Ecclesiastes 10
1పరిమళ తైలంలో ఈగలు పడి చస్తే అది దుర్వాసన కొడుతుంది. 2 కొంచెం మూర్ఖత్వం త్రాసులో వేసి చూస్తే జ్ఞానాన్ని, గౌరవాన్ని తేలగొడుతుంది. 2
2జ్ఞాని హృదయం అతణ్ణి కుడి చేతితో పని చెయ్యిస్తుంది, 2 మూర్ఖుడి హృదయం అతని ఎడమ చేతితో పని చేయిస్తుంది. 2
3మూర్ఖుడు మార్గంలో సరిగా నడుచుకోవడం చేతకాక తాను మూర్ఖుణ్ణి అని అందరికి తెలిసేలా చేసుకుంటాడు. 2
4యజమాని నీ మీద కోపపడితే నీ ఉద్యోగాన్ని విడిచి పెట్టకు. 2 నీ సహనం ఘోరమైన తప్పిదాలు జరక్కుండా చేస్తుంది. 2
5రాజులు పొరపాటుగా చేసే అన్యాయం నేను ఒకటి చూశాను. 2
6ఏమంటే మూర్ఖులను పెద్ద పదవుల్లో, గొప్పవారిని వారి కింద నియమించడం. 2
7సేవకులు గుర్రాల మీద స్వారీ చేయడం, 2 అధిపతులు సేవకుల్లా నేల మీద నడవడం నాకు కనిపించింది. 2
8గొయ్యి తవ్వేవాడు కూడా దానిలో పడే అవకాశం ఉంది. 2 ప్రహరీ గోడ పడగొట్టే వాణ్ణి పాము కరిచే అవకాశం ఉంది. 2
9రాళ్లు దొర్లించే వాడికి అది గాయం కలిగించవచ్చు. 2 చెట్లు నరికే వాడికి దానివలన అపాయం కలగొచ్చు. 2
10ఇనుప పనిముట్టు మొద్దుగా ఉంటే పనిలో ఎక్కువ బలం ఉపయోగించాల్సి వస్తుంది. 2 అయితే జ్ఞానం విజయానికి ఉపయోగపడుతుంది. 2
11పామును లోబరచుకోక ముందే అది కరిస్తే దాన్ని లోబరచుకునే నైపుణ్యం వలన ప్రయోజనం లేదు. 2
12జ్ఞాని పలికే మాటలు వినడానికి ఇంపుగా ఉంటాయి. 2 అయితే మూర్ఖుడి మాటలు వాడినే మింగివేస్తాయి. 2
13వాడి నోటిమాటలు మూర్ఖత్వంతో ప్రారంభమౌతాయి, 2 వెర్రితనంతో ముగుస్తాయి. 2
14ఏమి జరగబోతున్నదో తెలియకపోయినా మూర్ఖులు అతిగా మాట్లాడతారు. 2 మనిషి చనిపోయిన తరవాత ఏం జరుగుతుందో ఎవరు చెబుతారు? 2
15మూర్ఖులు తాము వెళ్ళాల్సిన దారి తెలియనంతగా తమ కష్టంతో ఆయాసపడతారు. 2
16ఒక దేశానికి బాలుడు + 10:16 బాలుడు సేవకుడు రాజుగా ఉండడం, 2 ఉదయాన్నే భోజనానికి కూర్చునే వారు అధిపతులుగా ఉండడం అరిష్టం. 2
17అలా కాక దేశానికి రాజు గొప్ప ఇంటివాడుగా, 2 దాని అధిపతులు మత్తు కోసం కాక బలం కోసం సరైన సమయంలో భోజనానికి కూర్చునే వారుగా ఉండడం శుభకరం. 2
18సోమరితనం ఇంటికప్పు దిగబడిపోయేలా చేస్తుంది. చేతులు బద్ధకంగా ఉంటే ఆ ఇల్లు కురుస్తుంది. 2
19విందు వినోదాలు మనకి నవ్వు, ఆనందం పుట్టిస్తాయి. 2 ద్రాక్షారసం ప్రాణాలకి సంతోషం ఇస్తుంది. ప్రతి అవసరానికి డబ్బు తోడ్పడుతుంది. 2
20నీ మనస్సులో కూడా రాజును శపించవద్దు, 2 నీ పడక గదిలో కూడా ధనవంతులను శపించవద్దు. 2 ఎందుకంటే ఏ పక్షి అయినా ఆ సమాచారాన్ని మోసుకుపోవచ్చు. 2 రెక్కలున్న ఏదైనా సంగతులను తెలియజేయవచ్చు.