Isaiah · బైబిల్ (తెలుగు)

Isaiah 18

1అయ్యో! ఇతియోపియా నదుల అవతల టపటపా కొట్టుకునే రెక్కలున్న దేశానికి దుఃఖం! 1

2అది సముద్రంపై నీళ్ళ మీద జమ్ము పడవల్లో రాయబారులను పంపిస్తూ ఉంది. 1 వేగిరపడే వార్తాహరులారా! వెళ్ళండి. నున్నని చర్మం కలిగి పొడుగ్గా ఉండే ప్రజల దగ్గరికి వెళ్ళండి! చుట్టూ ఉన్న వాళ్ళనీ, దూరంగా ఉండే వాళ్ళనీ భయకంపితులను చేస్తూ, అణచివేసే ఆ బలమైన జనాల దగ్గరకూ, నదులు విభజించే వాళ్ళ దేశానికీ వెళ్ళండి! 1

3ప్రపంచంలో నివసించే మీరు, భూమిపైన జీవించే మీరు 1 పర్వతాల పైన సంకేతంగా జెండా ఎత్తినప్పుడు చూడండి! బాకా ఊదినప్పుడు వినండి! 1

4యెహోవా నాకు చెప్పిన మాట ఇదే. “వేసవిలో ఉడుకెత్తే వేడిలా, కోతకాలంలో ఏర్పడే పొగమంచు మబ్బులా 1 నేను నిశ్శబ్దంగా నా నివాస స్థలం నుండి గమనిస్తూ ఉంటాను.” 1

5కోతకాలం రాకముందు పువ్వు వికసించే దశ ముగిసిన తర్వాత, పువ్వు ద్రాక్షగా మారుతున్న దశలో ఆయన పోటకత్తులతో ద్రాక్షకాయలను కత్తిరిస్తాడు. వ్యాపిస్తున్న ద్రాక్ష కొమ్మలను నరికి అవతల పారవేస్తాడు. 1

6వాటిని పర్వతాల్లోని పక్షులకూ, భూమి మీద ఉన్న మృగాలకూ వదిలివేస్తాడు. 1 వేసవికాలంలో పక్షులూ, చలికాలంలో భూమి మీద మృగాలూ వాటిని తింటాయి. 1

7ఆ రోజుల్లో నున్నని చర్మం కలిగి పొడుగ్గా ఉండే ప్రజలు, చుట్టూ ఉన్న వాళ్ళనీ, దూరంగా ఉండే వాళ్ళనీ భయకంపితులను చేస్తూ, అణచివేస్తూ ఆ బలమైన జనాలు, నదులతో నిండి ఉన్న వాళ్ళ దేశం నుండి సేనల ప్రభువు అయిన యెహోవాకు కానుకలు తీసుకుని వస్తారు. సేనల ప్రభువు అయిన యెహోవా నామాన్ని ధరించిన సీయోను పర్వతానికి తీసుకు వస్తారు.

← Isaiah 17Read In The App, Free →Isaiah 19 →

Study Isaiah 18

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566