Amos · బైబిల్ (తెలుగు)

Amos 7

1యెహోవా ప్రభువు నాకిది చూపించాడు. రాజుకు రావలసిన కోత తరువాత గడ్డి మళ్ళీ మొలిచినప్పుడు ఆయన మిడతల గుంపు పుట్టించాడు.

2అవి పచ్చికనంతా తినేసినప్పుడు నేనిలా అన్నాను. “యెహోవా ప్రభూ, దయచేసి క్షమించు. యాకోబు వంశం కొద్దిమందేగా. అది ఎలా నిలదొక్కుకుంటుంది”

3దీని గురించి యెహోవా మనస్సు మార్చుకుని “అది జరగదు” అన్నాడు.

4యెహోవా ప్రభువు నాకిది చూపించాడు. శిక్షించడానికి యెహోవా ప్రభువు అగ్ని రప్పించాడు. అది భూమి కిందున్న అగాధ మహా జలాన్ని ఎండగొట్టి భూమిని కూడా మింగేసేదే.

5అయితే నేనిలా అన్నాను. “యెహోవా ప్రభూ, యాకోబు వంశం కొద్దిమందేగా. అది ఎలా నిలదొక్కుకుంటుంది?”

6దీని గురించి యెహోవా మనస్సు మార్చుకుని “అది కూడా జరగదు” అన్నాడు.

7ఆయన నాకిది చూపించాడు. చూడు, మట్టపు గుండు చేతిలో పట్టుకుని ప్రభువు గోడ పక్కన నిలబడ్డాడు.

8యెహోవా నాతో ఇలా అన్నాడు. “ఆమోసూ, నువ్వేం చూస్తున్నావు?” “మట్టపు గుండు” అన్నాను. అప్పుడు ప్రభువు ఇలా అన్నాడు. “నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య నేను మట్టపు గుండు వేయబోతున్నాను. ఇక ఏమాత్రం నేను వాళ్ళను వదిలిపెట్టను.

9ఇస్సాకు వంశం వారి ఉన్నత స్థలాలు నాశనమవుతాయి. 2 ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠిత స్థలాలు పాడైపోతాయి. 2 యరొబాము వంశానికి విరోధంగా కత్తి ఎత్తుతాను.” 1 ఆమోసు, అమజ్యా

10అప్పుడు బేతేలు యాజకుడు అమజ్యా, ఇశ్రాయేలు రాజు యరొబాముకు ఇలా కబురు పంపాడు “ఇశ్రాయేలీయుల మధ్య, ఆమోసు నీ మీద కుట్ర చేస్తున్నాడు. అతని మాటలు దేశం సహించలేదు.”

11అప్పుడు ఆమోసు, 1 యరొబాము కత్తితో చస్తాడు. 1 ఇశ్రాయేలీయులు తప్పకుండా తమ దేశాన్నివిడిచి బందీలుగా వెళతారు అన్నాడు.

12అమజ్యా ఆమోసుతో ఇట్లన్నాడు. “దీర్ఘదర్శీ, వెళ్ళిపో! యూదా దేశానికి పారిపో. అక్కడే ప్రవచించుకుంటూ పొట్ట పోసుకో.

13బేతేలులో ఇంక ఎంత మాత్రం ప్రవచించవద్దు. రాజు నివసించే స్థలం, రాజభవనం ఇక్కడ ఉన్నాయి.”

14అందుకు ఆమోసు అమజ్యాతో ఇలా అన్నాడు. “నేను ప్రవక్తను కాదు, ప్రవక్త కొడుకును కూడా కాదు. నేను గొర్రెల కాపరిని. మేడి చెట్లు చూసుకుంటాను.

15అయితే, నేను నా మందలను కాస్తూ ఉంటే యెహోవా నన్ను పిలిచి, ‘నువ్వు వెళ్లి నా ప్రజలైన ఇశ్రాయేలు వారికి ప్రవచించు’ అన్నాడు.”

16అందుచేత యెహోవా మాట వినండి. మీరిలా అంటున్నారు, ఇశ్రాయేలీయులను గురించి ప్రవచించవద్దు. ఇస్సాకు వంశానికి వ్యతిరేకంగా మాట జారవద్దు.

17యెహోవా చెప్పేదేమిటంటే, 1 నీ భార్య పట్టణంలో వేశ్య అవుతుంది. 1 నీ కొడుకులూ కూతుళ్ళు కత్తితో హతమౌతారు. 1 శత్రువులు నీ భూమిని కొలిచి పంచుకుంటారు. 1 నువ్వు అపవిత్ర దేశంలో + 7:17 అపవిత్ర దేశంలో అన్య దేశంలో ప్రాణం విడుస్తావు. 1 కచ్చితంగా ఇశ్రాయేలీయులు తమ దేశం విడిచి బందీలవుతారు.

← Amos 6Read In The App, Free →Amos 8 →

Study Amos 7

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789