Micah · బైబిల్ (తెలుగు)

Micah 3

1నేనిలా చెప్పాను. “యాకోబు నాయకులారా, 1 ఇశ్రాయేలీయుల అధికారులారా, ఇప్పుడు వినండి. 1 న్యాయం అంటే ఏంటో మీరు తెలుసుకోవద్దా? 1

2మీరు మంచిని అసహ్యించుకుని చెడును ఇష్టపడతారు. 1 నా ప్రజల చర్మం ఒలిచేసి 1 వారి ఎముకల మీద ఉన్న మాంసాన్ని చీలుస్తారు. 1

3నా ప్రజల మాంసాన్ని తింటారు. 1 వారి చర్మాన్ని ఒలిచి వారి ఎముకలను విరగగొట్టేస్తారు. 1 ఒకడు పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్టుగా 1 ఉడుకుతున్న పాత్రలో వేసే మాంసాన్ని 1 ముక్కలు చేసినట్టు మీరు చేస్తారు.

4ఆ తరువాత నాయకులైన మీరు యెహోవాకు మొరపెడతారు 1 కానీ ఆయన వారికి జవాబివ్వడు. 1 మీరు చెడు పనులు చేశారు. 1 కాబట్టి అప్పుడు ఆయన వారికి తన ముఖాన్ని చూపించడు.”

5నా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రవక్తలను గురించి యెహోవా చెప్పేదేమిటంటే, 1 తమకు భోజనం పెట్టేవారికి “సంపద వస్తుంది” అని చెబుతారు. 1 భోజనం పెట్టకపోతే, వారి మీద యుద్ధం ప్రకటిస్తారు. 1

6అందుచేత మీకు దర్శనాలేమీ రాకుండా రాత్రి కమ్ముకువస్తుంది. 1 సోదె చెప్పకుండా మీకు చీకటి ఆవరిస్తుంది. 1 ఇలాంటి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండ అస్తమిస్తాడు. 1 పగలు చీకటిగా మారిపోతుంది. 1

7అప్పుడు భవిష్యత్తును చెప్పేవారికి సిగ్గు కలుగుతుంది. 1 సోదె చెప్పేవాళ్ళు కలవరపడతారు. 1 నా దగ్గరనుంచి జవాబేమీ రానందుకు వారంతా నోరు మూసుకుంటారు.

8అయితే నా మట్టుకైతే, యాకోబు సంతానానికి వాళ్ళ అతిక్రమాలనూ 1 ఇశ్రాయేలీయులకు తమ పాపాన్ని వెల్లడించడానికి 1 యెహోవా ఆత్మమూలంగా 1 సంపూర్ణ అధికారంతో, న్యాయంతో ఉన్నాను.

9యాకోబు వంశపు ప్రధానులారా, 1 ఇశ్రాయేలీయుల అధిపతులారా, 1 ఈ మాట వినండి. మీరు న్యాయాన్ని తృణీకరిస్తూ 1 సక్రమంగా ఉండే సమస్తాన్నీ వక్రం చేస్తారు. 1

10సీయోనును మీరు రక్తంతో కడతారు. 1 దుర్మార్గంతో యెరూషలేమును కడతారు. 1

11ప్రజల ప్రధానులు లంచం పుచ్చుకుని తీర్పు తీరుస్తారు. 1 వారి యాజకులు కూలికి బోధిస్తారు. 1 ప్రవక్తలు డబ్బు కోసం సోదె చెబుతారు. 1 అయినా వాళ్ళు యెహోవాను ఆధారం చేసుకుని 1 “యెహోవా మన మధ్య ఉన్నాడు గదా, 1 ఏ కీడూ మనకు రాదు” అనుకుంటారు.

12కాబట్టి మీ మూలంగా శత్రువులు సీయోనును పొలంలాగా దున్నుతారు. 1 యెరూషలేము రాళ్ల కుప్ప అవుతుంది. 1 మందిరమున్న కొండ, అడవిలాగా అవుతుంది.

← Micah 2Read In The App, Free →Micah 4 →

Study Micah 3

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

1234567