Job · బైబిల్ (తెలుగు)

Job 18

1అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా జవాబిచ్చాడు. 1

2ఎంతసేపు మాటలు వెదుక్కుంటూ నన్ను చిక్కుల్లో పడేయాలని చూస్తావు? నువ్వు ఆలోచించుకో. తరువాత నేను మాట్లాడతాను. 1

3నువ్వెందుకు మమ్మల్ని మూర్ఖులుగా, పశువులుగా ఎంచుతున్నావు? 1

4అమితమైన కోపంతో నిన్ను నువ్వే చీల్చుకొంటున్నావు. నీ కోసం భూమి అంతా పాడైపోవాలా? నువ్వు కోరుకున్నావని కొండ తన స్థానం మార్చుకుంటుందా? 1

5భక్తిహీనుల దీపం తప్పక ఆరిపోతుంది. వాళ్ళ ఇళ్ళల్లో దీపాలు వెలగకుండా పోతాయి. 1

6వాళ్ళ నివాసాల్లో ఉన్న వెలుగు చీకటిగా మారిపోతుంది. వాళ్ళ దగ్గర ఉన్న దీపం ఆరిపోతుంది. 1

7వాళ్ళ బలమైన అడుగులు మార్గం తప్పుతాయి. వాళ్ళ సొంత ఆలోచనలు పతనానికి నడిపిస్తాయి. 1

8వాళ్ళు బోనుల్లోకి నడుస్తూ వెళ్ళే వాళ్ళు. వాళ్ళ పాదాలు వాళ్ళను వలలో పడేలా నడిపిస్తాయి. 1

9వాళ్ళ మడిమెలు బోనులో ఇరుక్కుంటాయి. వాళ్ళు ఉచ్చులో చిక్కుకుంటారు. 1

10వాళ్ళ కోసం ఉరి నేలపై సిద్ధంగా ఉంది. వాళ్ళను పట్టుకోవడానికి దారిలో ఉచ్చు బిగించి ఉంది. 1

11అన్నివైపుల నుండి భయం కలిగించే విషయాలు వాళ్ళను చుట్టుముడతాయి. భయాలు అన్నివైపులకు వాళ్ళను వెంటాడి తరుముతాయి. 1

12వాళ్ళ బలం క్షీణించిపోతుంది. వాళ్ళను కూల్చడానికి సిద్ధంగా ఆపద ఉంటుంది. 1

13అది వాళ్ళ అవయవాలను తినివేస్తుంది. మరణకరమైన రోగం వాళ్ళ శరీరాన్ని క్షీణింపజేస్తుంది. 1

14వాళ్ళు నిర్భయంగా తమ గుడారాల్లో ఉన్నప్పుడు వారిని బయటకు ఈడ్చివేస్తారు. వారిని క్రూరుడైన రాజు దగ్గరికి బందీలుగా కొనిపోతారు. 1

15వాళ్లకు సంబంధంలేని ఇతరులు వాళ్ళ గుడారాల్లో కాపురం ఉంటారు. వాళ్ళ నివాసస్థలాల మీద గంధకం చల్లడం జరుగుతుంది. 1

16వాళ్ళ వేళ్లు కింద ఉన్నవి కిందనే ఎండిపోతాయి. పైన ఉన్న వాళ్ళ కొమ్మలు నరకబడతాయి. 1

17భూమి మీద వాళ్ళ ఆనవాళ్ళు తుడిచి పెట్టుకు పోతాయి. భూతలంపై వాళ్ళను జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. 1

18వాళ్ళను వెలుగులో నుండి చీకటిలోకి తోలివేస్తారు. భూమిపై లేకుండా వాళ్ళను తరుముతారు. 1

19వాళ్లకు కొడుకులు, మనవలు ఎవ్వరూ మిగలరు. వాళ్ళ ఇంట సజీవంగా ఉండే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. 1

20వాళ్లకు పట్టిన దుర్గతిని చూసి తరువాత వచ్చిన పశ్చిమ దేశస్తులు ఆశ్చర్యపోతారు. తూర్పున ఉన్న వాళ్ళు భయభ్రాంతులకు లోనౌతారు. 1

21భక్తిహీనుల నివాసాలకు, దేవుణ్ణి ఎరగని ప్రజల స్థలాలకు ఇలాంటి గతి తప్పకుండా పడుతుంది.

← Job 17Read In The App, Free →Job 19 →

Study Job 18

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142