Isaiah 1
1యూదా రాజులైన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా పాలించే రోజుల్లో యూదా గురించీ, యెరూషలేము గురించీ ఆమోజు కొడుకు యెషయాకు కలిగిన దర్శనం. 1
2ఆకాశమా, విను. భూమీ, ఆలకించు. యెహోవా నాతో ఇలా మాట్లాడాడు. 1 “నేను పిల్లలను పెంచి పోషించాను. వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు. 1
3ఎద్దుకు తన యజమాని తెలుసు. 1 తన మేత తొట్టి గాడిదకు తెలుసు. 1 కాని, ఇశ్రాయేలుకు తెలియదు. ఇశ్రాయేలుకు అర్థం కాదు.” 1
4ఓ పాపిష్టి జాతీ, దోషం కింద మగ్గిపోతున్న జనమా, 1 దుష్టుల సంతానమా, అవినీతి చేసే పిల్లలారా మీకు బాధ. 1 వాళ్ళు యెహోవాను విడిచిపెట్టారు. 1 ఇశ్రాయేలీయుల పవిత్ర దేవుణ్ణి అలక్ష్యం చేశారు. 1 ఆయనతో తెగతెంపులు చేసుకున్నారు. 1
5మీకు ఇంకా దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి? 1 మీరు ఇంకా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? 1 మీ తల అంతా గాయమే. మీ గుండె నిండా బలహీనతే. 1
6అరి కాలు నుంచి తల వరకు పుండు పడని భాగం లేదు. 1 ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, మానని పుళ్ళు. 1 అవి నయం కాలేదు. వాటిని ఎవరూ కడగలేదు, 1 కట్టు కట్టలేదు, నూనెతో చికిత్స చెయ్యలేదు. 1
7మీ దేశం పాడైపోయింది. 1 మీ పట్టణాలు మంటల్లో కాలిపోయాయి. 1 మీ కళ్ళముందే పరాయివారు మీ పంటలు దోచుకుంటున్నారు. 1 తమ కంట పడినవన్నీ నాశనం చేస్తున్నారు. 1
8సీయోను కుమార్తె + 1:8 సీయోను కుమార్తె యెరూషలేము పట్టణంద్రాక్షతోటలో ఒక గుడిసెలాగా, 1 దోసపాదుల్లో ఒక పాకలాగా, ముట్టడి వేసిన పట్టణంలాగా మిగిలిపోయింది. 1
9జాతులకు ప్రభువైన యెహోవా కొంత శేషం మన కోసం ఉంచకపోతే, 1 మనం సొదొమలాగా ఉండేవాళ్ళం. 1 మనం గొమొర్రాతో సమానంగా ఉండేవాళ్ళం. 1
10సొదొమ పాలకులారా, యెహోవా మాట వినండి. 1 గొమొర్రా ప్రజలారా, మన దేవుని ధర్మశాస్త్రం ఆలకించండి. 1
11“యెహోవా ఇలా అంటున్నాడు. 1 విస్తారమైన మీ బలులు నాకెందుకు?” 1 “దహనబలులుగా అర్పించిన పాట్టేళ్లు, బలిసిన దూడల కొవ్వు నాకు వెగటు పుట్టించాయి. 1 దున్నపోతుల రక్తం, గొర్రె పిల్లల రక్తం, మేకపోతుల రక్తం అంటే నాకు ఇష్టం లేదు. 1
12మీరు నా సన్నిధిలో నన్ను కలుసుకోడానికి వస్తున్నప్పుడు, 1 నా ప్రాంగణాలు తొక్కమని మిమ్మల్ని ఎవరడిగారు? 1
13అర్థం లేని అర్పణలు మీరు ఇక తీసుకు రావొద్దు. ధూపార్పణ నాకు అసహ్యం. 1 అమావాస్య, విశ్రాంతి దినాలు, సమాజ కూటాలు జరుగుతున్నాయి కాని, మీ దుర్మార్గ సమావేశాలు నేను సహించలేను. 1
14మీ అమావాస్య ఉత్సవాలు, నియామక ఉత్సవాలు నాకు అసహ్యం. అవి నాకు బాధాకరం. 1 వాటిని సహించలేక విసిగిపోయాను. 1
15మీరు మీ చేతులు ప్రార్థనలో చాపినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు కప్పేసుకుంటాను. 1 మీరు ఎంత ప్రార్థన చేసినా నేను వినను. 1 మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. 1
16మిమ్మల్ని కడుగుకోండి. శుద్ధి చేసుకోండి. 1 మీ దుష్టక్రియలు నాకు కనిపించకుండా వాటిని తీసివేయండి. 1 మీ దుష్టత్వం మానండి.” 1
17మంచి చెయ్యడం నేర్చుకోండి. 1 న్యాయం కోరుకోండి. పీడిత ప్రజలకు సాయం చెయ్యండి. 1 తండ్రిలేని వారికి న్యాయం చెయ్యండి. 1 వితంతువు పక్షాన నిలబడండి. 1
18యెహోవా ఇలా అంటున్నాడు. 1 “రండి మనం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం.” 1 “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, 1 అవి మంచులా తెల్లగా అవుతాయి. 1 కెంపులా ఎర్రగా ఉన్నా, అవి గొర్రెబొచ్చులా తెల్లగా ఔతాయి. 1
19మీరు ఇష్టపడి నాకు లోబడితే, 1 మీరు ఈ దేశం అందించే మంచి పదార్ధాలు అనుభవిస్తారు. 1
20తిరస్కరించి తిరుగుబాటు చేస్తే, 1 కత్తి మిమ్మల్ని నాశనం చేస్తుంది.” 1 యెహోవా నోరు ఈ మాట పలికింది. 1
21నమ్మదగిన ఈ పట్టణం ఒక వేశ్యలా ఎలా మారింది! 1 అది న్యాయంతో నిండి ఉండేది. 1 నీతి దానిలో నివాసం ఉండేది. 1 ఇప్పుడైతే దాని నిండా నరహంతకులు నివాసం ఉంటున్నారు. 1
22నీ వెండి మలినమైపోయింది. 1 నీ ద్రాక్షారసం నీళ్లతో పలచబడి పోయింది. 1
23నీ అధికారులు ద్రోహులు. 1 వాళ్ళు దొంగలతో సావాసం చేస్తారు. 1 అందరూ లంచం ఆశిస్తారు. 1 చెల్లింపుల వెంటబడతారు. 1 తండ్రి లేని వాళ్ళ పక్షంగా ఉండరు. 1 వితంతువుల న్యాయమైన అభ్యర్ధన వాళ్ళు పట్టించుకోరు. 1
24కాబట్టి ప్రభువూ, ఇశ్రాయేలు బలిష్టుడూ, సైన్యాల అధిపతీ అయిన యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు. 1 “వాళ్లకు బాధ! నా విరోధులపై నేను ప్రతీకారం తీర్చుకుంటాను. 1 నా శత్రువుల మీద నేను పగ తీర్చుకుంటాను. 1
25నీకు వ్యతిరేకంగా నా చెయ్యి తిప్పుతాను. 1 నీలో ఉన్న చెత్తను శుద్ధిచేసి, నీ కల్మషం అంతా తీసేస్తాను. 1
26మొదట్లో ఉన్నట్టు న్యాయాధిపతులను మళ్ళీ నీకు ఇస్తాను. 1 ఆరంభంలో ఉన్నట్టు నీకు సలహాదారులను మళ్ళీ నియమిస్తాను. 1 అప్పుడు నీతిగల పట్టణం అనీ, నమ్మదగిన నగరమనీ నీకు పేరొస్తుంది.” 1
27సీయోనుకు న్యాయాన్ని బట్టీ, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిని బట్టీ విమోచన కలుగుతుంది. 1
28అతిక్రమం చేసేవాళ్ళూ, పాపులూ కలిసి ఏకంగా నాశనమౌతారు. 1 యెహోవాను విడిచి పెట్టేసిన వాళ్ళు లయమౌతారు. 1
29“మీరు కోరుకున్న సింధూర వృక్షాలను + 1:29 సింధూర వృక్షాలను విగ్రహ పూజ బట్టి మీరు సిగ్గుపడతారు. 1 మీరు ఎంపిక చేసుకున్న తోటలను బట్టి మీరు అవమానం పాలవుతారు. 1
30మీరు ఆకులు వాడిపోయే సింధూరవృక్షంలాగా, నీళ్ళు లేని తోటల్లాగా అయిపోతారు. 1
31బలవంతుడు సుళువుగా నిప్పు రాజుకునే నార పీచులా ఉంటాడు. 1 అతని పని నిప్పు రవ్వలా ఉంటుంది. రెండూ కలిసి కాలిపోతాయి. 1 ఆర్పే వాళ్ళు ఎవరూ ఉండరు.”