Micah · బైబిల్ (తెలుగు)

Micah 5

1యెరూషలేము ప్రజలారా, యుద్ధ సేనలతో ఇప్పుడు కలిసి రండి. 1 నీ పట్టణం చుట్టూ గోడ ఉంది. 1 అయితే శత్రువులు ఇశ్రాయేలీయుల నాయకుణ్ణి బెత్తంతో చెంప మీద కొడతారు. 1

2బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబాల మధ్య నువ్వు చిన్న గ్రామమైనా నా కోసం ఇశ్రాయేలీయులను పాలించేవాడు నీలోనుంచి వస్తాడు. ఆయన పూర్వకాలం నుంచి, నిత్యం నుంచి ఉన్నవాడు. 1

3కాబట్టి ప్రసవవేదన పడే స్త్రీ, బిడ్డను కనే వరకూ, దేవుడు వారిని అప్పగిస్తాడు. 1 అప్పుడు ఆయన సోదరుల్లో మిగిలినవారు ఇశ్రాయేలీయుల దగ్గరికి తిరిగి వస్తారు.

4ఆయన యెహోవా బలంతో 1 తన యెహోవా దేవుని పేరులోని గొప్పదనంతో 1 నిలబడి తన మంద మేపుతాడు. 1 వాళ్ళు క్షేమంగా ఉంటారు. 1 భూమి కొనల వరకూ ఆయన గొప్పవాడిగా ఉంటాడు. 1 విధ్వంసం, విమోచన 1

5అష్షూరీయులు మన దేశంలో చొరబడినప్పుడు, 1 వాళ్ళు మన ప్రాకారాల మీద దండెత్తినప్పుడు 1 వాన్ని ఎదిరించడానికి మేము ఏడుగురు గొర్రెల కాపరులను, 1 ఎనిమిది మంది నాయకులను నియమిస్తాం. 1 ఆయనే మనకు శాంతి.

6వారు కత్తితో అష్షూరు దేశాన్ని పాలిస్తారు. 1 తమ చేతుల్లోని కత్తులతో నిమ్రోదు దేశాన్ని పరిపాలిస్తారు. 1 అష్షూరీయులు మన దేశంలో చొరబడి 1 మన సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు 1 ఆయన మనలను ఇలా కాపాడతాడు. 1

7యాకోబు సంతానంలో మిగిలినవారు అనేక ప్రజల మధ్య నివసిస్తూ, 1 యెహోవా కురిపించే మంచులాగా, 1 మానవ ప్రయత్నం, ఆలోచన లేకుండ, 1 గడ్డి మీద పడే వానలాగా ఉంటారు.

8యాకోబు సంతానంలో మిగిలినవారు 1 రాజ్యాల మధ్య, అనేక ప్రజల మధ్య 1 అడవి జంతువుల్లోని సింహం లాగా, 1 గొర్రెల మందల్లోని కొదమ సింహం లాగా ఉంటారు. 1 అది మందల్లో దూరి వాటిని తొక్కుతూ వాటిని చీల్చేస్తుంది. 1

9నీ చెయ్యి నీ శత్రువుల మీద ఎత్తి ఉంటుంది. 1 అది వారిని నిర్మూలం చేస్తుంది.

10యెహోవా ఇలా చెబుతున్నాడు, 1 “ఆ రోజు నేను నీ గుర్రాలన్నిటినీ నాశనం చేస్తాను. 1 నీ రథాలను ధ్వంసం చేస్తాను. 1

11నీ దేశంలోని పట్టణాలను నాశనం చేస్తాను. 1 నీ కోటలన్నిటినీ పడగొడతాను.

12మీ మధ్య మంత్రవిద్య లేకుండా నిర్మూలం చేస్తాను. 1 జాతకం చెప్పేవారు ఇక నీలో ఉండరు. 1

13చెక్కిన విగ్రహాలూ 1 దేవతా స్తంభాలూ మీ మధ్య ఉండకుండాా నాశనం చేస్తాను. 1 అప్పటినుంచి మీరు చేతులతో చేసిన వాటికి మొక్కరు. 1

14మీ అషేరా దేవతా స్తంభాలను మీ మధ్య ఉండకుండాా వాటిని పెల్లగిస్తాను. 1 నీ పట్టణాలను పడగొడతాను. 1

15నేను మహా కోపంతో ఉగ్రతతో 1 నా మాట వినని రాజ్యాలకు ప్రతీకారం చేస్తాను.”

← Micah 4Read In The App, Free →Micah 6 →

Study Micah 5

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

1234567