Amos · బైబిల్ (తెలుగు)

Amos 2

1యెహోవా చెప్పేదేమిటంటే 2 “మోయాబు మూడు సార్లు, నాలుగు సార్లు 2 చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. 2 ఎందుకంటే వారు ఎదోమురాజు ఎముకలను 2 కాల్చి సున్నం చేశారు.

2మోయాబు మీద నేను అగ్ని పంపిస్తాను. 2 అది కెరీయోతు ప్రాకారాలను కాల్చేస్తుంది. 2 యుద్ధ ధ్వనులూ బాకానాదం వినబడుతుంటే 2 మోయాబు హాహాకారాలు చేస్తూ అంతరించి పోతుంది.

3దానిలోని న్యాయమూర్తిని నిర్మూలం చేస్తాను. 2 అతనితోపాటు వారి అధిపతులందరిని నేను చంపేస్తాను” అని యెహోవా చెబుతున్నాడు.

4యెహోవా చెప్పేదేమిటంటే 2 “యూదా మూడు సార్లు, 2 నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి 2 నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను. 2 ఎందుకంటే వారు తమ పూర్వీకులు అనుసరించిన వారి అబద్ధాల వలన మోసపోయి 2 యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించి, 2 ఆయన విధులను గైకొనలేదు.

5యూదా మీద నేను అగ్ని పంపిస్తాను. 2 అది యెరూషలేము రాజ భవనాలను కాల్చేస్తుంది.” 1 ఇశ్రాయేలకు వ్యతిరేకంగా ప్రవచనం

6యెహోవా తెలియజేసేది ఏంటంటే 2 “ఇశ్రాయేలు మూడు సార్లు 2 నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి 2 నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. 2 ఎందుకంటే డబ్బు కోసం వాళ్ళు నిర్దోషులను అమ్మేశారు. 2 చెప్పుల కోసం పేదలను అమ్మేశారు.

7నేల మీద మట్టిని ప్రజలు తొక్కేసినట్టు 2 దిక్కులేనివారి తలలను తొక్కేస్తున్నారు. 2 అణగారిన వారిని అవతలికి గెంటేస్తున్నారు. 2 తండ్రి, కొడుకు ఒకే స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకుని 2 నా పవిత్ర నామాన్ని అవమానపరుస్తున్నారు.

8తాకట్టుగా ఉంచిన బట్టలను అప్పగించకుండాా 2 ప్రతి బలిపీఠం దగ్గర వాటి మీద పడుకుంటారు. 2 జుల్మానా సొమ్ముతో కొన్న ద్రాక్షమద్యాన్ని 2 తమ దేవుని మందిరంలో తాగుతారు.

9దేవదారు చెట్టంత ఎత్తయిన వారూ 2 సింధూర వృక్షమంత బలమున్న అమోరీయులను 2 వారి ముందు నిలవకుండా నేను నాశనం చేశాను గదా! 2 పైన వారి ఫలాన్నీ కింద వారి వేరులనూ 2 నేను నాశనం చేశాను గదా!

10ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించి, 2 అమోరీయుల దేశాన్ని మీకు స్వాధీనం చేయాలని 2 నలభై ఏళ్ళు అరణ్యంలో మిమ్మల్ని నడిపించాను.

11మీ కొడుకుల్లో ప్రవక్తలను నియమించాను. 2 మీ యువకుల్లో నాజీరులను ఎన్నుకున్నాను. 2 ఇశ్రాయేలీయులారా, ఇది నిజం కాదా?” 2 యెహోవా వెల్లడించేది ఇదే.

12“అయితే నాజీరులకు మీరు ద్రాక్షమద్యం తాగించారు. 2 ప్రవచించ వద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చారు.

13చూడండి. ధాన్యంతో నిండిన బండి 2 ఎవరినైనా అణిచి తొక్కగలిగినట్టు 2 నేను మిమ్మల్ని అణగదొక్కుతాను.

14చురుకైన వారు సైతం తప్పించుకోలేరు. 2 బలమైనవారు తమ బలాన్నిబట్టి ధైర్యం తెచ్చుకోలేకపోతారు. 2 గొప్ప వీరుడు కూడా తన ప్రాణం కాపాడుకోలేడు.

15విలుకాడు నిలబడలేడు. 2 వేగంగా పరుగెత్తగలిగేవాడు తప్పించుకోలేడు. 2 రౌతు తన ప్రాణాన్ని కాపాడుకోలేడు. 2

16ఆ రోజు అత్యంత ధైర్యండే శూరులు కూడా 2 నగ్నంగా పారిపోతారు. 2 యెహోవా ప్రకటించేది ఇదే.”

← Amos 1Read In The App, Free →Amos 3 →

Study Amos 2

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789