Amos 4
1సమరయ పర్వతం మీద ఉన్న 2 బాషాను + 4:1 బాషాను సారవంతమైన భూమి ఆవులారా, పేదలను అణిచేస్తూ 2 దిక్కులేని వాళ్ళని బాధిస్తూ, 2 మీ భర్తలతో “మాకు సారాయి తీసుకు రా” 2 అనే మీరు, ఈ మాట వినండి. 2
2యెహోవా ప్రభువు తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణం ఇదే, 2 “మిమ్మల్ని కొక్కేలతో పట్టుకుని తీసుకుపోయే రోజు వస్తూ ఉంది. 2 మీలో మిగతావారిని చేపల గాలాలతో పట్టుకుపోతారు. 2
3మీరంతా ప్రాకారాల్లో పగుళ్ళగుండా దూరి వెళ్లిపోతారు. 2 మిమ్మల్ని హెర్మోను పర్వతం బయట పారవేస్తారు.” 2 యెహోవా ప్రకటించేది ఇదే.
4బేతేలుకు వచ్చి తిరుగుబాటు చేయండి. 2 గిల్గాలుకు వెళ్లి ఇంకా ఎక్కువగా తిరుగుబాటు చేయండి. 2 ప్రతి ఉదయం బలులు తీసుకు రండి. 2 మూడు రోజులకు ఒకసారి మీ పదో భాగాలు తీసుకురండి. 2
5రొట్టెతో కృతజ్ఞత అర్పణ అర్పించండి. 2 స్వేచ్ఛార్పణలు ప్రకటించండి. 2 వాటి గురించి చాటించండి. 2 ఇశ్రాయేలీయులారా, ఇలా చేయడం మీకిష్టం గదా. 2 యెహోవా ప్రకటించేది ఇదే.
6మీ పట్టణాలన్నిటిలో మీకు తినడానికి ఏమీ లేకుండా చేశాను. 2 మీరున్న స్థలాలన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేశాను. 2 అయినా మీరు నా వైపు తిరుగలేదు. 2 యెహోవా ప్రకటించేది ఇదే. 2
7కోతకాలానికి మూడు నెలలు ముందే 2 వానలేకుండా చేశాను. 2 ఒక పట్టణం మీద వాన కురిపించి 2 మరొక పట్టణం మీద కురిపించలేదు. 2 ఒక చోట వాన పడింది, 2 వాన పడని పొలం ఎండిపోయింది.
8రెండు మూడు ఊర్లు 2 మంచినీళ్ళ కోసం మరొక ఊరికి ఆత్రంగా పోతే 2 అక్కడ కూడా వాళ్లకి సరిపోయినంత నీళ్ళు దొరకలేదు. 2 అయినా మీరు నా వైపు తిరగలేదు. 2 యెహోవా ప్రకటించేది ఇదే. 2
9విస్తారమైన మీ తోటలన్నిటినీ 2 తెగుళ్ళతో నేను పాడు చేశాను. 2 మీ ద్రాక్షతోటలనూ 2 అంజూరపు చెట్లనీ 2 ఒలీవచెట్లనూ 2 మిడతలు తినేశాయి. 2 అయినా మీరు నావైపు తిరగలేదు. 2 యెహోవా ప్రకటించేది ఇదే.
10నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్టు 2 మీ మీదికి తెగుళ్లు పంపాను. 2 మీ యువకులను కత్తితో చంపేశాను. 2 మీ గుర్రాలను తీసుకుపోయారు. 2 మీ శిబిరాల్లో పుట్టిన చెడ్డ వాసన 2 మీ ముక్కుల్లోకి ఎక్కింది. 2 అయినా మీరు నా వైపు తిరగలేదు. 2 యెహోవా ప్రకటించేది ఇదే. 2
11దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినట్టు 2 నేను మీలో కొంతమందిని నాశనం చేశాను. 2 మీరు మంటలోనుంచి లాగేసిన కట్టెల్లాగా తప్పించుకున్నారు. 2 అయినా మీరు నా వైపు తిరగలేదు. 2 యెహోవా ప్రకటించేది ఇదే.
12కాబట్టి ఇశ్రాయేలీయులారా, 2 మీపట్ల కఠినంగా ఇలా చేస్తాను. 2 కాబట్టి ఇశ్రాయేలీయులారా, 2 మీ దేవుణ్ణి కలుసుకోడానికి సిద్ధపడండి. 2
13పర్వతాలను రూపించే వాడూ 2 గాలిని పుట్టించేవాడూ ఆయనే. 2 ఆయన తన ఆలోచనలను మనుషులకు వెల్లడి చేస్తాడు. 2 ఉదయాన్ని చీకటిగా మారుస్తాడు. 2 భూమి ఉన్నత స్థలాల మీద నడుస్తాడు. 2 ఆయన పేరు సేనల ప్రభువు యెహోవా.