Micah · బైబిల్ (తెలుగు)

Micah 6

1యెహోవా చెప్పబోయే మాట ఇప్పుడు వినండి. 1 మీకా ఆయనతో ఇలా చెబుతున్నాడు, 1 లేచి పర్వతాల ముందు నీ వాదన వినిపించు. 1 నీ స్వరం కొండలు వినాలి. 1

2పర్వతాల్లారా, భూమికి స్థిరమైన పునాదులుగా ఉన్న మీరు 1 యెహోవా చేసిన ఫిర్యాదు వినండి. 1 ఆయన ఇశ్రాయేలీయుల మీద ఫిర్యాదు చేస్తున్నాడు.

3నా ప్రజలారా, నేను మీకేం చేశాను? 1 మిమ్మల్ని నేనెలా కష్టపెట్టాను? జవాబివ్వండి. 1

4ఐగుప్తు దేశంలో నుంచి నేను మిమ్మల్ని రప్పించాను. 1 బానిస ఇంట్లో నుంచి మిమ్మల్ని కాపాడాను. 1 మీ కోసం మోషే అహరోను మిర్యాములను పంపించాను.

5నా ప్రజలారా, మోయాబురాజు బాలాకు చేసిన ఆలోచన, 1 బెయోరు కుమారుడు బిలాము అతనికిచ్చిన జవాబు గుర్తుకు తెచ్చుకోండి. 1 యెహోవా నీతి పనులు మీరు తెలుసుకునేలా 1 షిత్తీము మొదలు గిల్గాలు వరకూ జరిగిన వాటిని మనసుకు తెచ్చుకోండి.

6యెహోవాకు నేనేం తీసుకురాను? 1 మహోన్నతుడైన దేవునికి వంగి నమస్కారం చేయడానికి ఏం తీసుకురాను? 1 దహనబలులనూ ఏడాది దూడలనూ తీసుకుని నేను ఆయన దగ్గరికి రానా? 1

7వేలకొలది పొట్టేళ్లు, పది వేల నదుల నూనెతో యెహోవా సంతోష పడతాడా? 1 నా అతిక్రమానికి నా పెద్ద కొడుకుని నేనివ్వాలా? 1 నా సొంత పాపానికి నా గర్భఫలాన్ని నేనివ్వాలా? 1

8మనిషీ, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు. 1 ఆయన నిన్ను కోరేదేంటంటే, 1 న్యాయంగా ప్రవర్తించు. 1 కనికరాన్ని ప్రేమించు. 1 వినయంగా నీ దేవునితో నడువు. 1 ఇశ్రాయేలీయుల దుర్నీతి క్రియలు

9వినండి. పట్టణానికి యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు, 1 ఇప్పటికి కూడా తెలివి నీ పేరును గుర్తిస్తున్నది. 1 “బెత్తం పట్ల, దాన్ని తన స్థానంలో ఉంచిన వాని పట్ల శ్రద్ధ చూపండి. 1

10దుర్మార్గుల ఇళ్ళల్లో అన్యాయంగా సంపాదించిన సంపద ఉంది. 1 అసహ్యకరమైన తప్పుడు తూకాలున్నాయి.

11తప్పు త్రాసు, తప్పు రాళ్లున్న సంచి ఉంచుకున్న వ్యక్తిని నేను నిర్దోషి అంటానా? 1

12ధనవంతులు దౌర్జన్యంతో నిండి ఉన్నారు. 1 అక్కడి ప్రజలు అబద్దికులు. 1 వారి నోటిలోని నాలుక కపటంగా మాట్లాడుతుంది.

13కాబట్టి నేను నిన్ను తీవ్రంగా గాయపరచాను. 1 నీ పాపాలను బట్టి నిన్ను నిర్మూలం చేశాను. 1

14నువ్వు తింటావు కానీ తృప్తి పడవు. 1 నీలోపల వెలితిగానే ఉంటుంది. 1 నువ్వు కూడబెట్టుకుంటావు కానీ అది నీకుండదు. 1 నువ్వు దాచుకున్నదాన్ని కత్తికి అప్పగిస్తాను. 1

15నువ్వు విత్తనాలు చల్లుతావు గానీ కోత కోయవు. 1 నువ్వు ఒలీవ పళ్ళను తొక్కుతావు 1 కానీ ఆ నూనె పూసుకోవు. 1 ద్రాక్షపళ్ళను తొక్కుతావు 1 కానీ ద్రాక్షారసం తాగవు.

16ఒమ్రీ చట్టాలను మీరు పాటిస్తున్నారు. 1 అహాబు వంశం వాళ్ళు చేసిన పనులన్నిటినీ అనుసరిస్తున్నారు. 1 వారి సలహాల ప్రకారం నడుస్తున్నారు. 1 కాబట్టి నీ పట్టణాన్ని నాశనం చేస్తాను. 1 దానిలో నివసించే వారిని అపహాస్యంగా చేస్తాను. 1 నా ప్రజలకు రావలసిన అవమానం మీరు పొందుతారు.”

← Micah 5Read In The App, Free →Micah 7 →

Study Micah 6

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

1234567