Isaiah 34
1రాజ్యాలన్నీ నా దగ్గరికి వచ్చి నేను చెప్పేది వినండి, ప్రజలందరూ జాగ్రత్తగా ఆలకించండి. 1 భూమీ దాని సంపూర్ణతా, లోకం, దానిలో పుట్టినదంతా వినాలి. 1
2యెహోవా కోపం రాజ్యాల మీదికి వస్తున్నది, ఆయన ఆగ్రహం వారి సర్వ సేనల మీదికీ వస్తున్నది. 1 ఆయన వారిని శపించి వధకు అప్పగించాడు. 1
3వారిలో చనిపోయిన వారిని ఎవరూ సమాధి చేయరు. 1 వారి శవాలు కంపుకొడతాయి. వారి రక్తం కొండలను నింపేస్తుంది. 1
4ఆకాశ నక్షత్రాలన్నీ వాడిపోతాయి. ఆకాశం కాగితపు చుట్టలాగా చుట్టుకుపోతుంది. 1 ద్రాక్షవల్లి నుండి, అంజూరపు చెట్టు నుండి వాడిన ఆకులు రాలినట్టు దాని నక్షత్రాలన్నీ రాలిపోతాయి. 1
5నిజంగా ఆకాశంలో నా ఖడ్గం మత్తెక్కినట్టు ఎదోము మీదికీ, నేను నాశనానికి నిర్ణయించిన జనం మీదికీ దిగివస్తుంది. 1
6యెహోవా ఖడ్గం రక్తమయమవుతుంది. అది కొవ్వుతో కప్పి ఉంటుంది. గొర్రెపిల్లల, మేకల రక్తం చేతా, పొట్లేళ్ల మూత్రపిండాల మీది కొవ్వు చేతా కప్పి ఉంటుంది. 1 ఎందుకంటే బొస్రా నగరంలో యెహోవా బలి జరిగిస్తాడు. ఎదోము దేశంలో గొప్ప వధ చేస్తాడు. 1
7వాటితోపాటు అడవి ఎద్దులు, కోడె దూడలు వధకు పోతున్నాయి. 1 ఎదోమీయుల భూమి రక్తంతో నానుతూ ఉంది. వారి దేశపు మట్టి కొవ్వుతో నిండిపోయింది. 1
8అది యెహోవా శిక్ష అమలుపరిచే రోజు. సీయోను పక్షంగా ప్రతీకారం చేసే సంవత్సరం. 1
9ఎదోము కాలువలు కీలులాగా, దాని మట్టి గంధకంగా మారిపోతుంది. 1 దాని భూమి మండుతున్న గంధకంగా ఉంటుంది. 1
10అది రాత్రీ, పగలూ ఆరిపోకుండా ఉంటుంది. దాని పొగ ఎల్లప్పుడూ రేగుతూ ఉంటుంది. 1 అది తరతరాలు పాడుగా ఉంటుంది. దానిలో గుండా ఇక ఎవ్వరూ ఎన్నటికీ ప్రయాణించరు. 1
11గూడబాతులు, అడవి మృగాలు దాన్ని ఆక్రమించుకుంటాయి. 1 గుడ్లగూబలు, కాకులు అందులో నివసిస్తాయి. 1 ఆయన నాశనం అనే కొలనూలును చాపుతాడు. వినాశనం అనే ఒడంబాన్ని చేత పట్టుకుంటాడు. 1
12రాజ్యం గురించి ప్రకటించడానికి వారి ప్రధానులు అక్కడ ఉండరు. 1 దాన్ని పరిపాలించే వాళ్ళంతా గతించిపోయారు. 1
13ఎదోము నగరాల్లో ముళ్లచెట్లు పెరుగుతాయి. దాని దుర్గాల్లో దురదగొండ్లు, గచ్చపొదలు ఎదుగుతాయి. 1 అది అడవికుక్కలకు, నిప్పుకోళ్లకు నివాసంగా ఉంటుంది. 1
14క్రూర జంతువులు, హైనాలు అక్కడ కలిసి తిరుగుతాయి. 1 అడవిమేకలు ఒకదానిపై ఒకటి అరుస్తూ ఉంటాయి. అక్కడ చీకటి పక్షులు నివాసముంటాయి. 1
15గుడ్లగూబలు గూళ్ళు కట్టుకుని, గుడ్లు పెట్టి పొదుగుతాయి. 1 అక్కడే తెల్లగద్దలు తమ జాతిపక్షులతో కలుసుకుంటాయి. 1
16యెహోవా గ్రంథాన్ని జాగ్రత్తగా ధ్యానించండి. 1 ఆ జంతువులన్నీ అక్కడ ఉండి తీరుతాయి. దేని జతపక్షి దాని దగ్గర ఉంటుంది. 1 ఎందుకంటే యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు. ఆయన ఆత్మ వాటిని పోగు చేస్తాడు. 1
17అవి రావాలని ఆయన చీట్లు వేశాడు. ఆయన కొలనూలు పట్టుకుని వాటికి ఆ దేశాన్ని పంచిపెడతాడు. 1 అవి శాశ్వతంగా దాన్ని ఆక్రమించుకుని ఉంటాయి. యుగయుగాలు దానిలో నివసిస్తాయి.