Job · బైబిల్ (తెలుగు)

Job 6

1అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు. 1

2ఎవరైనా నాకు కలిగిన దుఃఖాన్ని సరిగా తూస్తారు గాక. నాకు వచ్చిన ఆపదను త్రాసులో ఉంచుతారు గాక. 1

3అలా చేసినప్పుడు నా దుఃఖం సముద్రంలో ఉన్న ఇసక కన్నా బరువుగా ఉంటుంది. అందుకనే నేను వ్యర్ధమైన మాటలు పలికాను. 1

4సర్వశక్తిమంతుడైన దేవుడు వేసిన బాణాలు నాలో దిగాయి. వాటి విషం నా ఆత్మలో వ్యాపిస్తూ ఉంది. నాతో యుద్ధం చేయడానికి దేవుని భయంకరమైన చర్యలు వరసగా నిలిచి ఉన్నాయి. 1

5అడవి గాడిదకు మేత ఉన్నప్పుడు అది అరుస్తుందా? ఎద్దు తన మేతను చూసి రంకెలు వేస్తుందా? 1

6ఉప్పు లేకుండా చప్పగా ఉండే వాటిని ఎవరైనా తింటారా? గుడ్డులోని తెల్ల సొనకు రుచి ఉంటుందా? 1

7అలాంటి వాటిని తీసుకోవడం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ వాటినే నేను తినవలసి వస్తుంది. 1

8నా విన్నపాలు తీరితే ఎంత బాగుంటుంది! నేను కోరినదంతా దేవుడు అనుగ్రహిస్తే ఎంత బాగుంటుంది! 1

9దేవుడు తన ఇష్టప్రకారం నన్ను నలగ్గొడతాడు గాక. తన చెయ్యి ఎత్తి నన్ను కడతేరుస్తాడు గాక. 1

10ఇదే నాకు ఓదార్పు అవుతుంది. మానని నొప్పిని బట్టి నేను అతిశయపడతాను. అప్పుడు కనీసం పరిశుద్ధ దేవుని మాటలను తోసిపుచ్చలేదన్న ఆదరణన్నా నాకు మిగులుతుంది. 1

11నాకున్న బలం ఎంత? నేను దేని కోసం ఎదురు చూడాలి? నా అంతిమ స్థితి ఏమిటి? ఇదంతా నేను ఎందుకు ఓర్చుకోవాలి? 1

12నాకు రాళ్లకు ఉన్నంత గట్టితనం ఉందా? నా శరీరం ఇత్తడిదా? 1

13నాలో నుంచి నాకు సహాయం ఏమీ దొరకదు గదా. నాలో నుండి నా శక్తి అంతా సన్నగిల్లిపోయింది గదా. 1

14కుంగిపోయిన వ్యక్తి సర్వశక్తుడైన దేవుని పట్ల భయభక్తులు విడిచినప్పటికీ అతని స్నేహితుని ఆదరణకు పాత్రుడు అవుతాడు. 1

15నా స్నేహితులు ఎండిపోయిన చిన్న కాలవలాగా, కనబడకుండా మాయమైపోయే ప్రవాహంలాగా నమ్మకూడని వారుగా మారారు. 1

16అలాంటి ప్రవాహాలు కరిగిపోయిన మంచుగడ్డలతో, కురిసిన మంచుతో మురికిగా కనబడతాయి. 1

17వేసవికాలంలో అవి మాయమైపోతాయి. వేడి తగిలినప్పుడు అవి ఉన్నచోట్ల నుండి ఆవిరైపోతాయి. 1

18వాటి నుండి ప్రవహించే నీళ్ళు దారి మళ్ళుతాయి. ఏమీ కనబడకుండా అవి ఇంకిపోతాయి. 1

19తేమా నుండి గుంపులుగా బయలు దేరి వచ్చే వ్యాపారులు వాటి కోసం వెతుకుతారు. షేబ వర్తకులు వాటి కోసం ఆశిస్తారు. 1

20వాటిని నమ్మినందుకు వాళ్ళు అవమానం పొందుతారు. వాటిని సమీపించి కలవరానికి గురౌతారు. 1

21మీరు ఆ ప్రవాహం వలే ఉండీ లేనట్టుగా ఉన్నారు. నా దీన స్థితిని చూసి మీరు భయపడుతున్నారు. 1

22నాకు ఏమైనా సహాయం చేయమని మిమ్మల్ని అడిగానా? మీ ఆస్తిలో నుండి నా కోసం భాగం ఏమైనా ఇమ్మని అడిగానా? 1

23శత్రువు చేతిలోనుండి నన్ను విడిపించమని అడిగానా? నన్ను బాధ పెడుతున్నవాళ్ళ బారి నుండి కాపాడమని అడిగానా? 1

24నాకు మంచి మాటలు చెప్పండి. నేను మౌనంగా మీరు చెప్పేది వింటాను. ఏ ఏ విషయాల్లో నేను తప్పిపోయానో నాకు తెలియపరచండి. 1

25యథార్థమైన మాటలు ఎంతో ప్రభావం చూపుతాయి. అయినా మీ గద్దింపుల వల్ల ప్రయోజనం ఏమిటి? 1

26నా మాటలను ఖండించాలని మీరు అనుకుంటున్నారా? నిరాశాపూరితమైన నా మాటలు గాలిలో కొట్టుకుపోతాయి గదా. 1

27మీరు తండ్రిలేని అనాథలను కొనేందుకు చీట్లు వేసే మనుషుల వంటివారు. మీ స్నేహితుల మీద బేరాలు సాగించే గుణం మీది. 1

28దయచేసి నన్ను చూడండి. మీ సమక్షంలో నేను అబద్ధాలు చెబుతానా? 1

29ఆలోచించండి. మీరు చెప్పే తీర్పులో అన్యాయం ఉండకూడదు. మళ్ళీ ఆలోచించండి, ఈ విషయాల్లో నేను నిర్దోషిని. 1

30నేను అన్యాయపు మాటలు పలుకుతానా? దుర్మార్గమైన మాటలు పలకకుండా నా నోరు అదుపులో ఉండదా?

← Job 5Read In The App, Free →Job 7 →

Study Job 6

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142