Joel 1
1పెతూయేలు కొడుకు యోవేలుకు వచ్చిన యెహోవా వాక్కు. 1 మిడతల తెగులు 1
2పెద్దలారా, వినండి. దేశంలో నివసించే మీరంతా జాగ్రత్తగా వినండి. 1 మీ రోజుల్లో గానీ మీ పూర్వీకుల రోజుల్లో గానీ 1 ఇలాంటి విషయం ఎప్పుడైనా జరిగిందా? 1
3దాన్ని గురించి మీ పిల్లలకు చెప్పండి. 1 మీ పిల్లలు తమ పిల్లలకు, వాళ్ళ పిల్లలు తరువాత తరానికి చెబుతారు.
4ఎగిరే మిడతల గుంపులు విడిచి పెట్టిన దాన్ని పెద్ద మిడతలు తినేశాయి. 1 పెద్ద మిడతలు విడిచిపెట్టిన దాన్ని మిడత పిల్లలు తినేశాయి. 1 మిడత పిల్లలు విడిచిపెట్టిన దాన్ని గొంగళిపురుగులు తినేశాయి. 1
5తాగుబోతులారా, లేచి ఏడవండి. 1 ద్రాక్షసారాయి తాగే మీరు గట్టిగా ఏడవండి. 1 ఎందుకంటే కొత్త ద్రాక్షసారాయి మీ నోటికి అందడం లేదు. 1
6ఒక రాజ్యం నా దేశం మీదికి వచ్చింది. 1 బలమైన వారుగా లెక్కలేనంత మంది వచ్చారు. 1 దాని పళ్లు సింహపు పళ్ళలా ఉన్నాయి. 1 అతనికి ఆడసింహం పళ్ళున్నాయి + 1:6 అతనికి ఆడసింహం పళ్ళున్నాయి ప్రకటన 9:7-10 . 1
7అతడు నా ద్రాక్షతోటను భయపెట్టేదిగా చేశాడు. 1 నా అంజూరపు చెట్టును ఒలిచి వేశాడు. 1 దాని బెరడు ఒలిచి పారేశాడు. 1 వాటి కొమ్మలు తెల్లబారాయి.
8తన పడుచు భర్తను కోల్పోయి గోనెసంచి కట్టుకున్న కన్యలా దుఖించు. 1
9నైవేద్యం, పానార్పణం యెహోవా మందిరంలోకి రాకుండ నిలిచి పోయాయి. 1 యెహోవా సేవకులు, యాజకులు ఏడుస్తున్నారు. 1
10పొలాలు పాడయ్యాయి. భూమి దుఖిస్తోంది. 1 ధాన్యం నాశనమైంది. కొత్త ద్రాక్షారసం లేదు. 1 నూనె ఒలికి పోయింది. 1
11గోదుమ, బార్లీ గురించి రైతులారా, సిగ్గుపడండి, 1 ద్రాక్ష రైతులారా దుఖించండి, పొలం పంట నాశనమయింది. 1
12ద్రాక్షతీగలు వాడిపోయాయి, అంజూరు చెట్లు ఎండిపోయాయి. 1 దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, ఆపిల్ చెట్లు, 1 పొలం లోని చెట్లన్నీ వాడిపోయాయి. 1 మనుషులకు సంతోషమే లేదు. 1 పశ్చాతపనికి పిలుపు
13యాజకులారా, గోనెపట్ట కట్టుకుని దుఖించండి! 1 బలిపీఠం దగ్గర సేవకులారా, ఏడవండి. 1 నా దేవుని సేవకులారా, గోనెసంచి కట్టుకుని రాత్రంతా గడపండి. 1 నైవేద్యం, పానార్పణం, మీ దేవుని మందిరానికి రాకుండా నిలిచిపోయాయి. 1
14ఉపవాస దినం ప్రతిష్ఠించండి. సంఘంగా సమకూడండి. 1 యెహోవాను బతిమాలడానికి పెద్దలనూ దేశ నివాసులందరినీ 1 మీ దేవుడు యెహోవా మందిరంలో సమకూర్చండి.
15యెహోవా దినం దగ్గర పడింది. 1 అయ్యో, అది ఎంత భయంకరమైన దినం! 1 సర్వశక్తుని దగ్గర నుంచి నాశనంగా అది వస్తుంది. 1
16మన కళ్ళముందే ఆహారం, 1 మన దేవుని మందిరంలో సంతోషానందాలు నిలిచిపోలేదా? 1
17విత్తనాలు మట్టిగడ్డల కింద కుళ్ళిపోతున్నాయి, 1 పైరు ఎండిపోవడంతో ధాన్యపుకొట్లు ఖాళీగా ఉన్నాయి, 1 కళ్లపుకొట్లు నేలమట్టమయ్యాయి.
18మేత లేక జంతువులు ఎంతగా మూలుగుతున్నాయి! 1 పశువుల మందలూ గొర్రెల మందలూ ఎంతగా అలమటిస్తున్నాయి! 1
19యెహోవా, నీకే నేను మొరపెడుతున్నాను. 1 అగ్ని అరణ్యంలోని మేతస్థలాలను కాల్చి వేసింది, 1 మంటలు తోటచెట్లన్నిటినీ కాల్చివేశాయి. 1
20కాలవలు ఎండిపోయాయి, 1 అరణ్యంలోని మేత స్థలాలు కాలిపోవడంతో 1 పొలాల్లోని పశువులు నీ కోసం దాహంగా ఉన్నాయి.