Isaiah · బైబిల్ (తెలుగు)

Isaiah 2

1యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కొడుకు యెషయా దర్శనం ద్వారా గ్రహించినది. 1

2రాబోయే భవిష్యత్తులో పర్వతాలన్నిటికన్నా యెహోవా మందిర పర్వతం ఉన్నతంగా సుస్థిరమౌతుంది. 1 అన్ని కొండల కంటే ఘనత పొందుతుంది. 1 జాతులన్నీ దానిలోకి ప్రవాహంలా వస్తారు. 1

3అనేక మంది వచ్చి ఇలా అంటారు. 1 “ఆయన మార్గాల్లో మనం నడిచేందుకు, 1 ఆయన మనకు తన త్రోవలు నేర్పించేలా, 1 యాకోబు దేవుని మందిరం ఉన్న యెహోవా పర్వతానికి ఎక్కి వెళ్దాం రండి.” 1 ఎందుకంటే, సీయోనులో నుంచి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు బయలు వెళ్తుంది. 1

4ఆయన మధ్యవర్తిగా ఉండి అన్యజాతులకు న్యాయం తీరుస్తాడు. 1 అనేక జాతులకు తీర్పు తీరుస్తాడు. 1 వాళ్ళు తమ కత్తులను నాగటి నక్కులుగానూ, 1 తమ ఈటెలను మోట కత్తులుగానూ సాగగొడతారు. 1 జనం మీదకి జనం కత్తి ఎత్తరు. 1 ఇంక ఎన్నడూ యుద్ధ సన్నాహాలు చెయ్యరు. 1 యెహోవా దినం 1

5యాకోబు వంశస్థులారా, రండి. 1 మనం యెహోవా వెలుగులో నడుద్దాం. 1

6యాకోబు వంశమైన ఈ ప్రజలు తూర్పున ఉన్న దేశ ప్రజల సాంప్రదాయాలతో నిండి ఉన్నారు. 1 వాళ్ళు ఫిలిష్తీయుల్లాగా శకునం చూసే వాళ్ళలా ఉంటూ, 1 పరదేశులతో స్నేహం చేస్తున్నారు గనుక నువ్వు వాళ్ళను విడిచి పెట్టేశావు. 1

7వాళ్ళ దేశం వెండి బంగారాలతో నిండి ఉంది. 1 వాళ్ళ సంపాదనకు మితి లేదు. 1 వాళ్ళ దేశం గుర్రాలతో నిండి ఉంది. 1 వాళ్ళ రథాలకు మితి లేదు. 1

8వాళ్ళ దేశం విగ్రహాలతో నిండి ఉంది. 1 వాళ్ళు తమ స్వంత చేతి పనితనంతో చేసిన వాటికీ, తాము వేళ్ళతో చేసిన వాటికీ పూజలు చేస్తారు. 1

9ప్రజలు అణిచివేతకు గురౌతారు. వ్యక్తులు పడిపోతారు. 1 కాబట్టి వాళ్ళను అంగీకరించవద్దు. 1

10యెహోవా భీకర సన్నిధి నుంచి, ఘనత కలిగిన ఆయన మహిమ నుంచీ వెళ్లి గండ శిలల్లో, నేలలో దాగి ఉండు. 1

11మానవుని అహంకార దృష్టిని ఆయన తగ్గించేస్తాడు. 1 మనుషుల గర్వాన్ని అణగదొక్కుతాడు. 1 ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతాడు. 1

12గర్వం, దురహంకారం, అతిశయం కలిగిన ప్రతివాణ్ణి ఆ రోజున సేనలకు ప్రభువైన యెహోవా కింద పడేస్తాడు. 1

13సమున్నతంగా అతిశయించే లెబానోను దేవదారు వృక్షాలన్నిటికీ, 1 బాషాను సింధూర వృక్షాలన్నిటికీ, 1

14ఉన్నత పర్వతాలన్నిటికీ, అతిశయించే కొండలన్నిటికీ, 1

15ఎత్తయిన ప్రతి గోపురానికీ, పడగొట్టలేనంత బలమైన ప్రతి కోటగోడకూ, 1

16తర్షీషు ఓడలన్నిటికీ, అందమైన తెరచాప నౌకలకూ విరుద్ధంగా ఆ రోజును సేనలకు ప్రభువైన యెహోవా నియమించాడు. 1

17అప్పుడు మనిషి అహంకారం అణిగిపోతుంది. 1 మనుషుల గర్వం తగ్గిపోతుంది. 1 ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతాడు. 1

18విగ్రహాలు పూర్తిగా గతించిపోతాయి. 1

19యెహోవా భూమిని గజగజ వణికించడానికి లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుంచి, 1 ఆయన ప్రభావ మహత్యం నుంచి పారిపోయి కొండల గుహల్లో, 1 నేల గుంటల్లో మనుషులు దాగి ఉంటారు. 1

20ఆ రోజున ప్రజలు ఆరాధన కోసం తాము వెండి బంగారాలతో చేయించుకున్న విగ్రహాలు పారేస్తారు. 1 ఎలుకలకూ, గబ్బిలాలకూ వాటిని విసిరేస్తారు. 1

21యెహోవా భూమిని గజగజ వణికించడానికి లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుంచీ, 1 ఆయన ప్రభావ మహత్యం నుంచీ పారిపోయి కొండ గుహల్లో, 1 కొండ బండల నెర్రెల్లో మనుషులు దాగి ఉంటారు. 1

22తన ముక్కుపుటాల్లో జీవవాయువు ఉన్న మనిషి మీద నమ్మకం ఉంచడం మానుకో. 1 అతని విలువ ఏ పాటిది?

← Isaiah 1Read In The App, Free →Isaiah 3 →

Study Isaiah 2

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566