Song of Solomon · బైబిల్ (తెలుగు)

Song of Solomon 8

1(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) 1 నా తల్లి పాలు తాగిన నా సోదరునిలా నువ్వు నాకుంటే ఎంత బాగు! 1 అప్పుడు నువ్వు బయట ఎదురు పడితే నీకు ముద్దులిచ్చేదాన్ని. 1 అప్పుడు నన్నెవరూ నిందించరు. 1

2నేను నిన్ను మా పుట్టింటికి తీసుకెళ్తాను. 1 నువ్వు నాకు పాఠాలు నేర్పిస్తావు. 1 తాగడానికి నీకు సుగంధ ద్రాక్షారసాన్ని, నా దానిమ్మ పళ్ళ రసాన్ని ఇస్తాను.

3(యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది). 1 అతని ఎడమచెయ్యి నా తల కింద ఉంది. 1 అతని కుడిచేత్తో నన్ను ఆలింగనం చేసుకున్నాడు 1

4(యువతి ఇతర స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) 1 యెరూషలేము ఆడపడుచులారా, మీచేత ఒట్టు వేయించుకుంటున్నాను. మా ప్రేమ పని ముగిసేంత వరకూ 1 మీరు మమ్మల్ని ఆటంకపరచవద్దు.

5[ఆరవ భాగం-ముగింపు] 1 (యెరూషలేము స్త్రీలు మాట్లాడుతున్నారు) 1 తన ప్రియుని మీద ఆనుకుని ఎడారి దారిలో వచ్చేది ఎవరు? (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) 1 ఆపిల్ చెట్టు కింద నువ్వు పడుకుని ఉంటే నేను నిన్ను లేపాను. 1 అక్కడ నువ్వు మీ అమ్మ కడుపులో పడ్డావు. ఆమె నిన్ను అక్కడే ప్రసవించింది.

6నీ చేతిమీదున్న పచ్చబొట్టులా నీ గుండె మీద నా పచ్చబొట్టు పొడిపించుకో. 1 ఎందుకంటే ప్రేమకు చావుకున్నంత బలముంది. 1 మోహం పాతాళంతో సమానమైన తీవ్రత గలది. 1 దాని మంటలు ఎగిసి పడతాయి. 1 అది మండే అగ్నిజ్వాల. ఏ అగ్ని మంటలకన్నా అది తీవ్రమైనది.

7ఉప్పెన కూడా ప్రేమను ఆర్పలేదు. 1 వరదలు దాన్ని ముంచలేవు. 1 ప్రేమ కోసం ఎవడైనా తనకున్నదంతా ఇచ్చేసినా ఆ ప్రయత్నం + 8:7 ఆ ప్రయత్నం అతని ప్రయత్నం శుద్ధ దండగ.

8(ఆ యువతి సోదరులు తమలో తాము మాట్లాడుకుంటున్నారు). 1 మాకొక చిన్నారి చెల్లి ఉంది. ఆమె స్తనాలు ఇంకా పెరగలేదు. 1 ఆమె నిశ్చితార్థం రోజున మా చెల్లి కోసం మేమేం చెయ్యాలి? 1

9ఆమె గోడలాంటిదైతే దానిమీద వెండి గోపురం కట్టిస్తాం. 1 ఆమె తలుపులాంటిదైతే దేవదారు చెక్కతో దానికి గడులు పెడతాం. 1

10(యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.) 1 నేను గోడలా ఉండేదాన్ని. 1 అయితే ఇప్పుడు నా స్తనాలు గోపురాల్లా ఉన్నాయి. 1 కాబట్టి నేను పూర్తిగా అతని దృష్టికి సిద్ధంగా + 8:10 సిద్ధంగా ఎదిగి ఉన్నా. 1

11బయల్ హామోనులో సొలొమోనుకు ఒక ద్రాక్షావనం ఉంది. 1 అతడు దాన్ని రైతులకు కౌలుకిచ్చాడు. ప్రతి రైతూ వెయ్యి వెండి నాణాలు + 8:11 వెయ్యి వెండి నాణాలు ఒక వెండి నాణా ఒక రోజు కూలి కౌలు చెల్లించాలి. 1

12నా ద్రాక్షతోట నా సొంతం. సొలొమోనూ, ఆ వెయ్యి వెండి నాణాలు నీవే. 1 దాన్ని కౌలు చేసేవారికి రెండు వందల నాణాలు గిట్టుతాయి. 1

13(ఆ యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతున్నాడు) 1 ఉద్యానవనంలో పెరిగేదానా, నా మిత్రులు నీ స్వరం వింటున్నారు. నన్నూ విననీ. 1

14(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) 1 ప్రియా, త్వరగా వచ్చెయ్యి. జింకలా, లేడిపిల్లలా సుగంధ పర్వతాల మీదుగా చెంగు చెంగున వచ్చెయ్యి.

← Song of Solomon 7Read In The App, Free →Isaiah 1 →

Study Song of Solomon 8

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

12345678