Isaiah · బైబిల్ (తెలుగు)

Isaiah 24

1చూడండి! యెహోవా భూమిని ఖాళీ చేయబోతున్నాడు. దాన్ని నాశనం చేయబోతున్నాడు. దాని ఉపరితలాన్ని పాడు చేయబోతున్నాడు. దానిపై నివాసమున్న వారిని చెదరగొట్టబోతున్నాడు. 1

2ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగుతుంది. దాసులకు జరిగినట్టు యజమానులకు జరుగుతుంది. దాసీలకు జరిగినట్టు వారి యజమానురాళ్లకు జరుగుతుంది. కొనేవారికి జరిగినట్టు అమ్మేవారికి జరుగుతుంది. అప్పిచ్చే వారికి జరిగినట్టు అప్పు పుచ్చుకొనే వారికి జరుగుతుంది. వడ్డీకి ఇచ్చేవారికి జరిగినట్టు వడ్డీకి తీసుకునేవారికి జరుగుతుంది. 1

3దేశం కేవలం వట్టిదిగా అయి పోతుంది. అది కేవలం కొల్లసొమ్ము అవుతుంది. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. 1

4దేశం వ్యాకులం చేత వాడిపోతున్నది. లోకంలోని గొప్పవారు క్షీణించి పోతున్నారు. 1

5లోక నివాసులు ధర్మ శాసనాలు అతిక్రమించారు. నియమాన్ని మార్చి నిత్య నిబంధనను మీరారు. దాని నివాసుల చేత లోకం అపవిత్రమైపోయింది. 1

6శాపం దేశాన్ని నాశనం చేస్తున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులయ్యారు. దేశ నివాసులు కాలిపోయారు. శేషించిన మనుషులు కొద్దిమందే ఉన్నారు. 1

7కొత్త ద్రాక్షారసం అంగలారుస్తున్నది. ద్రాక్షావల్లి వాడి పోతున్నది. ఆనంద హృదయులంతా నిట్టూర్పు విడుస్తున్నారు. తంబురల సంతోషనాదం నిలిచిపోయింది. 1

8కేరింతలు కొట్టే వారి ధ్వని మానిపోయింది. సితారాల ఇంపైన సంగీతం ఆగి పోయింది. 1

9మనుషులు పాటలు పాడుతూ ద్రాక్షారసం తాగరు. పానం చేసేవారికి మద్యం చేదైపోయింది.

10అల్లకల్లోలమైన పట్టణం నిర్మూలమై పోయింది. ఎవరూ ప్రవేశించకుండా ప్రతి ఇల్లు మూతబడింది. 1

11ద్రాక్షారసం లేదని పొలాల్లో ప్రజలు కేకలు వేస్తున్నారు. సంతోషమంతా ఆవిరై పోయింది. దేశంలో ఆనందం లేదు. 1

12పట్టణంలో శైథిల్యం మాత్రం మిగిలింది. గుమ్మాలు విరిగి పోయాయి. 1

13ఒలీవ చెట్టును దులిపేటప్పుడు, ద్రాక్షకోత అయిన తరువాత పరిగె పళ్ళు ఏరు కొనేటప్పుడు జరిగేలా లోక జాతులన్నిటిలో జరుగుతుంది. 1

14శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహ ధ్వని చేస్తారు. యెహోవా మహాత్మ్యాన్ని బట్టి సముద్రతీరాన ఉన్న వారు కేకలు వేస్తారు. 1

15దాన్ని బట్టి తూర్పు ప్రాంతీయులారా, యెహోవాను ఘనపరచండి. సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామాన్ని ఘనపరచండి. 1

16నీతిమంతునికి స్తోత్రమని, భూదిగంతాల నుండి సంగీతాలు మనకు వినబడ్డాయి. అప్పుడు నేను “అయ్యో నాకు బాధ. నేను చెడిపోయాను, చెడిపోయాను. మోసం చేసే వారు మోసం చేస్తారు మోసం చేసే వారు ఎంతో మోసం చేస్తారు” అన్నాను. 1

17భూనివాసులారా, మీ మీదికి భయం వచ్చింది. గుంట, ఉరి మీకు దాపురించాయి. 1

18తూములు ఉబికాయి. భూమి పునాదులు కంపిస్తున్నాయి. 1

19భూమి బొత్తిగా బద్దలై పోతున్నది. భూమి కేవలం ముక్కలై పోతున్నది. భూమి బ్రహ్మాండంగా దద్దరిల్లుతున్నది. 1

20భూమి మత్తెక్కిన వాడిలాగా అదే పనిగా తూలుతోంది. పాకలాగా ఇటు అటు ఊగుతోంది. దాని అపరాధం దాని మీద భారంగా ఉంది. అది పడి ఇక లేవదు. 1 భయంకరమైన వార్త విని పారిపోయే వాడు గుంటలో పడిపోతాడు. గుంటను తప్పించుకునేవాడు ఉరిలో చిక్కుతాడు. 1

21ఆ దినాన యెహోవా ఉన్నత స్థలాల్లోని ఉన్నత స్థల సమూహాన్ని, భూమి మీద ఉన్న భూరాజులను దండిస్తాడు. 1

22బందీలు గోతిలో పోగు పడినట్టు చెరసాల్లో పడతారు. చాలా రోజులైన తరువాత వారికి తీర్పు జరుగుతుంది. 1

23చంద్రుడు వెలవెలబోతాడు. సూర్య బింబం మారిపోతుంది. సేనల ప్రభువైన యెహోవా సీయోను కొండ మీదా యెరూషలేములో రాజవుతాడు. పెద్దల ఎదుట ఆయన ప్రభావం కనబడుతుంది.

← Isaiah 23Read In The App, Free →Isaiah 25 →

Study Isaiah 24

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566