Isaiah 62
1సీయోను నీతి, సూర్యకాంతిలా కనబడే వరకూ దాని రక్షణ, దీపాలుగా వెలిగే వరకూ 1 సీయోను పక్షంగా నేను మౌనంగా ఉండను. యెరూషలేము కోసం నేను ఊరుకోను. 1
2రాజ్యాలు నీ నీతి చూస్తారు. రాజులంతా నీ మహిమను చూస్తారు. 1 యెహోవా కోరే కొత్త పేరు నీకు పెడతారు. 1
3నువ్వు యెహోవా చేతిలో అందమైన కిరీటంగా నీ దేవుని చేతిలో రాజ్యకిరీటంగా ఉంటావు. 1
4నిన్ను ఇంకెప్పుడూ “విడువబడిన దానివి” అనీ, నీ దేశాన్ని “పాడైపోయినది” అనీ ఇక అనరు. 1 దాని బదులు నిన్ను “ప్రియమైనది + 62:4 ప్రియమైనది హెప్సీబా” అనీ, నీ దేశాన్ని “కళ్యాణి + 62:4 కళ్యాణి బ్యూలా” అనీ అంటారు. 1 ఎందుకంటే యెహోవా నిన్నుబట్టి ఆనందిస్తున్నాడు. నీ దేశానికి వివాహం జరుగుతుంది. 1
5యువకుడు ఒక యువతిని పెళ్లిచేసుకున్నట్టు నీ కొడుకులు + 62:5 నీ కొడుకులు నీ సృష్టికర్త నిన్ను పెళ్లి చేసుకుంటారు. 1 పెళ్ళికొడుకు తన పెళ్ళికూతురుతో సంతోషించేలా నీ దేవుడు నిన్ను చూచి సంతోషిస్తాడు. 1
6యెరూషలేమా, నీ గోడలమీద నేను కావలి వారిని ఉంచాను. 1 రాత్రి పగలూ వారు మౌనంగా ఉండరు. 1 యెహోవాకు గుర్తుచేస్తూ ఉండే మీరు విరామం తీసుకోవద్దు. 1
7ఆయన యెరూషలేమును సుస్థిరం చేసే వరకు 1 లోకమంతటా దానికి ప్రసిద్ధి కలిగించే వరకు ఆయన్ని వదలొద్దు. 1
8తన కుడి చెయ్యి తోడనీ తన బలమైన హస్తం తోడనీ యెహోవా ఇలా ప్రమాణం చేశాడు, 1 “నేను నీ ధాన్యాన్ని నీ శత్రువులకు ఆహారంగా ఇక ఎన్నడూ ఇవ్వను. నువ్వు కష్టపడి తీసిన ద్రాక్షారసాన్ని విదేశీయులు తాగరు. 1
9కోత కోసినవాళ్ళే దాన్ని తింటారు. యెహోవాను స్తుతిస్తారు. 1 ద్రాక్ష పళ్ళు కోసినవాళ్ళే నా పవిత్రాలయ ఆవరణాల్లో దాని రసం తాగుతారు.” 1
10ద్వారాల గుండా రండి! రండి! ప్రజలకు దారి సిద్ధం చేయండి! 1 జాతీయ మార్గాన్ని కట్టండి! రాళ్ళు ఏరి పారవేయండి! 1 రాజ్యాల కోసం జండా సూచన ఎత్తండి! 1
11వినండి. ప్రపంచమంతటికీ యెహోవా తెలియచేశాడు. 1 “సీయోను ఆడపడుచుతో ఇలా చెప్పండి. ఇదిగో, నీ రక్షకుడు వస్తున్నాడు! 1 ఇదిగో, ఆయన బహుమానం ఆయన దగ్గర ఉంది. తానిచ్చే జీతం ఆయన తీసుకు వస్తున్నాడు.” 1
12“పరిశుద్ధప్రజలు” “యెహోవా విమోచించిన వారు” అని వీళ్ళు మిమ్మల్ని పిలుస్తారు. “కోరతగినది” అనీ “తిరస్కారానికి గురి కాని పట్టణం” అనీ నిన్ను పిలుస్తారు.