Joel 2
1సీయోనులో బాకా ఊదండి, 1 నా పరిశుద్ధ పర్వతం మీద మేల్కొలిపే శబ్దం చేయండి! 1 యెహోవా దినం వస్తున్నదనీ అది సమీపమయ్యిందనీ 1 దేశనివాసులంతా భయంతో వణకుతారు గాక. 1
2అది చీకటి రోజు, గాఢాంధకారమయమైన రోజు. 1 కారు మబ్బులు కమ్మే కటిక చీకటి రోజు. 1 పర్వతాల మీద ఉదయకాంతి ప్రసరించినట్టు 1 బలమైన గొప్ప సేన వస్తూ ఉంది. 1 అలాంటి సేన ఎన్నడూ లేదు, ఇక ఎన్నడూ మళ్ళీ రాదు. 1 తరతరాల తరువాత కూడా అది ఉండదు.
3దాని ముందు అగ్ని అన్నిటినీ కాల్చేస్తున్నది. 1 వాటి వెనుక, మంట మండుతూ ఉంది. 1 అది రాకముందు భూమి ఏదెను తోటలా ఉంది. 1 అది వచ్చి వెళ్లిపోయిన తరువాత భూమి ఎడారిలా పాడయింది. 1 దానినుంచి ఏదీ తప్పించుకోలేదు.
4సేన రూపం, గుర్రాల లాగా ఉంది. 1 వాళ్ళు రౌతులలాగా పరుగెడుతున్నారు. 1
5వాళ్ళు పర్వత శిఖరాల మీద రథాలు పరుగులు పెడుతున్నట్టు వచ్చే శబ్దంతో దూకుతున్నారు. 1 ఎండిన దుబ్బు మంటల్లో కాలుతుంటే వచ్చే శబ్దంలా, 1 యుద్ధానికి సిద్ధమైన గొప్ప సేనలా ఉన్నారు.
6వాటిని చూసి ప్రజలు అల్లాడిపోతున్నారు, 1 అందరి ముఖాలు పాలిపోతున్నాయి. 1
7అవి శూరుల్లాగా పరుగెడుతున్నాయి. 1 సైనికుల్లాగా అవి గోడలెక్కుతున్నాయి. 1 అటూ ఇటూ తిరుగకుండా అవన్నీ తిన్నగా నడుస్తున్నాయి. 1
8ఒకదానినొకటి తోసుకోకుండా తమ దారిలో చక్కగా పోతున్నాయి. 1 ఆయుధాలు ఎదుర్కొన్నా వరుస తప్పవు. 1
9పట్టణంలో చొరబడుతున్నాయి. 1 గోడల మీద పరుగెడుతూ దొంగల్లాగా కిటికీల గుండా ఇళ్ళల్లోకి వస్తున్నాయి.
10వాటి ముందు భూమి కంపిస్తున్నది, 1 ఆకాశాలు వణుకుతున్నాయి. 1 సూర్యచంద్రులకు చీకటి కమ్ముకుంది. 1 నక్షత్రాలు కాంతి తప్పుతున్నాయి. 1
11యెహోవా తన సైన్యం ముందు తన స్వరం పెంచాడు, 1 ఆయన యోధులు చాలా ఎక్కువమంది. 1 ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారు బలవంతులు. 1 యెహోవా దినం గొప్పది, మహా భయంకరమైనది. 1 దాన్ని ఎవరు వైపుకోగలరు? 1 పశ్చాతపనికి పిలుపు
12యెహోవా ఇలా అంటున్నాడు, 1 “ఇప్పుడైనా, ఉపవాసముండి కన్నీళ్ళు కారుస్తూ దుఃఖిస్తూ 1 హృదయపూర్వకంగా నాదగ్గరికి తిరిగి రండి.” 1
13మీ యెహోవా దేవుడు అత్యంత కృప గలవాడూ దయగలవాడు. 1 త్వరగా కోపపడేవాడు కాదు. విస్తారంగా ప్రేమ చూపించేవాడు. 1 శిక్షించాలనే తన మనస్సు మార్చుకునేవాడు. 1 కాబట్టి మీ బట్టలు మాత్రమే కాక 1 మీ హృదయాలను చింపుకుని ఆయన వైపు తిరగండి.
14ఒకవేళ ఆయన మీ వైపు తిరిగి జాలి చూపుతాడేమో. 1 మీరు మీ యెహోవా దేవునికి తగిన నైవేద్యాన్ని, 1 పానార్పణాన్ని అర్పించేలా మిమ్మల్ని దీవిస్తాడేమో ఎవరికి తెలుసు?
15సీయోనులో బాకా ఊదండి. 1 ఉపవాసదినం ప్రతిష్ఠించండి. సంఘంగా కూడండి. 1
16ప్రజలను సమకూర్చండి. 1 సంఘాన్ని ప్రతిష్ఠించండి. పెద్దలను పిలిపించండి. 1 పిల్లలనూ చంటి పిల్లలనూ తీసుకురండి. 1 పెళ్లికొడుకులు తమ గదుల్లోనుంచి, 1 పెళ్లికూతుళ్ళు తమ పెళ్లి గదుల్లోనుంచి రావాలి.
17యెహోవాకు పరిచర్యచేసే సేవకులు, యాజకులు 1 మంటపానికీ బలిపీఠానికి మధ్య నిలబడి ఏడవాలి. 1 “యెహోవా, నీ ప్రజలను కనికరించు. 1 నీ సొత్తుగా ఉన్న వారిని సిగ్గుపడనివ్వకు. 1 వారి మీద రాజ్యాలను ఏలనివ్వకు. 1 వారి దేవుడు ఏమయ్యాడు? అని ఇతర ప్రజలు ఎందుకు చెప్పుకోవాలి?” 1 పశ్చాతాపం ద్వారా విమోచన
18అప్పుడు యెహోవా తన దేశాన్ని గురించి రోషంతో ఉన్నాడు. 1 తన ప్రజల పట్ల జాలితో ఉన్నాడు. 1
19యెహోవా తన ప్రజలకు ఇలా జవాబిచ్చాడు, 1 “నేను మీకు ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె పంపిస్తాను. 1 మీరు వాటితో తృప్తి చెందుతారు. 1 ఇకనుంచి మరెన్నడూ మిమ్మల్ని ఇతర ప్రజల్లో అవమానానికి గురిచేయను. 1
20ఉత్తర దిక్కు నుంచి వచ్చే సేనను మీకు దూరంగా పారదోలతాను. 1 వారిని ఎండిపోయి, పాడైపోయిన ప్రాంతానికి తోలివేస్తాను. 1 దాని ముందు భాగాన్ని తూర్పు సముద్రంలో, దాని వెనుక భాగాన్ని పడమటి సముద్రంలో పడేస్తాను. 1 అది కంపు కొడుతుంది, చెడ్డవాసన వస్తుంది. 1 నేను గొప్ప పనులు చేస్తాను.” 1
21దేశమా, భయపడక సంతోషించి గంతులు వెయ్యి. 1 యెహోవా గొప్ప పనులు చేశాడు. 1
22పశువులారా, భయపడవద్దు. గడ్డిబీళ్లలో పచ్చిక మొలుస్తుంది. 1 చెట్లు కాయలు కాస్తాయి. అంజూరపుచెట్లు, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి. 1
23సీయోను ప్రజలారా, ఆనందించండి. 1 మీ యెహోవా దేవుణ్ణి తలుచుకుని సంతోషించండి. 1 ఆయన నీతి బట్టి మీ కోసం సరిపోయినంత తొలకరి వాన, వాన జల్లు పంపిస్తాడు. 1 ముందులాగా తొలకరి వాన, కడవరి వాన కురిపిస్తాడు.
24కళ్ళాలు గోదుమ గింజలతో నిండి ఉంటాయి. 1 కొత్త ద్రాక్షారసం, నూనెతో తొట్లు పొర్లి పారతాయి. 1
25“ఎగిరే మిడతల గుంపులూ పెద్ద మిడతలూ మిడత పిల్లలూ గొంగళి పురుగులూ, 1 ఆ నా మహాసేన తినేసిన సంవత్సరాల పంటను మీకు మళ్ళీ ఇస్తాను.
26మీరు కడుపునిండా తిని తృప్తి పడతారు. 1 మీ మధ్య చేసిన అద్భుతాలను బట్టి 1 మీ యెహోవా దేవుని పేరును స్తుతిస్తారు. 1 నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను. 1
27అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉంది నేనే అనీ, 1 నేనే మీ యెహోవా దేవుడిననీ, 1 నేను తప్ప వేరే దేవుడు లేడనీ మీరు తెలుసుకుంటారు. 1 నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను. 1 దీవుని ఆత్మ ప్రోక్షణకు సంబంధించిన వాగ్దానం
28తరువాత నేను ప్రజలందరి మీద 1 నా ఆత్మను కుమ్మరిస్తాను. 1 మీ కొడుకులూ మీ కూతుర్లూ ప్రవచనాలు చెబుతారు. 1 మీ ముసలివారు కలలుకంటారు. 1 మీ యువకులకు దర్శనాలు వస్తాయి. 1
29ఆ రోజుల్లో నేను పనివారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను.
30ఆకాశంలో అద్భుతాలు చూపిస్తాను. 1 భూమ్మీద రక్తం, మంటలు, ఎత్తయిన పొగ కలిగిస్తాను. 1
31యెహోవా భయంకరమైన ఆ మహాదినం రాకముందు 1 సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంలా మారతాయి. 1
32యెహోవా పేరున ప్రార్థనచేసే వారందరినీ కాపాడడం జరుగుతుంది. 1 యెహోవా చెప్పినట్టు సీయోను కొండమీద, యెరూషలేములో తప్పించుకున్నవారుంటారు. 1 యెహోవా ఏర్పాటు చేసుకున్నవాళ్ళు మిగులుతారు.”