Song of Solomon · బైబిల్ (తెలుగు)

Song of Solomon 2

1(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) 1 నేను కేవలం మైదానంలోని పువ్వును. 1 కేవలం లోయలోని లిల్లీ పువ్వును.

2(ఆ వ్యక్తి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు) 1 ప్రేయసీ! నువ్వు నా దేశపు యువతుల మధ్య ముళ్ళ చెట్లలో లిల్లీ లాగా ఉన్నావు.

3(ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) 1 అడవి చెట్టుల్లో ఆపిల్ వృక్షంలా, యువకుల్లో నా ప్రియుడున్నాడు. 1 ఉప్పొంగి పోతూ నేనతని నీడలో కూర్చున్నాను. 1 అతని పండు ఎంతో రుచిగా ఉంది. 1

4అతడు నన్ను విందుశాలకు తెచ్చాడు. 1 అతని ప్రేమ పతాక స్థాయిలో ఉంది.

5(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) 1 ప్రేమ కోసం నేను ఆకలిగా ఉన్నాను. 1 ఎండు ద్రాక్షపళ్ళతో నన్ను తెప్పరిల్లజేయండి, ఆపిల్ పళ్ళతో నన్ను ఉత్తేజ పరచండి.

6(ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) 1 అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉంది. 1 కుడిచేత్తో అతడు నన్ను కౌగిలించుకున్నాడు.

7(ఆ యువతి మిగతా స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) 1 యెరూషలేము ఆడపడుచులారా, పొలాల్లోని జింకల మీద, లేళ్ల మీద ఒట్టు పెట్టి చెప్పండి. 1 మా ప్రేమ పని ముగిసేంత వరకూ మీరు మమ్మల్ని ఆటంకపరచవద్దు.

8[రెండవ భాగం] (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) 1 నా ప్రియుని స్వరం అదుగో! చూడు, అతడు వస్తున్నాడు. 1 పర్వతాల మీద గంతులేస్తూ కొండల మీద దూకుతూ వస్తున్నాడు. 1

9నా ప్రియుడు జింకలాగా, లేడిపిల్లలాగా ఉన్నాడు. 1 చూడు, మన గోడ వెనక నిలబడి ఉన్నాడు. 1 కిటికీలోనుంచి చూస్తున్నాడు. 1 అల్లిక తడికె గుండా తొంగి చూస్తున్నాడు.

10నా ప్రియుడు నాతో మాట్లాడి ఇలా అన్నాడు, 1 “ప్రియా, లే. 1 సుందరీ, నాతో వచ్చెయ్యి. 1

11చలికాలం పోయింది. 1 వానలు పడి వెళ్ళిపోయాయి.

12దేశమంతా పూలు పూశాయి. 1 కొమ్మలను కత్తిరించే కాలం, పక్షులు కోలాహలం చేసే కాలం వచ్చింది. 1 కోకిల కూతలు మన ప్రాంతాల్లో వినబడుతున్నాయి. 1

13అంజూరు పళ్ళు పక్వానికి వచ్చాయి. 1 ద్రాక్షచెట్లు పూతపట్టాయి. 1 అవి సువాసన ఇస్తున్నాయి. 1 ప్రియా, లే. 1 సుందరీ, నాతో వచ్చెయ్యి. 1

14బండసందుల్లోని నా పావురమా, 1 కొండ మరుగు చరియల్లోని పావురమా, 1 నీ ముఖం నన్ను చూడ నివ్వు. 1 నీ స్వరం వినిపించు. 1 నీ స్వరం మధురం, నీ ముఖం ఎంత ముద్దుగా ఉంది.” 1

15(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) 1 మన ద్రాక్షతోటలు పూతకు వచ్చాయి. 1 తోడేళ్ళను పట్టుకో. 1 ద్రాక్షతోటలను పాడుచేసే గుంట నక్కలను పట్టుకో. 1

16(ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) 1 నా ప్రియుడు నా వాడు. 1 నేను అతని దాన్ని. 1 లిల్లీలు ఉన్నతావుల్లో అతడు మందను చక్కగా మేపుతున్నాడు. 1

17(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) 1 ప్రియా, వెళ్ళిపో. 1 ఉషోదయ శీతల పవనాలు వీచే ముందే చీకటి నీడలు పారిపోయే లోపే వెళ్ళిపో. 1 కొండ బాటల్లోని జింక లాగా లేడిపిల్లలాగా ఉండు.

← Song of Solomon 1Read In The App, Free →Song of Solomon 3 →

Study Song of Solomon 2

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

12345678