Joel 3
1ఆ రోజుల్లో, ఆ సమయంలో యూదావారిని, యెరూషలేము నివాసులను నేను చెరలోనుంచి రప్పించేటప్పుడు, 1
2ఇతర ప్రజలందరినీ సమకూర్చి, 1 యెహోషాపాతు లోయకు వారిని తీసుకువస్తాను. 1 నా ప్రజలను బట్టి, నా సొత్తయిన ఇశ్రాయేలును బట్టి 1 నేను అక్కడ వారిని శిక్షిస్తాను. 1 వారు నా ప్రజలను ఇతర ప్రజల మధ్యకు చెదరగొట్టి 1 నా దేశాన్ని పంచుకున్నారు. 1
3వారు నా ప్రజలకు చీట్లు వేసి, ఒక పసివాణ్ణి ఇచ్చి వేశ్యను తీసుకున్నారు. 1 తాగడానికి ద్రాక్ష మద్యం కోసం ఒక పిల్లను అమ్మేశారు.
4తూరు, సీదోను, ఫిలిష్తీయ ప్రాంత నివాసులారా, 1 నా మీద మీకెందుకు కోపం? నా మీద ప్రతీకారం చూపిస్తారా? 1 మీరు నా మీద ప్రతీకారం చూపించినా 1 మీరు చేసినదాన్ని త్వరలోనే మీ నెత్తి మీదికి రప్పిస్తాను. 1
5మీరు నా వెండి, నా బంగారాలను తీసుకుపోయారు. 1 నా విలువైన వస్తువులను పట్టుకుపోయి మీ గుళ్లలో ఉంచుకున్నారు. 1
6యూదావారూ యెరూషలేము నగరవాసులూ 1 తమ ప్రాంతం నుంచి దూరంగా ఉండాలని 1 మీరు వారిని గ్రీకులకు అమ్మేశారు.
7మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదికి రప్పిస్తాను. 1 మీరు వారిని అమ్మి పంపేసిన స్థలాలనుంచి వారు తిరిగి వచ్చేలా చేస్తాను. 1
8మీ కొడుకులనూ కూతుళ్ళను యూదావారికి అమ్మివేస్తాను. 1 వారు దూరంగా ఉండే షెబాయీయులకు వారిని అమ్మేస్తారు. 1 యెహోవా ఈ మాట చెప్పాడు.
9రాజ్యాల్లో ఈ విషయం చాటించండి, 1 యుద్ధానికి సిద్ధపడండి. శూరులను రేపండి. 1 వారిని దగ్గరికి రమ్మనండి. సైనికులంతా రావాలి. 1
10మీ నాగటి కర్రులను సాగగొట్టి కత్తులు చేయండి. 1 మీ మడ్డికత్తులు సాగగొట్టి ఈటెలు చేయండి. 1 “నాకు బలముంది” అని బలం లేనివాడు అనుకోవాలి.
11చుట్టుపట్లనున్న రాజ్యాల్లారా, 1 మీరంతా త్వరగా సమకూడిరండి. 1 యెహోవా, నీ గొప్ప శూరులను ఇక్కడికి తీసుకు రా. 1
12రాజ్యాలు లేచి యెహోషాపాతు లోయలోకి రావాలి. 1 చుట్టు పక్కలుండే రాజ్యాలకు 1 తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను. 1
13పంట పండింది. కొడవలి పెట్టి కోయండి. 1 రండి, ద్రాక్ష పళ్ళను తొక్కండి. గానుగ నిండి ఉంది. 1 తొట్లు పొర్లి పారుతున్నాయి. 1 వారి అపరాధం చాలా ఎక్కువగా ఉంది.
14తీర్పు తీర్చే లోయలో యెహోవా దినం సమీపంగా ఉంది. 1 తీర్పు తీర్చే లోయలో ప్రజలు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. 1
15సూర్య చంద్రులు చీకటైపోతారు. నక్షత్రాల కాంతి తప్పింది.
16యెహోవా సీయోనులో నుంచి గర్జిస్తాడు. 1 యెరూషలేములోనుంచి తన స్వరం పెంచుతాడు. 1 భూమ్యాకాశాలు కంపిస్తాయి. 1 అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయం. 1 ఇశ్రాయేలీయులకు కోటగా ఉంటాడు. 1 దేవుని ప్రజలకు నిత్యదీవవెనలు 1
17మీ యెహోవా దేవుణ్ణి నేనే, 1 నా పవిత్ర పర్వతమైన సీయోనులో నివసిస్తున్నానని మీరు తెలుసుకుంటారు. 1 అప్పుడు యెరూషలేము పవిత్ర పట్టణంగా ఉంటుంది. 1 వేరే దేశాల సేనలు దానిగుండా మళ్ళీ వెళ్ళరు.
18ఆ రోజుల్లో పర్వతాల మీద నుంచి కొత్త ద్రాక్షారసం పారుతుంది. 1 కొండల మీద నుంచి పాలు ప్రవహిస్తాయి. 1 యూదా వాగులన్నిటిలో నీళ్లు పారుతాయి. 1 యెహోవా మందిరంలో నుంచి నీటి ఊట ఉబికి పారి, 1 షిత్తీము లోయను తడుపుతుంది. 1
19కాబట్టి ఐగుప్తుదేశం పాడవుతుంది. 1 ఎదోము దేశం పాడైన ఎడారి అవుతుంది. 1 ఎందుకంటే యూదావారి మీద వాళ్ళు దౌర్జన్యం చేశారు, 1 వారి దేశంలో నిర్దోషుల రక్తం ఒలికించారు. 1
20యూదాలో ప్రజలు కలకాలం నివసిస్తారు. 1 తరతరాలకు యెరూషలేము నివాస స్థలంగా ఉంటుంది. 1
21వారి ప్రాణ నష్టానికి నేను ఇదివరకూ చేయని ప్రతీకారం చేస్తాను. యెహోవా సీయోనులో నివసిస్తున్నాడు.