Song of Solomon 7
1(యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతున్నాడు) 1 రాకుమారీ, చెప్పులు తొడిగిన నీ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి! నీ తొడల వంపులు నిపుణుడైన కంసాలి పనితనంతో చేసిన ఆభరణాల్లాగా ఉన్నాయి. 1
2నీ బొడ్డు గుండ్రని కలశంలా ఉంది. 1 కలిపిన ద్రాక్షారసం దానిలో ఎప్పుడూ వెలితి కాదు. నీ నడుము లిల్లీ పూలు చుట్టిన గోదుమరాశిలా ఉంది. 1
3నీ జత స్తనాలు కవల జింకపిల్లల్లా ఉన్నాయి. 1
4నీ మెడ దంతగోపురంలా ఉంది. 1 నీ కళ్ళు బత్ రబ్బీం ద్వారం దగ్గరున్న హెష్బోను జలాశయాల్లా ఉన్నాయి. 1 నీ నాసిక దమస్కు వైపు చూస్తున్న లెబానోను శిఖరంలా ఉంది. 1
5నీ తల కర్మెలు పర్వతంలా ఉంది. 1 నీ జుట్టు ముదురు ఊదా రంగు. 1 నొక్కులు తిరిగిన ఆ జుట్టుకు రాజు వశమైపోయాడు. 1
6నా ప్రేయసీ, నీ హర్షంతో నువ్వెంత అందంగా లలిత లావణ్యంగా ఉన్నావు! 1
7నువ్వు తాడి చెట్టులా తిన్నగా ఉన్నావు. 1 నీ స్తనాలు పండ్ల గెలల్లా ఉన్నాయి. 1
8“ఆ తాడి చెట్టు ఎక్కుతాను. దాని కొమ్మలు పట్టుకుంటాను” అనుకున్నాను. 1 నీ స్తనాలు ద్రాక్షగెలల్లా, నీ శ్వాస సీమ బాదం వాసనలా ఉండాలి. 1
9నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షారసంలా ఉండాలి. 1 మన పెదాల మధ్య, పళ్ళ మధ్య చక్కగా స్రవిస్తూ ఉండాలి. 1 ప్రియునిపట్ల ప్రియురాలి వాంఛ
10(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) 1 నేను నా ప్రియుడికి చెందిన దాన్ని. 1 అతడు నా కోసం తహతహలాడుతున్నాడు. 1
11ప్రియా, రా. మనం పల్లెకు పోదాం. పల్లెటూర్లో + 7:11 పల్లెటూర్లో అడవి పువ్వుల్లో రాత్రి గడుపుదాం. 1
12పొద్దున్నే లేచి ద్రాక్షతోటలకు వెళదాం. ద్రాక్షావల్లులు చిగిర్చాయో లేదో, 1 వాటి పూల గుత్తులు వికసించాయో లేదో దానిమ్మ చెట్లు పూతకు వచ్చాయో లేదో చూద్దాం పద. 1 అక్కడే నీకు నేను నా ప్రేమ పంచుతాను. 1
13మాండ్రేక్ మొక్కలు కమ్మని సువాసనలీనుతున్నాయి. 1 మా ఇంటి తలుపు దగ్గర చవులూరించే రక రకాల పళ్ళు కొత్తవీ పాతవీ ఉన్నాయి. ప్రియా, నేను నీ కోసం వాటిని దాచి ఉంచాను.