Isaiah 15
1మోయాబు గురించి ప్రకటన. 1 ఒకే రాత్రిలో ఆర్ మోయాబు పాడై నాశనమౌతుంది. 1 ఒక్క రాత్రిలో కీర్ మోయాబు పాడై నాశనమౌతుంది. 1
2ఏడవడానికి మోయాబీయులు గుడికీ, 1 మెట్ట మీద ఉన్న దీబోనుకూ వెళ్తున్నారు. 1 నెబో మీద, మేదెబా మీద మోయాబీయులు ప్రలాపిస్తున్నారు. 1 వాళ్ళందరూ తమ తలలు గొరిగించుకున్నారు, 1 గడ్డాలు క్షవరం చేయించుకున్నారు. 1
3తమ సంత వీధుల్లో గోనెపట్ట కట్టుకున్నారు. 1 వాళ్ళ మేడల మీద, వాళ్ళ బహిరంగ ప్రాంగణాల్లో వాళ్ళందరూ ప్రలాపిస్తూ కన్నీళ్లు కారుస్తున్నారు. 1
4హెష్బోను, ఏలాలే మొర్ర పెడుతున్నాయి. 1 యాహసు వరకూ వాళ్ళ స్వరం వినిపిస్తూ ఉంది. 1 మోయాబీయుల యోధులు బిగ్గరగా ఏడుస్తున్నారు. 1 వాళ్ళ ప్రాణాలు వాళ్ళల్లో వణుకుతున్నాయి. 1
5మోయాబు కోసం నా హృదయం అరుస్తూ ఉంది. 1 దాని ప్రధానులు సోయరు వరకూ పారిపోతారు. 1 లూహీతు ఎక్కుడు మార్గంలో ఏడుస్తూ ఎక్కుతారు. 1 నాశనమై పోయామే అని పెద్దగా కేకలు వేస్తూ హొరొనయీము మార్గంలో వెళ్తారు. 1
6ఎందుకంటే నిమ్రీములో ఉన్న నీళ్ళు ఎండిపోయాయి. 1 గడ్డి ఎండిపోయింది. కొత్తగా పుట్టిన గడ్డి కూడా ఎండిపోతుంది. పచ్చదనం ఎక్కడా కనిపించదు. 1
7వాళ్ళు సంపాదించిన ఆస్తినీ, వాళ్ళు కూర్చుకున్న పంటనూ నిరవంజి చెట్లున్న నది అవతలకు వాళ్ళు మోసుకు పోతారు. 1
8రోదన మోయాబు సరిహద్దుల్లో వినిపించింది. 1 అంగలార్పు ఎగ్లయీము వరకూ, బెయేరేలీము వరకూ వినిపించింది. 1
9ఎందుకంటే దీమోను నీళ్ళు రక్తంతో నిండి ఉన్నాయి. 1 కాని నేను దీమోను మీదకి మరింత బాధ రప్పిస్తాను. 1 మోయాబులోనుంచి తప్పించుకున్న వాళ్ళ మీద, ఆ దేశంలో మిగిలిన వాళ్ళ మీద ఒక సింహం దాడి చేస్తుంది.