Ecclesiastes · బైబిల్ (తెలుగు)

Ecclesiastes 11

1నీ భోజనాన్ని నీళ్ల మీద వెయ్యి + 11:1 నీ భోజనాన్ని నీళ్ల మీద వెయ్యి నీకున్న దానిలో నుంచి ఇతరులకు సహాయపడు. 2 చాలా రోజులకు మళ్ళీ అది నీకు దొరుకుతుంది + 11:1 నీకు దొరుకుతుంది నీకు ప్రతిఫలం వచ్చేలా దేవుడు చూస్తాడు. 2

2దాన్ని ఏడు, ఎనిమిది మందితో పంచుకో. 2 ఎందుకంటే భూమి మీద ఏ విపత్తులు వస్తున్నాయో నీకు తెలియదు. 2

3మబ్బుల నిండా నీరుంటే అవి భూమి మీద వాన కురిపించి ఖాళీ అయిపోతాయి. 2 ఒక చెట్టు దక్షిణం వైపుకు పడినా ఉత్తరం వైపుకు పడినా అది పడిన చోటే ఉంటుంది. 2

4గాలిని లక్ష్యపెట్టేవాడు విత్తనాలు చల్లడు. 2 మబ్బులను చూస్తూ ఉండేవాడు పంట కోయడు. 2

5స్త్రీ గర్భంలో పసికందు ఎముకలు ఎలా ఏర్పడతాయో, 2 గాలి ఎక్కడ నుంచి వస్తుందో నీవెలా గ్రహించలేవో 2 సమస్తాన్నీ సృష్టించిన దేవుని పనిని నువ్వు గ్రహించలేవు. 2

6ఉదయాన విత్తనం నాటు. 2 సాయంత్రం వరకూ అవసరమైనంత మట్టుకు నీ చేతులతో పని చెయ్యి. 2 ఏవి ఫలిస్తాయో, ఉదయమా, సాయంత్రమా లేక రెండూ ఒకేలా బాగుంటాయో నీకు తెలియదు. 2

7వెలుగు నిజంగా ఎంతో బాగుంటుంది. 2 సూర్యోదయం చూడడం ఇంకా ఎంత బాగుంటుందో! 2

8ఎవడైనా చాలా కాలం బతికితే, ఆ రోజులన్నీ ఆనందంగా ఉండాలి. 2 అయితే రాబోయే చీకటి రోజుల గురించి అతడు ఆలోచించాలి. 2 అవి అనేకం ఉంటాయి. రాబోయేదంతా అదృశ్యమయ్యే ఆవిరే. 2

9యువకా, నీ యువదశలో సంతోషంగా ఉండు. 2 నీ యువదశలో మనసారా సంతోషించు. 2 నీ మనస్సులోని కోరికల ప్రకారం, నీ కళ్ళు చూచే వాటన్నిటినీ అనుభవించు. 2 అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడని గుర్తుపెట్టుకో. 2

10నీ హృదయం నుంచి కోపాన్ని తోలివెయ్యి. 2 నీ శరీరంలో వచ్చే ఎలాంటి నొప్పినైనా పట్టించుకోవద్దు. 2 ఎందుకంటే యువదశ, దాని బలం ఆవిరి లాంటివే.

← Ecclesiastes 10Read In The App, Free →Ecclesiastes 12 →

Study Ecclesiastes 11

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112