Amos 9
1బలిపీఠం దగ్గర ప్రభువు నిలబడి ఉండడం నేను చూశాను. ఆయన ఇలా అన్నాడు. “గడపలు కదలిపోయేలా స్తంభాల పై భాగాలను కొట్టు. 2 పై కప్పు అందరి తలల మీదా పడేలా వాటిని పగలగొట్టు. 2 తరువాత మిగిలిపోయిన వారిని నేను కత్తితో చంపుతాను. 2 ఎవడూ పారిపోలేడు. ఎవడూ తప్పించుకోలేడు. 2
2చచ్చిన వాళ్ళుండే చోటుకు వాళ్ళు చొచ్చుకు పోయినా 2 అక్కడనుంచి నా చెయ్యి వాళ్ళను బయటికి లాగేస్తుంది. 2 వాళ్ళు ఆకాశానికి ఎక్కిపోయినా 2 అక్కడ నుంచి వాళ్ళను దించేస్తాను.
3కర్మెలు పర్వత శిఖరాన వాళ్ళు దాక్కున్నా 2 నేను వాళ్ళను వెతికి పట్టుకుంటాను. 2 నా దృష్టికి కనబడకుండా వాళ్ళు సముద్రపు అడుగున దాక్కున్నా 2 వాళ్ళను కాటేయడానికి నేను పాముకు ఆజ్ఞాపిస్తాను. 2 అది వాళ్ళను కాటేస్తుంది. 2
4శత్రువులు వాళ్ళను బందీలుగా వేరే దేశాలకు తీసుకుపోయినా 2 నేనక్కడ కత్తికి పని చెబుతాను. అది వాళ్ళను చంపేస్తుంది. 2 మేలు చేయడానికి కాక కీడు చేయడానికే నా దృష్టి వారి మీద నిలుపుతాను.
5ఆయన సేనల అధిపతి యెహోవా. 2 ఆయన భూమిని తాకితే అది కరిగి పోతుంది. 2 దానిలో జీవించే వారంతా రోదిస్తారు. 2 నైలునది లాగా అదంతా పొంగుతుంది. 2 ఐగుప్తుదేశంలోని నదిలాగా అది పైకి లేచి, 2 మళ్ళీ అణిగి పోతుంది. 2
6ఆయన ఆకాశాల్లో తన కోసం భవనాలను నిర్మించేవాడు. 2 భూమి మీద తన పునాది వేసినవాడు. 2 సముద్రపు నీళ్ళను వానగా భూమి మీద కురిపించేవాడు ఆయనే. 2 ఆయన పేరు యెహోవా.
7ఇశ్రాయేలీయులారా, మీరూ ఇతియోపియా ప్రజలూ నా దృష్టిలో సమానులే గదా! 2 నేను ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీయులను, 2 క్రేతు నుంచి ఫిలిష్తీయులను, 2 కీరు నుంచి అరామీయులనూ రప్పించాను గదా! 2
8యెహోవా ప్రభువు కళ్ళు ఈ పాపిష్ఠి రాజ్యాన్ని చూస్తున్నాయి. 2 దాన్ని భూమి మీద ఉండకుండాా నాశనం చేస్తాను. 2 అయితే యాకోబు వంశాన్ని పూర్తిగా నాశనం చేయను.” 2 యెహోవా వెల్లడించేది ఇదే.
9“చూడండి. నేనొక ఆజ్ఞ ఇస్తాను. 2 ఒకడు ధాన్యాన్ని జల్లెడలో పోసి 2 ఒక్క గింజ కూడా కింద పడకుండా జల్లించినట్టు, 2 ఇశ్రాయేలీయులను అన్ని రాజ్యాల మధ్యకు జల్లిస్తాను. 2
10‘విపత్తు మన దరి చేరదు. మనలను తరమదు’ అని నా ప్రజల్లో అనుకునే 2 పాపాత్ములంతా కత్తితో చస్తారు.” 1 ఇశ్రాయేలు పూర్వపు వైభవ స్థితి నెలకొనడం
11పడిపోయిన దావీదు గుడారాన్ని ఆ రోజు నేను లేవనెత్తి 2 దాని గోడలను బాగుచేస్తాను. శిథిలాలను లేపుతాను. 2 ముందు ఉన్నట్టు దాన్ని తిరిగి నిర్మిస్తాను. 2
12వాళ్ళు ఎదోములో మిగిలిన వారిని 2 నా పేరు పెట్టుకున్న రాజ్యాలన్నీ 2 నా ప్రజలు స్వాధీనం చేసుకునేలా చేస్తాను. 2 ఇలా చేసే యెహోవా ప్రకటన ఇదే.
13“రాబోయే రోజుల్లో పంటకోసేవాడు పొలం దున్నే వాడి వెంటే వస్తాడు. 2 విత్తనం చల్లుతుండగానే ద్రాక్షపళ్ళు తొక్కేవాళ్ళు వస్తారు. 2 పర్వతాలు తియ్యటి ద్రాక్షారసం స్రవిస్తాయి. 2 కొండలన్నీ దాన్ని ప్రవహింప చేస్తాయి. 2 యెహోవా ప్రకటించేది ఇదే.
14బందీలుగా దేశాంతరం పోయిన నా ప్రజలలైన ఇశ్రాయేలీయులను నేను తిరిగి తీసుకు వస్తాను. 2 శిథిలమైన పట్టణాలను మళ్ళీ కట్టుకుని వాళ్ళు వాటిలో నివసిస్తారు. 2 ద్రాక్షతోటలు నాటి వాటి ద్రాక్షారసాన్ని తాగుతారు. 2 తోటలు వేసి వాటి పళ్ళు తింటారు. 2
15వారి దేశంలో నేను వాళ్ళను నాటుతాను. 2 నేను వారికిచ్చిన దేశంలోనుంచి వారిని ఇక ఎన్నటికీ పెరికి వేయడం జరగదు.” 2 మీ యెహోవా దేవుడు చెబుతున్నాడు.