Micah 4
1తరువాత రోజుల్లో యెహోవా మందిర పర్వతం 1 పర్వతాలన్నిట్లో ప్రధానమైనదిగా ఉంటుంది. 1 కొండల కంటే ఎత్తుగా ఉంటుంది. 1 ప్రజల సమూహాలు ప్రవాహంలాగా అక్కడికి వస్తూ ఉంటారు. 1
2అనేక రాజ్యాలవారు వచ్చి ఇలా అంటారు, 1 “యాకోబు దేవుని మందిరానికి, 1 యెహోవా పర్వతానికి మనం వెళ్దాం, పదండి. 1 ఆయన తన విధానాలను మనకు నేర్పిస్తాడు. 1 మనం ఆయన దారుల్లో నడుచుకుందాం.” 1 సీయోనులో నుంచి ధర్మశాస్త్రం, 1 యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు వెలువడతాయి. 1
3ఆయన మధ్యవర్తిగా అనేక ప్రజలకు న్యాయం తీరుస్తాడు. 1 దూరంగా ఉండే విస్తారమైన రాజ్యాల వివాదాలను పరిష్కరిస్తాడు. 1 వారు తమ కత్తులను నాగటి నక్కులుగా 1 తమ ఈటెలను మచ్చు కత్తులుగా సాగగొడతారు. 1 రాజ్యం మీదికి రాజ్యం కత్తి ఎత్తకుండా ఉంటారు. 1 యుద్ధ విద్య నేర్చుకోవడం మానివేస్తారు.
4దానికి బదులు, ప్రతివాడూ ఎవరి భయమూ లేకుండా 1 తన ద్రాక్షచెట్టు కింద తన అంజూరపు చెట్టు కింద కూర్చుంటాడు. 1 ఇది సేనల అధిపతి యెహోవా నోట వెలువడ్డ మాట. 1
5ఇతర ప్రజలంతా తమ దేవుళ్ళ పేరుతో నడుచుకుంటారు. 1 మనమైతే మన యెహోవా దేవుని పేరును బట్టి 1 ఎప్పటికీ నడుచుకుంటాము. 1 యెహోవా ప్రణాళిక
6యెహోవా ఇలా చెబుతున్నాడు, 1 ఆ రోజు నేను కుంటి వారిని పోగుచేస్తాను. 1 అణగారిన వారిని, నేను కష్టపెట్టినవారిని దగ్గరికి చేరుస్తాను. 1
7కుంటివారిని శేషంగా దూరంగా పంపేసిన వారిని 1 బలమైన ప్రజగా చేస్తాను. 1 యెహోవానైన నేను, సీయోను కొండ మీద ఇప్పటినుంచి 1 ఎప్పటికీ వారిని పాలిస్తాను. 1
8మందల గోపురమా, సీయోను కుమార్తెకు కొండగా ఉన్న నీకు 1 పూర్వపు అధికారం వస్తుంది. 1 యెరూషలేము కుమార్తెమీద నీకు ప్రభుత్వం వస్తుంది.
9మీరెందుకు కేకలు వేస్తున్నారు? 1 మీకు రాజు లేడా? 1 మీ సలహాదారులు నాశనమయ్యారా? 1 అందుకే ప్రసవ వేదన పడుతున్న స్త్రీ లాగా మీరు బాధపడుతున్నారా? 1
10సీయోను కూతురా, ప్రసవ వేదన పడుతున్న స్త్రీ లాగా 1 నొప్పులు పడుతూ కను. 1 ఎందుకంటే మీరు పొలంలో బతికేలా పట్టణం వదిలిపెట్టండి. 1 బబులోను వెళ్తారు. అక్కడ మీకు విడుదల కలుగుతుంది. 1 అక్కడే యెహోవా మీ శత్రువుల చేతిలోనుంచి మిమ్మల్ని విడిపిస్తాడు.
11అనేక రాజ్యాల ప్రజలు మీకు విరోధంగా వచ్చి, 1 “సీయోను అపవిత్రం అవుతుంది గాక! 1 దాని నాశనం మేము కళ్ళారా చూడాలి.” అంటారు. 1
12ప్రవక్త ఇలా అంటాడు, యెహోవా తలంపులు వారికి తెలియవు. 1 ఆయన ఆలోచన అర్థం కాదు. 1 కళ్లంలో పనలు దగ్గర చేర్చినట్టు ఆయన వారిని చేరుస్తాడు.
13యెహోవా ఇలా అంటున్నాడు, 1 “సీయోను కుమారీ, లేచి కళ్ళం తొక్కు. 1 మీకు ఇనుప కొమ్ములూ కంచు డెక్కలూ చేస్తాను. 1 నీవు అనేక ప్రజల సమూహాలను అణిచేస్తావు. 1 వారి అన్యాయ సంపదను యెహోవానైన నాకు ప్రతిష్టిస్తాను. 1 వారి ఆస్తిపాస్తులను సర్వలోక ప్రభువునైన నాకు ప్రతిష్టిస్తాను.”