Isaiah · బైబిల్ (తెలుగు)

Isaiah 3

1చూడండి, సేనలకు అధిపతి, ప్రభువూ అయిన యెహోవా యెరూషలేము నుంచి, యూదా నుంచి దాని పోషణ, దాని ఆధారం తీసివేయబోతున్నాడు. 1 దాని ఆహార సంబంధమైన ఆధారం, నీటి సరఫరా, 1

2శూరులు, యోధులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు, 1

3సోదెగాళ్ళు, పెద్దలు, పంచ దశాధిపతులు, 1 ఘనత వహించిన వాళ్ళు, మంత్రులు, శిల్పశాస్త్రం తెలిసిన వాళ్ళు, 1 మాంత్రికులు, అందరినీ యెరూషలేములోనుంచీ, యూదా దేశంలో నుంచి, తీసివేయబోతున్నాడు. 1

4“నేను పిల్లలను వాళ్లకు నాయకులుగా నియమిస్తాను. 1 పసివాళ్ళు వాళ్ళ మీద పెత్తనం చేస్తారు. 1

5ప్రజల్లో ఒకడు మరొకణ్ణి అణిచివేస్తారు. 1 ప్రతి ఒక్కడూ తన పొరుగువాడి చేత అణిచివేతకు గురౌతాడు. 1 పెద్దవాడి మీద చిన్నవాడు, ఘనుని మీద నీచుడు గర్వించి సవాలు చేసి తిరస్కారంగా ఉంటారు. 1

6ఒకడు తన తండ్రి ఇంట్లో తన సోదరుణ్ణి పట్టుకుని, 1 ‘నీకు పైవస్త్రం ఉంది. నువ్వు మా మీద అధిపతిగా ఉండు. 1 ఈ పాడైపోయిన స్థలం నీ ఆధీనంలో ఉండనివ్వు’ అంటాడు. 1

7అతడు ఆ రోజున కేక వేసి, 1 ‘నేను సంరక్షణ కర్తగా ఉండను, 1 నాకు ఆహారం గాని, వస్త్రాలు గాని లేవు. 1 నన్ను ప్రజలకు అధిపతిగా నియమించవద్దు’ అంటాడు.” 1

8తన మాటలు, చేతలు యెహోవాకు విరుద్ధంగా ఉన్నాయి గనుక యెరూషలేము పాడైపోయింది, 1 యూదా పతనమయ్యింది. 1

9వాళ్ళ ముఖమే వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తూ ఉంది. 1 తమ పాపం దాచకుండా సొదొమవాళ్ళలాగా దాన్ని కనపరుస్తారు. 1 వాళ్లకు బాధ! వాళ్ళు తమకు తామే తమ మీదకి ఈ మహా విపత్తు తెచ్చుకున్నారు. 1

10నీకు మేలు కలుగుతుందని నీతిమంతుడితో చెప్పు. 1 వాళ్ళు తమ క్రియల ఫలం అనుభవిస్తారు. 1

11దుష్టుడికి బాధ! అతనికి కీడు జరుగుతుంది. 1 అతని చేతి పనుల ఫలం అతడు పొందుతాడు. 1

12చిన్న పిల్లలు నా ప్రజలను హింసిస్తారు. 1 స్త్రీలు వాళ్ళ మీద ఏలుబడి చేస్తారు. 1 నా ప్రజలారా, మీ నాయకులు మిమ్మల్ని మీ మార్గంలో అయోమయం పాలుచేసి తప్పు దోవ పట్టిస్తారు. 1

13తీర్పు తీర్చడానికి యెహోవా ఆవరణలో నిలిచి ఉన్నాడు. 1 తన ప్రజలకు తీర్పు తీర్చడానికి నిలబడి ఉన్నాడు. 1

14యెహోవా తన ప్రజల పెద్దల మీద, 1 వాళ్ళ నాయకుల మీద తన తీర్పు ప్రకటిస్తాడు. 1 “మీరే ద్రాక్షతోటను తినేశారు. 1 మీరు దోచుకున్న పేదల సొమ్ము మీ ఇళ్ళల్లోనే ఉంది. 1

15నా ప్రజలను నలగ్గొట్టి, వాళ్ళ ముఖాలు మీరెందుకు నేల రాస్తున్నారు?” 1 అని ప్రభువూ, సేనలకు అధిపతీ అయిన యెహోవా అంటున్నాడు. 1

16యెహోవా చెప్పేదేమంటే, సీయోను కుమార్తెలు పోగరుబోతులు. 1 మెడ చాచి నడుస్తూ, ఓర చూపులు చూస్తూ, 1 కులుకుతో నడుస్తూ, తమ కాళ్ల గజ్జెలు మోగిస్తున్నారు. 1

17కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల తలల మీద గజ్జి పుండ్లు పుట్టిస్తాడు. 1 వాళ్ళ తలలు యెహోవా బోడి తలలుగా చేస్తాడు. 1

18ఆ రోజున ప్రభువు వాళ్ళ కాళ్ళ గజ్జెలు, శిరోభూషణాలూ, చంద్రవంక నాగరాలూ, 1

19చెవిపోగులూ, కడియాలూ, మేలి ముసుగులూ, 1

20తలకు కట్టుకునే పాగాలూ, కాళ్ల గొలుసులూ, ఒడ్డాణాలూ, 1 పరిమళ ద్రవ్యపు భరిణెలూ, 1

21తాయెత్తులు, ఉంగరాలు, ముక్కు కమ్మలు, 1

22ఉత్సవ వస్త్రాలూ, ఉత్తరీయాలూ, పైటలూ, సంచులూ, 1

23చేతి అద్దాలు, సన్ననారతో నేసిన జలతారు ముసుగులు, 1 పాగాలు, శాలువాలు తీసేస్తాడు. 1

24అప్పుడు పరిమళ ద్రవ్యానికి బదులుగా దుర్గంధం, 1 నడికట్టుకు బదులుగా తాడూ, 1 అల్లిన జడకు బదులుగా బోడి తల, 1 ప్రశస్థమైన పైటకు బదులు గోనెపట్టా, 1 అందానికి బదులు వాత ఉంటాయి. 1

25మనుషులు కత్తివాత కూలి పోతారు. 1 యుద్ధంలో నీ శూరులు పడిపోతారు. 1

26యెరూషలేము గుమ్మాలు శోకించి దుఃఖిస్తాయి. ఆమె ఒంటరిదై నేల మీద కూర్చుంటుంది.

← Isaiah 2Read In The App, Free →Isaiah 4 →

Study Isaiah 3

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566