Song of Solomon · బైబిల్ (తెలుగు)

Song of Solomon 6

1(యెరూషలేము స్త్రీలు యువతితో మాట్లాడుతూ ఉన్నారు.) 1 జగదేక సుందరీ, నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు? అతడేవైపుకు వెళ్ళాడు? అతన్ని వెదకడానికి మీతో పాటు మేము కూడా వస్తాము.

2(యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.) 1 మేపడానికీ లిల్లీలు ఏరడానికీ నా ప్రియుడు తన తోటలోకి వెళ్ళాడు. 1 సుగంధ వనస్పతులున్న తోటలోకి వెళ్ళాడు. 1

3నేను నా ప్రియుని దాన్ని, అతడు నావాడు. అతడు లిల్లీ మొక్కల్లో మేపుతాడు. [ఐదవ భాగం] (యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతున్నాడు) 1

4ప్రియా, నువ్వు తిర్సా పట్టణమంత సౌందర్య రాశివి. 1 నీది యెరూషలేమంత సౌందర్యం. నీ అందం చూసి నేను మైమరచి పోతున్నాను. 1

5నీ కళ్ళు నాపైనుండి తిప్పుకో. అవి నన్ను లొంగతీసుకుంటున్నాయి. నీ జుట్టు గిలాదు పర్వత సానువుల నుంచి దిగి వస్తున్న మేకల మందలా ఉంది. 1

6నీ పళ్ళు ఉన్ని కత్తిరించి, కడిగిన తరువాత పైకి వచ్చిన గొర్రెల్లాగా ఉన్నాయి. ఒక్కటీ పోకుండా జోడుజోడుగా ఉన్నాయి. 1

7నీ ముసుకుగుండా నీ చెక్కిళ్ళు, విచ్చిన దానిమ్మ పండులా కన్పిస్తున్నాయి.

8(ప్రియుడు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు) 1 అరవై మంది రాణులూ ఎనభై మంది ఉపపత్నులూ లెక్క పెట్టలేనంత మంది యువతులూ ఉన్నారు. 1

9నా పావురం, ఏ దోషం లేనిది. ఈమె ఒక్కతే. ఈమె తన తల్లికి ఒకతే కూతురు. కన్నతల్లికి గారాబు బిడ్డ. 1 మా ప్రాంతం ఆడపడుచులు ఆమెను చూసి, చాలా ధన్య అన్నారు. రాణులూ ఉపపత్నులూ ఆమెను చూసి ప్రశంసించారు. 1

10తొలిసంధ్యలా విరాజిల్లుతూ, జాబిల్లిలా మనోజ్ఞంగా, భానుతేజ ప్రకాశంతో, వ్యూహంగా ఏర్పడిన సైన్యమంత భయద సౌందర్యం గల ఈమె ఎవరు? 1

11నేను బాదం చెట్ల తోటలోకి దిగి వెళ్లాను. లోయలో పెరిగే మొక్కలు చూడడానికి వెళ్లాను. 1 ద్రాక్షావల్లులు పూతకొచ్చాయో లేదో చూడడానికి, దానిమ్మ చెట్లు పూస్తున్నాయో లేదో చూడడానికి వెళ్లాను. 1

12రాకుమారుడి రథంలో ఎంతో ఆనందంగా వెళ్తున్ననట్టు ఉంది. 1

13(యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.) 1 అందాల రాశీ, వెనక్కి తిరిగి రా. వచ్చెయ్యి. తిరిగి వచ్చెయ్యి. నేను నిన్ను తనివితీరా చూడాలి. 1 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) రెండు వరసల నర్తకిల మధ్య నేను నాట్యం చేస్తున్నట్టు నావైపు అంత తదేకంగా ఎందుకు చూస్తావు?

← Song of Solomon 5Read In The App, Free →Song of Solomon 7 →

Study Song of Solomon 6

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

12345678