Job · బైబిల్ (తెలుగు)

Job 37

1దీన్ని బట్టి నా హృదయం వణకుతున్నది. దాని చోటి నుండి అది కదలి పోతున్నది. 1

2దేవుని స్వర గర్జనం వినండి. ఆయన నోటి నుండి వెలువడే శబ్దం వినండి. 1

3ఆకాశ వైశాల్యమంతటి కింద ఆయన దాన్ని వినిపిస్తాడు. భూమి కొనల దాకా తన మెరుపును పంపిస్తాడు. 1

4దాని తరువాత గొప్ప స్వరం గర్జిస్తుంది. ఆయన తన గంభీరమైన స్వరంతో సింహనాదం చేస్తాడు. ఆయన ధ్వని వినబడేటప్పుడు ఆయన మెరుపును అడ్డగించడు. 1

5దేవుడు ఆశ్చర్యంగా ఉరుము ధ్వని చేస్తాడు. మనం గ్రహించలేని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. 1

6నువ్వు భూమి మీద పడమని మంచుకు, వర్షానికి, జడివానకు ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. 1

7మనుషులందరూ ఆయన సృష్టికార్యాన్ని తెలుసుకునేలా ఆయన ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేశాడు. 1

8జంతువులు వాటి గుహల్లో దూరి దాక్కుంటాయి. 1

9దక్షిణాన తుఫాను దాని ఆవాసం నుండి వస్తుంది. ఉత్తర దిక్కు నుండి చెదరగొట్టే చలి గాలులు వీస్తాయి. 1

10దేవుని ఊపిరి వలన మంచు పుడుతుంది. జల విశాలమంతా ఘనీభవిస్తుంది. 1

11ఆయన దట్టమైన మేఘాన్ని జలంతో నింపుతాడు. తన మెరుపుల మేఘాన్ని వ్యాపింపజేస్తాడు. 1

12ఆయన పంపించగా మనుషులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపు, మేఘాలు సంచారం చేస్తాయి. ఆయన వాటికి ఆజ్ఞాపించేది అంతా అవి నెరవేరుస్తాయి. 1

13ఇదంతా ఆయన శిక్ష కోసం గాని, తన భూలోకం కోసం గాని కృపా భరితమైన నమ్మకత్వం కోసం గాని నెరవేరుస్తాడు. 1 దేవుని అద్భుత క్రియలను ఆలోచించడం 1

14యోబు, ఈ మాట ఆలకించు. మౌనం వహించి దేవుని అద్భుత క్రియలను ఆలోచించు. 1

15దేవుడు తన మేఘం మెరుపు ప్రకాశించాలని ఎలా తీర్మానం చేస్తాడో నీకు తెలుసా? 1

16మేఘాలను తేలజేయడం పరిపూర్ణ జ్ఞానం గలవాడి మహా కార్యమని నీకు తెలుసా? 1

17దక్షిణపుగాలి వీయడం వలన ఉక్క పోసేటప్పుడు నీ బట్టలు ఎలా వెచ్చబడ్డాయో నీకు తెలుసా? 1

18పోత పోసిన అద్దమంత దట్టమైన ఆకాశాన్ని ఆయన వ్యాపింపజేసినట్టు నువ్వు వ్యాపింపజేయగలవా? 1

19మేము ఆయనతో ఏమి పలకాలో అది మాకు నేర్పు. మా మనసుల్లో చీకటి వల్ల మా వాదాలు ఎలా వినిపించాలో తోచడం లేదు. 1

20నేను పలుకుతానని ఎవరైనా ఆయనతో చెప్పవచ్చా? ఎవరైనా తాను నాశనమై పోవాలని కోరతాడా? 1

21ఎత్తుగా ఉన్న మేఘంలో ప్రకాశించే ఎండ ఇప్పుడు కనబడకపోయినా గాలి మేఘాలను పోగొట్టి దాన్ని తేటగా కనపరుస్తుంది. 1

22ఉత్తర దిక్కున బంగారు కాంతి పుడుతుంది. దేవుడు భీకరమైన మహిమను ధరించుకుని ఉన్నాడు. 1

23సర్వశక్తుడైన దేవుడు మహాత్మ్యం గలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయాన్ని, నీతిని ఆయన ఏమాత్రం చెరపడు. అందువలన మనుషులు ఆయనపట్ల భయభక్తులు కలిగి ఉంటారు. 1

24తాము జ్ఞానులం అనుకునే వారిని ఆయన ఏమాత్రం లక్ష్యపెట్టడు.

← Job 36Read In The App, Free →Job 38 →

Study Job 37

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142