Amos · బైబిల్ (తెలుగు)

Amos 5

1ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని గురించి నేను దుఃఖంతో చెప్పే ఈ మాట వినండి. 2

2ఇశ్రాయేలు కన్య కూలిపోయింది. 2 ఆమె ఇంకా ఎప్పటికీ లేవదు. 2 లేపడానికి ఎవరూ లేక ఆమె తన నేల మీద పడి ఉంది.

3యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, 2 “ఇశ్రాయేలు వారిలో ఒక పట్టణం నుంచి వెయ్యి మంది బయలుదేరితే వంద మంది మాత్రమే తప్పించుకుని వస్తారు. 2 వంద మంది బయలుదేరితే పది మంది మాత్రమే తప్పించుకుని వస్తారు.”

4ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెబుతున్నాడు, 2 “నన్ను వెతికి జీవించండి. 2

5బేతేలును ఆశ్రయించవద్దు. 2 గిల్గాలులో అడుగు పెట్టవద్దు. 2 బెయేర్షెబాకు పోవద్దు. 2 గిల్గాలు వారు తప్పకుండా బందీలవుతారు. 2 బేతేలుకు ఇక దుఖమే.”

6యెహోవాను ఆశ్రయించి జీవించండి. 2 లేకపోతే ఆయన యోసేపు వంశం మీద నిప్పులాగా పడతాడు. 2 అది దహించి వేస్తుంది. 2 బేతేలులో ఎవరూ దాన్ని ఆర్పలేరు. 2

7వాళ్ళు న్యాయాన్ని భ్రష్టం చేసి, 2 నీతిని నేలపాలు చేస్తున్నారు. 2

8ఆయన నక్షత్ర మండలాలను చేసిన వాడు. 2 చీకటిని తెలవారేలా చేసేవాడు. 2 పగటిని రాత్రి చీకటిగా మార్చేవాడు. 2 సముద్రపు నీటిని మబ్బుల్లాగా చేసి 2 భూమి మీద కుమ్మరిస్తాడు. 2

9ఆయన పేరు యెహోవా. 2 బలవంతుల మీదికి ఆయన అకస్మాత్తుగా 2 నాశనం రప్పిస్తే కోటలు నాశనమవుతాయి.

10పట్టణ గుమ్మం దగ్గర బుద్ధి చెప్పే వారిని 2 వాళ్ళు అసహ్యించుకుంటారు. 2 యథార్థంగా మాట్లాడే వారిని ఏవగించుకుంటారు. 2

11మీరు పేదలను అణగదొక్కుతూ 2 ధాన్యం ఇమ్మని వారిని బలవంతం చేస్తారు, 2 కాబట్టి మీరు చెక్కిన రాళ్ళతో ఇళ్ళు కట్టుకున్నా 2 వాటిలో నివసించరు. 2 మీకు చక్కటి ద్రాక్ష తోటలు ఉన్నా 2 ఆ ద్రాక్ష మద్యం తాగరు. 2

12మీ నేరాలెన్నో నాకు తెలుసు. 2 మీ పాపాలు ఎంత భయంకరమైనవో నాకు తెలుసు. 2 మీరు లంచాలు తీసుకుని 2 తప్పుచేయని వారిని బాధిస్తారు. 2 ఊరి గుమ్మం దగ్గర పేదలను పట్టించుకోరు. 2

13అది గడ్డుకాలం గనక 2 ఎలాంటి బుద్దిమంతుడైనా అప్పుడు ఊరుకుంటాడు.

14మీరు బతికేలా చెడు విడిచి మంచి వెతకండి. 2 అలా చేస్తే మీరనుకున్నట్టు 2 యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు 2 తప్పకుండా మీతో ఉంటాడు. 2

15చెడును ద్వేషించి మంచిని ప్రేమించండి. 2 పట్టణ గుమ్మాల్లో న్యాయాన్ని స్థిరపరచండి. 2 ఒకవేళ యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు 2 యోసేపు వంశంలో మిగిలిన వారిని కనికరిస్తాడేమో.

16అందుచేత యెహోవా ప్రభువు, 2 సేనల అధిపతి అయిన దేవుడు చెప్పేదేమిటంటే, 2 “ప్రతి రాజమార్గంలో ఏడుపు ఉంటుంది. 2 ప్రతి నడివీధిలో ప్రజలు చేరి ‘అయ్యో! అయ్యో’ అంటారు. 2 ఏడవడానికి, వాళ్ళు రైతులను పిలుస్తారు. 2 దుఖపడే నేర్పు గలవారిని ఏడవడానికి పిలిపిస్తారు. 2

17ద్రాక్షతోటలన్నిటిలో ఏడుపు తీవ్రంగా ఉంటుంది. 2 ఎందుకంటే నేను మీ మధ్యగా వెళతాను.” 1 యెహోవా తీర్పు దినం

18యెహోవా తీర్పు దినం రావాలని ఆశించే మీకు 2 ఎంతో బాధ. యెహోవా తీర్పు దినం కోసం ఎందుకు ఆశిస్తారు? 2 అది వెలుగుగా ఉండదు, చీకటిగా ఉంటుంది. 2

19ఒకడు సింహం నుంచి తప్పించుకుంటే 2 ఎలుగుబంటి ఎదురు పడినట్టు, 2 లేకపోతే ఒకడు ఇంట్లోకి పోయి, గోడ మీద చెయ్యివేస్తే 2 పాము అతన్ని కాటేసినట్టు ఆ రోజు ఉంటుంది. 2

20యెహోవా దినం వెలుగుగా కాక అంధకారంగా ఉండదా? 2 కాంతితో కాక చీకటిగా ఉండదా?

21మీ పండగ రోజులు నాకు అసహ్యం. అవి నాకు గిట్టవు. 2 మీ ప్రత్యేక సభలంటే నాకేమీ ఇష్టం లేదు. 2

22నాకు దహనబలులనూ నైవేద్యాలనూ మీరర్పించినా 2 నేను వాటిని అంగీకరించను. 2 సమాధాన బలులుగా మీరర్పించే కొవ్విన పశువులను నేను చూడను.

23మీ పాటల ధ్వని నా దగ్గర నుంచి తీసేయండి. 2 మీ తీగ వాయిద్యాల సంగీతం నేను వినను. 2

24నీళ్లలా న్యాయాన్ని పారనివ్వండి. 2 నీతిని ఎప్పుడూ ప్రవహించేలా చేయండి.

25ఇశ్రాయేలీయులారా, అరణ్యంలో నలభై ఏళ్ళు 2 మీరు బలులనూ నైవేద్యాలనూ నాకు తెచ్చారా? 2

26మీరు మీకోసం కైవాను అనే నక్షత్ర దేవుడి విగ్రహాలను చేసుకున్నారు. 2 సిక్కూతు అనే దేవుడి విగ్రహాన్ని రాజుగా మీరు మోసుకొచ్చారు.

27కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి 2 మిమ్మల్ని బందీలుగా తీసుకుపోతాను, 2 అని యెహోవా చెబుతున్నాడు. 2 ఆయన పేరు సేనల అధిపతి అయిన దేవుడు.

← Amos 4Read In The App, Free →Amos 6 →

Study Amos 5

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789