Amos 8
1యెహోవా ప్రభువు నాకిది చూపించాడు. అదిగో ఎండాకాలపు + 8:1 ఎండాకాలపు పండిన పళ్ళ గంప!
2ఆయన “ఆమోసూ, నువ్వేం చూస్తున్నావు?” అని అడిగాడు. నేను “ఎండాకాలపు పళ్ళ గంప” అన్నాను. అప్పుడు యెహోవా నాతో, 1 నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు అంతం వచ్చేసింది. 1 ఇక నేను వాళ్ళను వదిలిపెట్టను. 1
3యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, 1 “మందిరంలో వాళ్ళు పాడే పాటలు ఏడుపులవుతాయి. 1 ఆ రోజు శవాలు విపరీతంగా పడి ఉంటాయి. 1 నిశ్శబ్దంగా వాటిని అన్ని చోట్లా పడేస్తారు” అన్నాడు.
4దేశంలోని పేదలను తీసేస్తూ దీనులను అణిచేసే మీరు ఈ విషయం వినండి.
5వారిలా అంటారు, 2 “మనం ధాన్యం అమ్మడానికి అమావాస్య ఎప్పుడు వెళ్ళిపోతుందో? 2 గోదుమల వ్యాపారం చేసుకోడానికి సబ్బాతు ఎప్పుడు పోతుందో? 2 మనం కొలపాత్రను చిన్నదిగా చేసి, వెల పెంచుదాం. 2 తప్పుడు తూకాలతో మనం మోసం చేద్దాం. 2
6పాడైపోయిన గోదుమలను అమ్మి, వెండికి పేదవారిని కొందాం. 2 దీనులను, ఒక జత చెప్పులకు కొందాం.”
7యాకోబు అతిశయాస్పదం తోడని యెహోవా ఇలా ప్రమాణం చేశాడు. “వారు చేసిన పనుల్లో దేన్నీ నేను మరచిపోను.” 2
8దీన్ని బట్టి భూమి కంపించదా? 2 అందులో నివసించే వారంతా దుఃఖపడరా? 2 నైలునది లాగా అదంతా పొంగుతుంది. 2 ఐగుప్తుదేశపు నదిలాగా 2 అది పైకి లేచి, మళ్ళీ అణిగి పోతుంది.
9యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, 2 ఆ రోజు నేను మధ్యాహ్నమే పొద్దు గుంకేలా చేస్తాను. 2 పట్టపగలే భూమికి చీకటి కమ్ముతుంది. 2
10మీ పండగలను దుఃఖదినాలుగా 2 మీ పాటలన్నిటినీ విషాద గీతాలుగా మారుస్తాను. 2 మీరంతా గోనెపట్ట కట్టుకొనేలా చేస్తాను. 2 మీ అందరి తలలు బోడిచేస్తాను. 2 ఒక్కడే కొడుకు చనిపోతే శోకించినట్టుగా నేను చేస్తాను. 2 దాని ముగింపు ఘోరమైన రోజుగా ఉంటుంది.
11యెహోవా ప్రకటించేది ఇదే, 2 “రాబోయే రోజుల్లో దేశంలో నేను కరువు పుట్టిస్తాను. 2 అది తిండి కోసం, మంచినీళ్ళ కోసం కరువు కాదు కానీ 2 యెహోవా మాటలు వినకపోవడం వలన కలిగేదిగా ఉంటుంది. 2
12యెహోవా మాట వినడానికి ఒక సముద్రం నుంచి మరొక సముద్రం వరకూ, 2 ఉత్తర దిక్కు నుంచి తూర్పు దిక్కు వరకూ తిరుగుతారు 2 కానీ అది వారికి దొరకదు.
13ఆ రోజు అందమైన కన్యలూ 2 యువకులూ దాహంతో సోలిపోతారు. 2
14సమరయ పాపంతో ఒట్టు పెట్టుకునే వారు, 2 ‘దాను, నీ దేవుని ప్రాణం మీద ఒట్టు.’ 2 ‘బెయేర్షెబా + 8:14 బెయేర్షెబా విగ్రహ పూజ వంటిది, దేవుని ప్రాణం మీద ఒట్టు’ అనేవారు 2 ఇంకా ఎన్నడూ లేవలేకుండా కూలిపోతారు.”