Song of Solomon · బైబిల్ (తెలుగు)

Song of Solomon 5

1(యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు). 1 నా సోదరీ, చెలీ, నేను నా తోటలోకి వచ్చాను. నా జటామాంసిని నా సుగంధాలతో తెచ్చుకున్నాను. 1 తేనె, తేనెపట్టుతో తిన్నాను. నా ద్రాక్షారసాన్ని నా పాలతో తాగాను. 1 నేస్తమా, తిను. నేస్తం, తిను. ప్రియా, బాగా తాగు. 1 విరహ వేదన

2[నాలుగవ భాగం] (యువతి మాట్లాడుతూ ఉంది) 1 నేను నిద్ర పోయాను గానీ నా మనస్సు కల కంటోంది. 1 నా ప్రియుడు తలుపు తడుతూ పిలుస్తున్న శబ్దం “నా సోదరీ, ప్రియతమా, నా పావురమా, నిష్కళంకితా, తలుపు తియ్యి. 1 నా తల మంచుకు తడిసింది. నా జుట్టు రాత్రి మంచుకు తడిసింది.”

3(యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.) 1 నేను బట్టలు తీసేశాను. మళ్ళీ వాటిని వేసుకోవాలా? 1 కాళ్ళు కడుక్కున్నాను. మళ్ళీ మురికి చేసుకోవాలా? 1

4తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి పెట్టగానే నా గుండె అతని కోసం కొట్టుకుంది. 1

5నా ప్రియుడి కోసం తలుపు తీయడానికి నేను లేచాను. 1 నా చేతుల నుంచి బోళం కారుతూ ఉంది. నా వేళ్ళకున్న బోళం తడి తలుపు గడియపై కారింది. 1

6నా ప్రియునికి తలుపు తీశాను. కానీ అతడు వెళ్లిపోయాడు. నేను కుంగిపోయాను. నీరుగారిపోయాను. 1 నేనతని కోసం వెతికినా కనబడలేదు. నేనతన్ని పిలిచినా అతడు పలకలేదు. 1

7పట్టణంలో గస్తీ తిరిగేవారు నాకు ఎదురుపడ్డారు. 1 వాళ్ళు నన్ను కొట్టి గాయపర్చారు. 1 ప్రాకారం మీద ఉన్న కావలివారు నా పైట చెంగు లాగేసుకున్నారు.

8(యువతి పట్టణ స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) 1 యెరూషలేము ఆడపడుచులారా, నా ప్రియుడు మీకు కనిపిస్తే, అతనిపట్ల ప్రేమతో నేను సొమ్మసిల్లి పోతున్నానని అతనికి చెప్పమని మిమ్మల్ని బతిమాలుతున్నాను.

9(పట్టణ స్త్రీలు యువతితో మాట్లాడుతూ ఉన్నారు.) 1 జగదేక సుందరీ, వేరే ప్రియుల కంటే నీ ప్రియుడి విశేషమేంటి? 1 నువ్వు మాచేత ఇలా ప్రమాణం చేయించుకోడానికి వేరే ప్రియుల కంటే నీ ప్రియుడు ఏవిధంగా గొప్ప?

10(యువతి పట్టణ స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) 1 నా ప్రియుడు చూడ చక్కని వాడు. ఎర్రని వాడు. పదివేలమందిలో ప్రత్యేకమైన వాడు. 1

11అతని తల మేలిమి బంగారం. అతనిది ఉంగరాల జుట్టు, కాకి నలుపు. 1

12అతని కళ్ళు నదీతీరాన ఎగిరే గువ్వల్లాంటివి. అవి పాలతో కడిగి, రత్నాలు పొదిగినట్టుగా ఉన్నాయి. 1

13అతని చెక్కిళ్ళు సుగంధమొక్కల తోటలా, కమ్మని సువాసన ఇస్తున్నాయి. అతని పెదవులు లిల్లీ పువ్వుల్లా, బోళం ఊరుతున్నట్టుగా ఉన్నాయి. 1

14అతని చేతులు, రత్నాలు పొదిగిన బంగారు కడ్డీలు. అతని ఉదరం పచ్చలు పొదిగిన ఏనుగు దంతం. 1

15అతని కాళ్లు పాలరాతి స్తంభాల్లా ఉన్నాయి. అవి అచ్చమైన బంగారు కుదురు మీద నిలిపినట్టున్నాయి. 1 అతని ఆకారం లెబానోను పర్వతాల్లా, దేవదారు వృక్షాల్లా రమ్యం. 1

16అతని నోరు అత్యంత మధురం. అతడు మూర్తీభవించిన పరిపూర్ణ సౌందర్యం. 1 యెరూషలేము ఆడపడుచులారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా నెచ్చెలి.

← Song of Solomon 4Read In The App, Free →Song of Solomon 6 →

Study Song of Solomon 5

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

12345678