Micah · బైబిల్ (తెలుగు)

Micah 7

1నాకెంతో బాధగా ఉంది! 1 వేసవికాలపు పండ్లు కోసుకున్న తరువాత, 1 ద్రాక్షతోటల్లో మిగిలిపోయిన ద్రాక్షపండ్ల పరిగె కూడా ఏరుకున్న తరువాత ఎలా ఉంటుందో, నా పరిస్థితి ఆలా ఉంది. 1 పండ్ల గుత్తులు ఇక ఏమీ లేవు. 1 అయినా నేను మొదటి అంజూరపు పండ్ల కోసం ఆశతో ఉన్నాను. 1

2భక్తులు దేశంలో లేకుండా పోయారు. 1 ప్రజల్లో యథార్థపరుడు ఒకడూ లేడు. 1 హత్య చేయడానికి అందరూ పొంచి ఉంటారు. 1 ప్రతివాడూ తన తోటి దేశస్థుని వలలో చిక్కించాలని వేటాడుతూ ఉంటాడు.

3వాళ్ళ రెండు చేతులూ కీడు చేయడానికి ఆరితేరాయి. 1 అధికారి డబ్బులు అడుగుతాడు. 1 న్యాయమూర్తి లంచాలకు సిద్ధంగా ఉంటాడు. 1 గొప్పవాడు తనకు కావాలిసిన దాన్ని తెమ్మని చెబుతున్నాడు. 1 ఆవిధంగా వాళ్ళు, కలిసి కపట ఉపాయాలు పన్నుతారు. 1

4వారిలోని మంచివారు ముళ్ళచెట్టులాంటి వారు. 1 వారిలోని నిజాయితీ పరులు ముళ్ళకంచెలాంటి వారు. 1 అది నీ కాపలాదారులు ముందే చెప్పిన రోజు, 1 మీరు శిక్ష అనుభవించే రోజు. 1 ఇప్పుడే వారికి కలవరం వచ్చేసింది.

5ఏ పొరుగువాన్నీ నమ్మవద్దు. 1 ఏ స్నేహితుని మీదా నమ్మకం పెట్టుకోవద్దు. 1 నీ కౌగిట్లో పడుకునే స్త్రీతో కూడా జాగ్రత్తగా మాట్లాడు. 1

6కొడుకు తండ్రిని అగౌరవపరుస్తున్నాడు. 1 కూతురు తన తల్లి మీద, కోడలు తన అత్త మీద ఎదురు తిరుగుతారు. 1 తన సొంత ఇంటివారే తన శత్రువులు.

7అయితే, నా వరకైతే నేను యెహోవా కోసం ఎదురుచూస్తాను. 1 రక్షణకర్త అయిన నా దేవుని కోసం నేను కనిపెడతాను. 1 నా దేవుడు నా మాట వింటాడు. 1 ఇశ్రాయేలు తిరిగి లేవడం 1

8నా పగవాడా, నా మీద అతిశయించవద్దు. 1 నేను కింద పడినా తిరిగి లేస్తాను. 1 నేను చీకట్లో కూర్చున్నపుడు 1 యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు.

9నేను యెహోవా దృష్టికి పాపం చేశాను, 1 కాబట్టి ఆయన నా పక్షాన వాదించి 1 నా పక్షాన న్యాయం తీర్చే వరకూ 1 నేను ఆయన కోపాగ్ని సహిస్తాను. 1 ఆయన నన్ను వెలుగులోకి తెస్తాడు. 1 ఆయన తన న్యాయంలో నన్ను కాపాడడం నేను చూస్తాను.

10నా శత్రువు దాన్ని చూస్తాడు. 1 “నీ యెహోవా దేవుడు ఎక్కడ?” 1 అని నాతో అన్నది అవమానం పాలవుతుంది. 1 నా కళ్ళు ఆమెను చూస్తాయి. 1 వీధుల్లోని మట్టిలా ఆమెను తొక్కుతారు.

11నీ గోడలు కట్టించే రోజు వస్తుంది. 1 ఆరోజు నీ సరిహద్దులు చాలా దూరం వరకూ విశాలమవుతాయి. 1

12ఆ రోజు అష్షూరు దేశం నుంచి, 1 ఐగుప్తు దేశపు పట్టణాల నుంచి, ఐగుప్తు మొదలు యూఫ్రటీసు నది వరకూ ఉన్న ప్రాంతం నుంచి, 1 ఒక సముద్రం నుంచి మరో సముద్రం వరకూ 1 ఒక పర్వతం నుంచి మరో పర్వతం వరకూ ఉన్న ప్రజలు 1 నీ దగ్గరికి వస్తారు. 1

13ఇప్పుడు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల వలన, 1 వారు చేసిన పనుల వలన ఆ ప్రాంతాలు పాడవుతాయి. 1 దేవుని క్షమాపణ, ఆయన కనికరం

14నీ చేతికర్రతో నీ ప్రజలకు కాపరిగా ఉండు. వారు నీ సొత్తు. 1 కర్మెలుకు చెందిన అడవిలో వాళ్ళు ఒంటరిగా నివసిస్తున్నా 1 పూర్వ కాలంలో బాషాను, గిలాదుల్లో మేసినట్టు మేస్తారు. 1

15ఐగుప్తుదేశంలో నుంచి నువ్వు వచ్చినప్పుడు జరిగినట్టుగా 1 నేను ప్రజలకు అద్భుతాలు చూపిస్తాను.

16రాజ్యాలు వారందరి బలం చూసి సిగ్గుపడతాయి. 1 వాళ్ళు తమ నోటిమీద తమ చేతులు పెట్టుకుంటారు. 1 వాళ్ళ చెవులు వినబడవు.

17పాము లాగా, భూమి మీద పాకే పురుగుల్లాగా వాళ్ళు మట్టి నాకుతారు. 1 వాళ్ళు తమ గుహల్లోనుంచి భయంతో బయటికి వస్తారు. 1 భయంతో మన యెహోవా దేవుని దగ్గరికి వస్తారు. 1 నిన్నుబట్టి వాళ్ళు భయపడతారు.

18నీ వంటి దేవుడెవరు? నువ్వు పాపాన్ని తీసివేసే వాడివి. 1 నీ స్వజనంలో మిగిలినవారి దోషాన్ని పరిహరించే వాడివి. 1 నువ్వు నీ నిబంధన నమ్మకత్వాన్ని మాకు ఇష్టంగా చూపించే వాడివి. 1 నువ్వు నీ కోపాన్ని ఎప్పటికీ అలానే ఉంచేవాడివి కాదు.

19నువ్వు మళ్ళీ మమ్మల్ని కనికరిస్తావు. 1 నీ పాదాల కింద మా అపరాధాలను నువ్వు తొక్కేస్తావు. 1 మా పాపాలన్నిటినీ సముద్రం అడుగుకు నువ్వు పడవేస్తావు. 1

20నువ్వు యాకోబుకు సత్యాన్ని ఇస్తావు. 1 పూర్వకాలంలో మా పూర్వీకులు అబ్రాహాముకు ప్రమాణం చేసిన నిబంధన నమ్మకత్వాన్ని చూపిస్తావు.

← Micah 6Read In The App, Free →Nahum 1 →

Study Micah 7

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

1234567