Micah · బైబిల్ (తెలుగు)

Micah 1

1యోతాము ఆహాజు హిజ్కియా అనే యూదా రాజుల రోజుల్లో సమరయ గురించి యెరూషలేము గురించి దర్శనాల్లో మోరష్తీయుడైన మీకాకు యెహోవా తెలియజేసిన సందేశం.

2ప్రజలారా, మీరంతా వినండి. 1 భూమీ, నువ్వూ నీలో ఉన్నదంతా వినాలి. 1 యెహోవా ప్రభువు మీ మీద సాక్ష్యం చెప్పబోతున్నాడు. 1 పరిశుద్ధాలయంలోనుంచి ప్రభువు మీ మీద సాక్ష్యం చెప్పబోతున్నాడు. 1

3చూడండి. యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుతున్నాడు. 1 ఆయన దిగి భూమి మీది ఉన్నత స్థలాల మీద నడవబోతున్నాడు. 1

4ఆయన కింద పర్వతాలు కరిగిపోతాయి. లోయలు పగిలిపోతాయి. 1 నిప్పుకు కరిగిపోయే మైనంలా, 1 వాలు మీద పడ్డ నీళ్ళు పారే విధంగా అవి కరిగిపోతున్నాయి.

5ఇదంతా యాకోబు తిరుగుబాటు మూలంగానే. 1 ఇశ్రాయేలు సంతానం వారి పాపాలే కారణం. 1 యాకోబు తిరుగుబాటుకు మూలం ఏంటి? 1 అది సమరయ కాదా? 1 యూదావారి ఉన్నత స్థలాల మూలం ఏంటి? 1 అది యెరూషలేము కాదా?

6నేను సమరయను పొలం లోని రాళ్లకుప్పలాగా చేస్తాను. 1 ద్రాక్షతోటలు నాటే స్థలంగా చేస్తాను. 1 దాని రాళ్ళు లోయలో పారబోస్తాను, 1 దాని పునాదులు కనబడేలా చేస్తాను. 1

7దాని చెక్కుడు బొమ్మలు ముక్కలు ముక్కలవుతాయి. 1 దాని కానుకలు మంటల్లో కాలిపోతాయి. 1 దాని విగ్రహాలన్నిటినీ నేను పాడు చేస్తాను. 1 అది వేశ్యగా సంపాదించుకున్న కానుకలతో వాటిని తెచ్చుకుంది, 1 కాబట్టి అవి వేశ్య జీతంగా మళ్ళీ వెళ్ళిపోతాయి. 1 ప్రవక్త విలాపం

8ఈ కారణంగా నేను కేకలు పెట్టి ప్రలాపిస్తాను. 1 చెప్పులూ బట్టలూ వేసుకోకుండా తిరుగుతాను. 1 నక్కల్లాగా అరుస్తాను. గుడ్లగూబల్లాగా మూలుగుతాను. 1

9దాని గాయాలు మానవు. 1 అవి యూదాకు తగిలాయి. 1 నా ప్రజల గుమ్మం వరకూ, యెరూషలేము వరకూ అవి వచ్చాయి. 1

10ఈ సంగతి గాతులో చెప్పవద్దు. 1 అక్కడ ఏమాత్రం ఏడవద్దు. 1 బేత్ లెయప్రలో నేను దుమ్ములో పడి పొర్లాడాను.

11షాఫీరు పురవాసులారా, 1 నగ్నంగా సిగ్గుతో వెళ్ళిపోండి. 1 జయనాను పురవాసులారా, బయటకు రావద్దు. 1 బేత్ ఎజేల్ దుఖిస్తోంది. 1 వారి భద్రత తొలిగి పోయింది. 1

12మారోతువారు మంచి కబురు కోసం ఆరాటంగా ఉన్నారు. 1 యెహోవా విపత్తు కలిగించాడు. 1 అది యెరూషలేము గుమ్మాల వరకూ వచ్చింది.

13లాకీషు పురవాసులారా, రథాలకు యుద్ధాశ్వాలను పూన్చండి. 1 ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాట్లు నీలో కనిపించాయి. 1 నువ్వు సీయోను కుమార్తె పాపానికి ప్రారంభం. 1

14మీరు విడుదల కోసం మోరెషెత్ గాతుకు కానుకలిస్తారు. 1 అక్జీబు ఊరు ఇశ్రాయేలు రాజులను మోసగిస్తుంది.

15మారేషా పురవాసులారా, మిమ్మల్ని వశం చేసుకునే వాణ్ణి మీ మీదికి పంపిస్తాను. 1 ఇశ్రాయేలీయుల నాయకులు + 1:15 నాయకులు మహిమ అదుల్లాం గుహకు వెళ్ళిపోతారు. 1

16నీకిష్టమైన పిల్లల కోసం నీ తల బోడి చేసుకో. 1 నీ వెంట్రుకలు కత్తిరించుకో. 1 రాబందులాగా బోడిగా ఉండు. 1 నీ పిల్లలు నీ దగ్గర నుంచి చెరలోకి వెళ్ళిపోతారు.

← Jonah 4Read In The App, Free →Micah 2 →

Study Micah 1

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

1234567