Amos 3
1ఇశ్రాయేలీయులారా! యెహోవా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఐగుప్తుదేశం నుంచి ఆయన రప్పించిన వంశమంతటి గురించి ఆయన తెలియజేసిన మాట వినండి. 2
2లోకంలోని వంశాలన్నిటిలో 2 మిమ్మల్ని మాత్రమే నేను ఎన్నుకున్నాను. 2 కాబట్టి మీ పాపాలన్నిటికీ 2 మిమ్మల్ని శిక్షిస్తాను.
3సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడుస్తారా? 2 ఏమీ దొరకకుండానే సింహం అడవిలో గర్జిస్తుందా? 2
4దేన్నీ పట్టుకోకుండానే 2 కొదమ సింహం గుహలోనుంచి గుర్రుమంటుందా?
5నేల మీద ఎర పెట్టకపోతే పిట్ట ఉరిలో చిక్కుకుంటుందా? 2 ఉరిలో ఏదీ చిక్కకపోతే 2 ఉరి పెట్టేవాడు వదిలేసి వెళతాడా? 2
6పట్టణంలో బాకానాదం వినబడితే 2 ప్రజలు భయపడరా? 2 యెహోవా పంపకుండా 2 పట్టణంలో విపత్తు వస్తుందా? 1
7తన సేవకులైన ప్రవక్తలకు తన ఆలోచనలను తెలియచేయకుండా కచ్చితంగా యెహోవా ప్రభువు ఏదీ చేయడు. 2
8సింహం గర్జించింది. 2 భయపడని వాడెవడు? 2 యెహోవా ప్రభువు చెప్పాడు. 2 ప్రవచించని వాడెవడు?
9అష్డోదు రాజ భవనాల్లో ప్రకటించండి. 2 ఐగుప్తుదేశపు రాజ భవనాల్లో ప్రకటించండి. 2 వాళ్ళతో ఇలా చెప్పండి, 2 “మీరు సమరయ పర్వతాల మీద సమావేశమై 2 దానిలోని గందరగోళాన్ని చూడండి. 2 అక్కడ జరిగే దౌర్జన్యాన్ని చూడండి. 2
10సరైనదాన్ని ఎలా చేయాలో వారికి తెలియదు.” 2 యెహోవా ప్రకటించేది ఇదే. 2 వాళ్ళు తమ రాజ భవనాల్లో దౌర్జన్యం, 2 నాశనం దాచుకున్నారు.
11కాబట్టి యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, 2 శత్రువు ఆ ప్రాంతాన్ని చుట్టుముడతాడు. 2 అతడు నీకు పట్టున్న వాటిని పడగొడతాడు. 2 నీ రాజ భవనాలను దోచుకుంటాడు.
12యెహోవా చెప్పేదేమిటంటే, 2 “సింహం నోట్లో నుంచి 2 కేవలం రెండు కాళ్ళు గానీ 2 చెవి ముక్క గానీ 2 కాపరి విడిపించేలాగా 2 సమరయలో నివసించే ఇశ్రాయేలీయులను కాపాడతాను. 2 కేవలం మంచం మూల, 2 లేకపోతే దుప్పటి ముక్కను కాపాడతాను.”
13యాకోబు ఇంటి వారికి విరోధంగా ఇది విని ప్రకటించండి. 2 యెహోవా ప్రభువు, సేనల దేవుడు చెప్పేదేమిటంటే, 2
14“ఇశ్రాయేలు పాపాలను నేను శిక్షించే రోజు, 2 బేతేలులోని బలిపీఠాలను కూడా నేను శిక్షిస్తాను. 2 బలిపీఠం కొమ్ములు విరిగిపోయి నేలరాలతాయి.
15చలికాలపు భవనాలనూ 2 వేసవికాలపు భవనాలనూ నేను నాశనం చేస్తాను. 2 ఏనుగు దంతంతో కట్టిన ఇళ్ళు నాశనమవుతాయి. 2 పెద్ద భవనాలు అంతరించిపోతాయి.” 2 యెహోవా ప్రకటించేది ఇదే.