Micah · బైబిల్ (తెలుగు)

Micah 2

1మంచాల మీద పడుకుని మోసపు పనులు ఆలోచిస్తూ 1 దుర్మార్గాలు చేసేవారికి బాధ తప్పదు. 1 వాళ్లకు అధికారముంది 1 కాబట్టి పగటి వెలుతురులో వాళ్ళు అలా చేస్తారు. 1

2వాళ్ళు పొలాలు ఆశించి లాగేసుకుంటారు. 1 ఇళ్ళు ఆశించి తీసేసుకుంటారు. 1 వ్యక్తినీ అతని ఇంటినీ, 1 వ్యక్తినీ అతని వారసత్వాన్నీ వాళ్ళు అణిచేసి ఆక్రమించుకుంటారు.

3కాబట్టి యెహోవా ఇలా చెబుతున్నాడు, 1 “ఈ వంశం మీదికి విపత్తు పంపించబోతున్నాను. 1 దాని కిందనుంచి మీ మెడలను వదిలించుకోలేరు. 1 గర్వంగా నడవ లేనంతగా అపాయం రాబోతుంది. 1

4ఆ రోజు మీ శత్రువులు మీ గురించి ఒక పాట పాడతారు. 1 ఎంతో దుఃఖంతో ఏడుస్తారు. 1 వారిలా పాడతారు, ఇశ్రాయేలీయులమైన మనం బొత్తిగా పాడైపోయాం. 1 యెహోవా నా ప్రజల భూభాగాన్ని మార్చాడు. 1 ఆయన నా దగ్గర నుంచి దాన్ని ఎలా తీసేస్తాడు? 1 ఆయన మన భూములను ద్రోహులకు పంచి ఇచ్చాడు.” 1

5అందుచేత చీట్లు వేసి ధనవంతులైన మీకు 1 భూమి పంచిపెట్టడానికి యెహోవా సమాజంలో వారసులెవరూ ఉండరు. 1 అబద్ద ప్రవక్తలు

6“ప్రవచించ వద్దు, ఈ విషయాలను వాళ్ళు ప్రవచించ కూడదు. 1 అవమానం రాకూడదు” అని వారంటారు. 1

7“యాకోబు వంశమా! యెహోవా సహనం తగ్గిపోయిందా? 1 ఆయన ఇలాంటి పనులు చేస్తాడా?” 1 అని చెప్పడం భావ్యమేనా? 1 యథార్థంగా ప్రవర్తించేవారికి నా మాటలు క్షేమం కలిగిస్తాయి గదా! 1

8ఇటీవలే నా ప్రజలు శత్రువులయ్యారు. 1 యుద్ధరంగం నుంచి క్షేమంగా తిరిగి వస్తున్నాం అని సైనికులు అనుకున్నట్టుగా, 1 నిర్భయంగా దారిన పోతూ ఉన్న వారి పై బట్టలను, అంగీని మీరు లాగివేస్తారు.

9వారికిష్టమైన ఇళ్ళల్లోనుంచి నా ప్రజల్లోని స్త్రీలను మీరు వెళ్లగొడతారు. 1 వారి సంతానం మధ్య నా ఘనతను ఎన్నటికీ ఉండకుండాా చేస్తున్నారు. 1

10లేచి వెళ్లిపోండి, అది అపవిత్రం అయిపోయింది కాబట్టి 1 మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు. 1 నేను దాన్ని పూర్తిగా నాశనం చేస్తాను. 1

11పనికి మాలిన మాటలు చెబుతూ అబద్ధాలాడుతూ ఎవడైనా ఒకడు వచ్చి, 1 “ద్రాక్షారసం గురించి, మద్యం గురించి నేను మీకు ప్రవచనం చెబుతాను” అంటే, 1 వాడే ఈ ప్రజలకు ప్రవక్త అవుతాడు. 1 విమోచన వాగ్దానం

12యాకోబూ, నేను మిమ్మల్నందరినీ తప్పకుండా పోగు చేస్తాను. 1 ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారిని తప్పక సమకూర్చుతాను. 1 గొర్రెల దొడ్డిలోకి గొర్రెలు చేరుకున్నట్టు నేను వారిని చేరుస్తాను. 1 తమ మేత స్థలాల్లో వారిని చేరుస్తాను. 1 చాలామంది ఉండడం వలన పెద్ద శబ్దం అక్కడ వస్తుంది. 1

13వారికి దారి ఇచ్చేవాడు వారి ముందు వెళ్తాడు. 1 వాళ్ళు గుమ్మం పడగొట్టి దాని ద్వారా దాటిపోతారు. 1 వాళ్ళ రాజు వారికి ముందుగా నడుస్తాడు. 1 యెహోవా వారికి నాయకుడుగా ఉంటాడు.

← Micah 1Read In The App, Free →Micah 3 →

Study Micah 2

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

1234567