Deuteronomy · బైబిల్ (తెలుగు)

Deuteronomy 33

1దేవుని సేవకుడు మోషే చనిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలను ఇలా దీవించాడు. యెహోవా సీనాయి పర్వతం నుంచి బయలుదేరాడు 1

2శేయీరు నుంచి వారికి ఉదయించాడు. 1 ఆయన పారాను పర్వతం నుంచి ప్రకాశించాడు 1 వేలాది వేల పవిత్రులతో ఆయన వచ్చాడు. 1 ఆయన కుడివైపు మెరుపులు మెరుస్తున్నాయి. 1

3నిజంగా ఆయన ఆ ప్రజలను ప్రేమిస్తాడు. 1 ఆయన పరిశుద్ధులంతా నీ చేతిలో ఉన్నారు, 1 వారు నీ పాదాల దగ్గర వంగి నీ మాటలు విన్నారు. 1

4మోషే మనకు ధర్మశాస్త్రాన్ని బోధించాడు, 1 యాకోబు సమాజానికి అది వారసత్వం. 1

5అప్పుడు ప్రజల అధికారులూ 1 ఇశ్రాయేలు గోత్రాలవారూ ఒకచోట చేరితే 1 యెహోవా యెషూరూనులో రాజయ్యాడు. 1

6రూబేను చావకూడదు. బతకాలి. 1 అయితే వారు కొద్ది మంది మాత్రమే. 1

7యూదా గురించి మోషే ఇలా పలికాడు, 1 యెహోవా, యూదా ప్రజల మనవి విని, 1 మళ్ళీ అతన్ని తన ప్రజల దగ్గరికి చేర్చు. 1 అతని కోసం పోరాడు. 1 అతని శత్రువులకు విరోధంగా అతనికి సహాయం చెయ్యి 1

8లేవీ గురించి మోషే ఇలా పలికాడు, 1 నీ తుమ్మీము, నీ ఊరీము నీ భక్తుడి కోసం ఉన్నాయి. 1 మస్సాలో నువ్వు అతణ్ణి పరీక్షించావు. 1 మెరీబా నీళ్ల దగ్గర అతనితో నువ్వు పోరాడావు. 1

9నేను వాళ్ళని చూడలేదు, అని తన తండ్రి గురించి, 1 తన తల్లి గురించి అన్నవాడు అతడు. 1 తన సోదరులను లెక్క చెయ్యలేదు. 1 తన సొంత కొడుకులను పట్టించుకోలేదు. 1 ఎందుకంటే అతడు నీ మాటలను భద్రం చేశాడు. 1 నీ నిబంధన పాటించాడు. 1

10అతడు యాకోబుకు నీ విధులనూ, 1 ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రాన్నీ నేర్పిస్తాడు. 1 అతడు నీ ఎదుట సాంబ్రాణి వేస్తాడు. 1 నీ బలిపీఠం మీద సర్వాంగబలి అర్పిస్తాడు. 1

11యెహోవా, అతని ఆధిపత్యాలను దీవించు, 1 అతడు చేసే పనులను అంగీకరించు. 1 అతనికి విరోధంగా లేచే వారి, 1 అతన్ని ద్వేషించేవారి నడుములు విరగ్గొట్టు. 1 వాళ్ళు మళ్ళీ లేవరు. 1

12బెన్యామీను గురించి మోషే ఇలా పలికాడు, 1 యెహోవాకు ప్రియుడు. 1 ఆయన దగ్గర అతడు క్షేమంగా ఉంటాడు. 1 రోజంతా యెహోవా అతనికి అండగా ఉంటాడు. 1 అతడు యెహోవా భుజాల మధ్య నివసిస్తాడు. 1

13యోసేపు గురించి మోషే ఇలా పలికాడు. 1 యెహోవా అతని భూమిని దీవిస్తాడు 1 ఆకాశం నుంచి వచ్చే శ్రేష్ఠమైన మంచుతో, 1 కింద ఉన్న జలాగాధంతో, 1

14సూర్యుని వల్ల వచ్చే శ్రేష్ఠమైన పంటతో, 1 నెలనెలా పండే శ్రేష్ఠమైన పండ్లతో, 1

15పురాతన పర్వతాల శ్రేష్ఠ పదార్థాలతో, 1 శాశ్వతమైన కొండల శ్రేష్ఠ పదార్థాలతో, 1

16భూమి ఇచ్చే శ్రేష్ఠ పదార్థాలతో, దాని సమృద్ధితో, 1 పొదలో కనిపించిన వాడి దయ యోసేపు తల మీదికి వస్తుంది గాక. 1 తన సోదరుల్లో రాకుమారుడి నుదిటి మీదకు అది వస్తుంది గాక. 1

17తొలిచూలు ఎద్దు ఠీవి అతనికుంది. 1 అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు. 1 వాటితో అతడు ప్రజలను 1 భూదిగంతాలకు తోలివేస్తాడు. 1 వీరంతా ఎఫ్రాయింకు చెందిన వేలమంది. 1 మనష్షేకు చెందిన వేలమంది. 1

18జెబూలూను గురించి మోషే ఇలా పలికాడు, 1 జెబూలూనూ, నువ్వు బయలు దేరేటప్పుడు సంతోషించు. 1 ఇశ్శాఖారూ, నువ్వు నీ గుడారాల్లో సంతోషించు. 1

19వాళ్ళు ప్రజలను పర్వతాలకు పిలుస్తారు. 1 అక్కడ సరైన బలులు అర్పిస్తారు. 1 వారు సముద్రాల సమృద్ధినీ 1 సముద్ర తీర ఇసుకలో దాగిన నిధులనూ తీస్తారు. 1

20గాదు గురించి మోషే ఇలా పలికాడు. 1 గాదు ప్రాంతాన్ని విశాలం చేసేవాడికి దీవెన. 1 ఆ గోత్రం ఆడ సింహంలా పొంచి ఉంటుంది 1 చేతిని, నడినెత్తిని చీల్చివేస్తుంది. 1

21అతడు తనకోసం శ్రేష్ఠమైన భాగాన్ని చూసుకున్నాడు. 1 నాయకుని భాగం అక్కడ కేటాయించబడింది. 1 ప్రజల ప్రముఖులు సమకూడినప్పుడు, 1 యెహోవా తీర్చిన న్యాయాన్ని అమలు చేశాడు. 1 ఇశ్రాయేలు ప్రజల విషయం యెహోవా న్యాయ విధుల ప్రకారం జరిగించాడు. 1

22దాను విషయం మోషే ఇలా పలికాడు, 1 దాను సింహపు పిల్ల వంటిది 1 అది బాషానునుంచి దూకుతుంది. 1

23నఫ్తాలి విషయం మోషే ఇలా పలికాడు. 1 కనికరంతో సంతృప్తి నొందిన నఫ్తాలి, 1 యెహోవా దీవెనతో నిండిన నఫ్తాలి, 1 పశ్చిమ దక్షిణ ప్రాంతాలు నీ స్వాధీనం. 1

24ఆషేరు విషయం మోషే ఇలా పలికాడు, 1 మిగిలిన కొడుకుల కంటే ఆషేరుకు ఎక్కువ దీవెన. 1 తన సోదరుల కంటే ఎక్కువ కటాక్షం పొందుతాడు. 1 తన పాదాలు ఒలీవ నూనెలో ముంచుతాడు 1

25నీ కమ్ములు ఇనుపవీ, కంచువీ. 1 నువ్వు బతికిన కాలమంతా నీకు భద్రతే. 1

26యెషూరూనూ, నీ దేవుణ్ణి పోలిన వాడెవడూ లేడు 1 నీ సహాయానికి ఆకాశ వాహనుడుగా ఆయన వస్తాడు 1 తన ఘనతతో మేఘాల్లో నుండి వస్తాడు. 1

27నిత్య దేవుడు నీకు ఆశ్రయం, 1 శాశ్వతమైన హస్తాలు నీ కింద ఉన్నాయి. 1 శత్రువును ఆయన నీ ఎదుట నుంచి గెంటి వేస్తాడు. 1 నాశనం చెయ్యి! అంటాడు. 1

28ఇశ్రాయేలు ప్రజలు భద్రంగా నివసిస్తారు. 1 యాకోబు + 33:28 యాకోబు నీటి ఊటనివాసం సురక్షితం. 1 ధాన్యం, కొత్త ద్రాక్షారసాలున్న దేశంలో 1 అతనిపై ఆకాశం నిజంగా మంచు కురుస్తుంది. 1

29ఇశ్రాయేలూ! మీరెంత ధన్యులు! 1 యెహోవా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారెవరు? 1 ఆయనే మిమ్మల్ని కాపాడే డాలు వంటివాడు, 1 ఆయన మీకు ఘనమైన కత్తి వంటివాడు. 1 నీ శత్రువులు వణుకుతూ నీకు లోబడతారు 1 నువ్వు వారి + 33:29 వీపులనుఎత్తయిన స్థలాలను తొక్కుతావు.

← Deuteronomy 32Read In The App, Free →Deuteronomy 34 →

Study Deuteronomy 33

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

12345678910111213141516171819202122232425262728293031323334