంకర దారులు సరి అవుతాయి. గరుకు బాటలు నునుపు అవుతాయి. 1

6ప్రజలందరూ దేవుని రక్షణను చూస్తారు.”

7అతడు తన దగ్గర బాప్తిసం పొందడానికి గుంపులు గుంపులుగా వచ్చిన వారితో, “సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత తప్పించుకొమ్మని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?

8పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్తున్నాను.

9ఇప్పటికే చెట్ల వేరుకు గొడ్డలి ఆనించి ఉంది. కాబట్టి మంచి పళ్ళు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తాడు” అని చెప్పాడు.

10అప్పుడు గుంపులో కొంతమంది, “అయితే మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు.

11అతడు, “రెండు అంగీలు ఉన్నవాడు అసలు లేని వాడికి ఒకటి ఇవ్వాలి, భోజనం ఉన్నవాడు కూడా ఆలాగే చేయాలి” అని చెప్పాడు.

12పన్ను వసూలు చేసే వారు కూడా బాప్తిసం పొందడానికి వచ్చి, “బోధకా, మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు.

13అతడు, “మీరు వసూలు చేయాల్సిన దాని కంటే ఎక్కువ తీసుకోవద్దు” అని వారితో చెప్పాడు.

14“మా సంగతేంటి? మేమేం చేయాలి?” అని కొంతమంది సైనికులు కూడా అడిగారు. “ఎవరి దగ్గర నుంచీ అక్రమంగా డబ్బు తీసుకోవద్దు. అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు. మీ జీతంతో తృప్తిపడండి” అని అతడు వారితో చెప్పాడు.

15క్రీస్తు కోసం ప్రజలు ఆశతో ఎదురు చూస్తూ, యోహానే క్రీస్తు అయి ఉంటాడని అని అందరూ లోలోపల అనుకుంటున్నారు.

16వారందరికీ యోహాను ఇలా జవాబిచ్చాడు, “నేను నీళ్లలో మీకు బాప్తిసమిస్తున్నాను, అయితే నాకన్నా శక్తి గలవాడు వస్తున్నాడు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగను. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు.

17తన కళ్ళం బాగు చేయడానికి తూర్పారబట్టే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. తన గిడ్డంగిలో గోదుమలు పోసి, పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు.”

18అతడు ఇంకా చాలా మాటలు చెప్పి ప్రజలను హెచ్చరిస్తూ సువార్త ప్రకటించాడు.

19అయితే రాష్ట్రాధికారి హేరోదు చేసిన చెడు పనులన్నిటి విషయం, అతని సోదరుని భార్య హేరోదియ విషయం యోహాను అతన్ని మందలించాడు.

20హేరోదు అంతవరకూ తాను చేసిన చెడ్డ పనులు చాలవన్నట్టు యోహానును బంధించి చెరసాలలో పెట్టాడు. 1 యేసు బాప్తిసం మత్తయి 3:13-17; మార్కు 1:9-11

21ప్రజలంతా బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు యేసు కూడా బాప్తిసం పొందాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నపుడు ఆకాశం తెరుచుకుంది.

22పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదికి దిగి వచ్చాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. “నీవు నా ప్రియ కుమారుడివి. నీవంటే నాకెంతో ఆనందం.” 1 యేసు తల్లి మరియ వంశ వృక్షం

23యేసు తన పని మొదలుపెట్టినప్పుడు ఆయన వయస్సు సుమారు ముప్ఫై సంవత్సరాలు. ఆయన యోసేపు కొడుకు (అని ప్రజలు ఎంచారు). యోసేపు హేలీ కొడుకు.

24హేలీ మత్తతు కొడుకు. మత్తతు లేవి కొడుకు. లేవి మెల్కీ కొడుకు.

25మెల్కీ యన్న కొడుకు. యన్న యోసేపు కొడుకు. యోసేపు మత్తతీయ కొడుకు. మత్తతీయ ఆమోసు కొడుకు. ఆమోసు నాహోము కొడుకు. నాహోము ఎస్లి కొడుకు. ఎస్లి నగ్గయి కొడుకు.

26నగ్గయి మయతు కొడుకు. మయతు మత్తతీయ కొడుకు. మత్తతీయ సిమియ కొడుకు. సిమియ యోశేఖు కొడుకు. యోశేఖు యోదా కొడుకు.

27యోదా యోహన్న కొడుకు. యోహన్న రేసా కొడుకు. రేసా జెరుబ్బాబెలు కొడుకు. జెరుబ్బాబెలు షయల్తీయేలు కొడుకు. షయల్తీయేలు నేరి కొడుకు.

28నేరి మెల్కీ కొడుకు. మెల్కీ అద్ది కొడుకు. అద్ది కోసాము కొడుకు. కోసాము ఎల్మదాము కొడుకు. ఎల్మదాము ఏరు కొడుకు.

29ఏరు యెహోషువ కొడుకు. యెహోషువ ఎలీయెజెరు కొడుకు. ఎలీయెజెరు యోరీము కొడుకు. యోరీము మత్తతు కొడుకు. మత్తతు లేవి కొడుకు.

30లేవి షిమ్యోను కొడుకు. షిమ్యోను యూదా కొడుకు. యూదా యోసేపు కొడుకు. యోసేపు యోనాము కొడుకు. యోనాము ఎల్యాకీము కొడుకు.

31ఎల్యాకీము మెలెయా కొడుకు. మెలెయా మెన్నా కొడుకు. మెన్నా మత్తతా కొడుకు. మత్తతా నాతాను కొడుకు. నాతాను దావీదు కొడుకు.

32దావీదు యెష్షయి కొడుకు. యెష్షయి ఓబేదు కొడుకు. ఓబేదు బోయజు కొడుకు. బోయజు శల్మాను కొడుకు. శల్మాను నయస్సోను కొడుకు.

33నయస్సోను అమ్మీనాదాబు కొడుకు. అమ్మీనాదాబు అద్మిను కొడుకు. అద్మిను అర్నీ కొడుకు. అర్నీ ఎస్రోము కొడుకు, ఎస్రోము పెరెసు కొడుకు. పెరెసు యూదా కొడుకు.

34యూదా యాకోబు కొడుకు. యాకోబు ఇస్సాకు కొడుకు. ఇస్సాకు అబ్రాహాము కొడుకు. అబ్రాహాము తెరహు కొడుకు. తెరహు నాహోరు కొడుకు.

35నాహోరు సెరూగు కొడుకు. సెరూగు రయూ కొడుకు. రయూ పెలెగు కొడుకు. పెలెగు హెబెరు కొడుకు. హెబెరు షేలహు కొడుకు.

36షేలహు కేయినాను కొడుకు. కేయినాను అర్పక్షదు కొడుకు. అర్పక్షదు షేము కొడుకు. షేము నోవహు కొడుకు. నోవహు లెమెకు కొడుకు.

37లెమెకు మెతూషెల కొడుకు. మెతూషెల హనోకు కొడుకు. హనోకు యెరెదు కొడుకు. యెరెదు మహలలేలు కొడుకు. మహలలేలు కేయినాను కొడుకు.

38కేయినాను ఎనోషు కొడుకు. ఎనోషు షేతు కొడుకు. షేతు ఆదాము కొడుకు. ఆదాము దేవుని కొడుకు.

← Luke 2Read In The App, Free →Luke 4 →

Study Luke 3

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesThe Fourfold GospelJohn LightfootGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324