Ecclesiastes · బైబిల్ (తెలుగు)

Ecclesiastes 12

1కష్టకాలం రాకముందే, 2 “జీవితం అంటే నాకిష్టం లేదు” 2 అని నువ్వు చెప్పే కాలం రాకముందే, 2

2సూర్య చంద్ర నక్షత్రాల కాంతికి చీకటి కమ్మక ముందే, 2 వాన వెలిసిన తరువాత మబ్బులు మళ్ళీ రాక ముందే, 2 నీ యువ ప్రాయంలోనే నీ సృష్టికర్తను స్మరించుకో. 2

3ఆ సమయంలో ఇంటి కావలివారు వణకుతారు. 2 బలంగా ఉండేవారు వంగిపోతారు. 2 తిరగలి విసిరే స్త్రీలు కొద్దిమందే ఉంటారు కాబట్టి పని ఆపేస్తారు. 2 కిటికీల్లో నుంచి చూసేవాళ్ళు ఇక చూడలేరు. 2

4తిరుగటిరాళ్ల శబ్దం ఆగిపోతుంది. 2 వీధి తలుపులు మూసేస్తారు. 2 పిట్ట కూతకు మనుషులు మేలుకుంటారు. 2 అమ్మాయిల పాటల స్వరాలు తగ్గిపోతాయి. 2

5ఎత్తు స్థలాలంటే, దారిలోని అపాయాలంటే మనుషులు భయపడే సమయమది. 2 బాదం చెట్టుకు పూలు పూసినప్పుడు, 2 మిడతల్లాగా బతుకు భారంగా ఈడుస్తుంటే, 2 సహజమైన కోరికలు అంతరిస్తాయి. 2 అప్పుడు మనిషి తన శాశ్వత నివాసం చేరతాడు. 2 ఏడ్చేవాళ్ళు వీధుల్లో తిరుగుతారు. 2

6వెండి తాడు తెగిపోక ముందే లేదా బంగారు గిన్నె నలిగిపోక ముందే, 2 లేదా నీటి ఊట దగ్గర కుండ పగిలిపోక ముందే, 2 లేదా బావి దగ్గర కప్పీ పగిలి పోక ముందే నీ సృష్టికర్తను స్మరించుకో. 2

7మట్టి తాను దేనిలోనింఛి వచ్చిందో ఆ భూమిలో కలిసిపోక ముందే 2 ఆత్మ, దాన్నిచ్చిన దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళిపోతుంది. 2

8ప్రసంగి ఇలా అంటున్నాడు. “నీటి ఆవిరి, అంతా అదృశ్యమయ్యే ఆవిరే.” 1 మానవుని బాధ్యత 2

9ఈ ప్రసంగి తెలివైనవాడు. అతడు ప్రజలకు జ్ఞానం బోధించాడు. 2 అతడు బాగా చదివి, సంగతులు పరిశీలించి అనేక సామెతలు రాశాడు.

10ప్రసంగి చక్కటి మాటలు యథార్థంగా రాయడానికి ప్రయత్నించాడు.

11తెలివి గల వారి మాటలు ములుకోలల్లాంటివి. ఈ సామెతలు, అనుభవజ్ఞులు సమకూర్చిన మాటల్లాగా, గట్టిగా బిగించి, దిగగొట్టిన మేకుల్లాగా ఒక కాపరి + 12:11 ఒక కాపరి సొలొమోను లేక దేవుడు బోధించినట్టుగా ఉన్నాయి.

12కుమారా, ఇంకా ఇతర విషయాల గూర్చి జాగ్రత్తపడు. అంతూ పొంతూ లేని గ్రంథాల రచన. విపరీతంగా చదవడం వలన శరీరం అలిసిపోతుంది. 2

13ఇదంతా విన్న తరువాత తేలింది ఇదే. 2 నువ్వు దేవుని మీద భయభక్తులు ఉంచి ఆయన ఆజ్ఞలను పాటించాలి. 2 మానవులంతా చేయాల్సింది ఇదే. 2

14ఎందుకంటే దేవుడు ప్రతి పనినీ, రహస్యంగా ఉంచిన ప్రతి విషయాన్నీ, 2 అది మంచిదైనా చెడ్డదైనా, తీర్పులోకి తెస్తాడు.

← Ecclesiastes 11Read In The App, Free →Song of Solomon 1 →

Study Ecclesiastes 12

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112