Deuteronomy · బైబిల్ (తెలుగు)

Deuteronomy 22

1మీ సాటి పౌరుడి ఎద్దు, లేదా గొర్రె దారి తప్పిపోయి తిరగడం మీరు చూస్తే దాన్ని చూడనట్టు కళ్ళు మూసుకోకుండా తప్పకుండా దాని యజమాని దగ్గరికి మళ్లించాలి.

2మీ సహోదరుడు మీకు అందుబాటులో లేకపోయినా, అతడు మీకు తెలియకపోయినా దాన్ని మీ ఇంటికి తోలుకుపోవాలి. అతడు దాన్ని వెతికే వరకూ అది మీ దగ్గర ఉండాలి. అప్పుడు అతనికి దాన్ని తిరిగి అప్పగించాలి.

3అతని గాడిద, దుస్తుల విషయంలో కూడా మీరు అలాగే చెయ్యాలి. మీ తోటి ప్రజలు పోగొట్టుకున్నది ఏదైనా మీకు దొరకితే దాన్ని గురించి అలాగే చెయ్యాలి. మీరు దాన్ని చూసీ చూడనట్టు ఉండకూడదు.

4మీ సాటి మనిషి గాడిద, ఎద్దు దారిలో పడి ఉండడం మీరు చూస్తే వాటిని చూడనట్టు కళ్ళు మూసుకోకూడదు. వాటిని లేపడానికి తప్పకుండా సాయం చెయ్యాలి.

5ఏ స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు. పురుషుడు స్త్రీ వేషం ధరించకూడదు. అలా చేసేవారంతా మీ దేవుడైన యెహోవాకు అసహ్యులు.

6చెట్టు మీదగానీ, నేల మీదగానీ, దారిలోగానీ పక్షిగుడ్లు గానీ పిల్లలు గానీ ఉన్న గూడు మీకు కనబడితే తల్లి ఆ పిల్లల మీద గానీ, ఆ గుడ్ల మీద గానీ పొదుగుతూ ఉన్నప్పుడు ఆ పిల్లలతో పాటు తల్లిపక్షిని తీసుకోకూడదు.

7మీకు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులయ్యేలా తప్పకుండా తల్లిని విడిచిపెట్టి పిల్లలను తీసుకోవచ్చు.

8మీరు కొత్త ఇల్లు కట్టించుకొనేటప్పుడు ఇంటి పైకప్పు చుట్టూ పిట్టగోడ కట్టించాలి. అప్పుడు దాని మీద నుంచి ఎవరైనా పడిపోతే మీ ఇంటి మీద హత్యాదోషం ఉండదు.

9మీ ద్రాక్షతోటలో రెండు రకాల విత్తనాలను విత్తకూడదు. అలా + 22:9 అలా చేస్తే ద్రాక్ష పంట మైలబడి పోతుంది.చేస్తే మీరు వేసిన పంట, ద్రాక్షతోట రాబడి మొత్తం, దేవాలయానికి ప్రతిష్టితమవుతుంది.

10ఎద్దునూ గాడిదనూ జతచేసి భూమిని దున్నకూడదు.

11ఉన్ని, జనపనారతో కలిపి నేసిన దుస్తులు ధరించకూడదు.

12మీరు కప్పుకొనే మీ దుస్తుల నాలుగు అంచులకు అల్లికలు చేసుకోవాలి. 1 పెళ్ళి ఉల్లంఘనలు

13ఒకడు స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెతో శారీరకంగా ఏకమైన తరువాత ఆమెను అనుమానించి

14“ఈ స్త్రీని పెళ్ళి చేసుకుని ఈమె దగ్గరికి వస్తే ఈమెలో నాకు కన్యత్వం కనబడలేదు” అని నేరారోపణ చేసాడనుకోండి.

15ఆ స్త్రీ తల్లిదండ్రులు పట్టణ ద్వారం దగ్గర ఉన్న ఆ ఊరి పెద్దల దగ్గరికి ఆ యువతి కన్యాత్వ నిదర్శనం చూపించాలి.

16అప్పుడు ఆ స్త్రీ తండ్రి “నా కూతుర్ని ఇతనికిచ్చి పెళ్ళిచేస్తే ఇతడు ‘ఈమెలో కన్యాత్వం కనబడలేదని’ అవమానించి ఆమె మీద నింద మోపాడు.

17అయితే నా కూతురు కన్య అని రుజువు పరిచే నిదర్శనం ఇదే” అని పెద్దలతో చెప్పి, పట్టణపు పెద్దల ఎదుట ఆ వస్త్రం పరచాలి.

18అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ వ్యక్తిని పట్టుకుని శిక్షించి, 100 వెండి నాణాలు అపరాధ రుసుం అతడి దగ్గర తీసుకుని ఆ స్త్రీ తండ్రికి చెల్లించాలి.

19ఎందుకంటే అతడు ఇశ్రాయేలు కన్యను అవమానపరిచాడు. ఇకపై ఆమె అతనికి భార్యగా ఉంటుంది. అతడు తాను జీవించే కాలమంతా ఆమెను విడిచి పెట్టకూడదు.

20అయితే ఆ వ్యక్తి ఆరోపించిన నింద నిజమైనప్పుడు, అంటే ఆ కన్యలో కన్యాత్వం కనబడని పక్షంలో

21పెద్దలు ఆమె తండ్రి ఇంటికి ఆమెను తీసుకురావాలి. అప్పుడు ఆమె ఊరి ప్రజలు ఆమెను రాళ్లతో కొట్టి చావగొట్టాలి. ఎందుకంటే ఆమె + 22:21 అంటే ఇంట్లో.తన పుట్టింట్లో వ్యభిచరించి ఇశ్రాయేలులో చెడ్డ పని చేసింది. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని మీ మధ్యనుంచి మీరు రూపుమాపుతారు.

22ఎవడైనా మరొకడి భార్యతో శారీరకంగా కలుస్తూ పట్టుబడితే వారిద్దరినీ, అంటే ఆ స్త్రీతో శారీరకంగా కలిసిన పురుషుడినీ, స్త్రీనీ చంపాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని ఇశ్రాయేలులో నుంచి రూపుమాపుతారు.

23కన్య అయిన స్త్రీ తనకు ప్రదానం జరిగిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శారీరకంగా కలిస్తే

24ఆ ఊరి ద్వారం దగ్గరికి వారిద్దరినీ తీసుకువచ్చి, ఆ స్త్రీ ఊరిలోని ప్రజలను పిలవనందుకు ఆమెనూ, తన పొరుగువాడి భార్యను అవమాన పరచినందుకు ఆ వ్యక్తినీ రాళ్లతో చావగొట్టాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని మీలోనుంచి రూపుమాపాలి.

25ప్రదానం జరిగిన కన్యను పొలంలో ఒకడు కలుసుకున్నప్పుడు అతడు ఆమెను బలవంతం చేసి, ఆమెతో శారీరకంగా కలిస్తే, ఆమెతో శారీరకంగా కలిసిన వాడు మాత్రమే చావాలి.

26ఆ కన్యను ఏమీ చేయకూడదు, ఎందుకంటే ఆ కన్య మరణానికి గురి అయ్యేంత పాపం చేయలేదు. ఒకడు తన పొరుగు వాడి మీద పడి చంపేసినట్టే ఇది జరిగింది.

27అతడు ఆమెను పొలంలో కలుసుకుంటే ప్రదానం జరిగిన ఆ కన్య కేకలు వేసినప్పుడు ఆమెను కాపాడడానికి ఎవరూ లేరు.

28ఒకడు ప్రదానం జరగని కన్యను పట్టుకుని ఆమెతో శారీరకంగా కలిసిన విషయం తెలిసినప్పుడు

29ఆమెతో శారీరకంగా కలిసినవాడు ఆ కన్య తండ్రికి 50 వెండి నాణాలు చెల్లించి ఆమెను పెళ్లి చేసుకోవాలి. అతడు ఆమెను ఆవమానపరచాడు కాబట్టి అతడు జీవించినంత కాలం ఆమెను విడిచి పెట్టకూడదు.

30ఎవ్వరూ తన + 22:30 తండ్రి భార్యల్లో ఎవరితోనైనా.తండ్రి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోకూడదు. తన తండ్రికి అప్రతిష్ట కలిగించకూడదు.

← Deuteronomy 21Read In The App, Free →Deuteronomy 23 →

Study Deuteronomy 22

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

12345678910111213141516171819202122232425262728293031323334