Isaiah · బైబిల్ (తెలుగు)

Isaiah 57

1నీతిమంతులు చనిపోతున్నారు గానీ ఎవరూ పట్టించుకోవడంలేదు. 1 నిబంధన ప్రజలు చనిపోతున్నారు గానీ ఎవరికీ అర్థం కావడం లేదు. 1 కీడు చూడకుండా నీతిమంతులను తీసివేయడం జరుగుతూ ఉంది. 1

2అతడు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాడు. 1 యథార్ధంగా ప్రవర్తించేవారు తమ పడకల మీద విశ్రాంతి తీసుకుంటారు. 1

3మంత్రకత్తె కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యాసంతానమా, మీరిక్కడికి రండి! 1

4మీరెవర్ని ఎగతాళి చేస్తున్నారు? 1 ఎవర్ని చూసి నోరు తెరచి నాలుక చాస్తున్నారు? 1 మీరు తిరుగుబాటు చేసేవారూ మోసగాళ్ళూ కారా? 1

5సింధూర వృక్షాల కింద, పచ్చని ప్రతి చెట్టు కింద, కామంతో రగిలిపోయే మీరు, 1 లోయల్లో రాతిసందుల కింద, మీరు మీ పిల్లలను చంపుతున్నారు. 1

6లోయలోని రాళ్ళే మీ భాగం. అవే మీ వంతు. 1 వాటికే పానార్పణ పోస్తున్నారు. వాటికే నైవేద్యం అర్పిస్తున్నారు. వీటిలో నేను ఆనందించాలా? 1

7ఉన్నత పర్వతం మీద నీ పరుపు వేసుకున్నావు. 1 బలులు అర్పించడానికి నువ్వు అక్కడికే ఎక్కి పోయావు. 1

8తలుపు వెనుక ద్వారబంధాల వెనుక నీ గుర్తులు ఉంచావు. 1 నన్ను వదిలిపెట్టి బట్టలు ఊడదీసి మంచమెక్కావు. నీ పరుపు వెడల్పు చేసుకున్నావు. 1 నువ్వు వాళ్ళతో నిబంధన చేసుకున్నావు. వాళ్ళ మంచాలంటే నీకిష్టం. నువ్వు వాళ్ళ మానం చూశావు. 1

9నువ్వు నూనె తీసుకుని రాజు దగ్గరికి వెళ్లావు. ఎన్నో పరిమళ ద్రవ్యాలను తీసుకెళ్ళావు. 1 నీ రాయబారులను దూరప్రాంతాలకు పంపుతావు. పాతాళానికి దిగిపోయావు. 1

10నీ దూర ప్రయాణాలతో నువ్వు అలసిపోయావు. అయితే “అది వ్యర్ధం” అని ఎన్నడూ అనలేదు. 1 నువ్వు నీ చేతుల్లో బలం తెచ్చుకున్నావు. కాబట్టి నువ్వు నీరసించిపోలేదు. 1

11ఎవరికి జడిసి, భయపడి అంత మోసం చేశావు? 1 నా గురించి ఆలోచించలేదు, నన్ను జ్ఞాపకం చేసుకోలేదు. 1 చాలా కాలం నేను మౌనంగా లేను గదా! అయితే నువ్వు నన్నంతగా పట్టించుకోలేదు. 1

12నీ నీతి ఎలాంటిదో నేనే వెల్లడిచేస్తాను. 1 వాటివలన నీకేమీ ప్రయోజనం ఉండదు. 1

13నువ్వు కేకలు పెట్టేటప్పుడు నీ విగ్రహాల గుంపు నిన్ను తప్పించాలి! 1 వాటన్నిటినీ గాలి ఎగరగొట్టేస్తుంది. ఊపిరితో అవన్నీ కొట్టుకుపోతాయి. 1 అయితే నన్ను నమ్ముకునేవారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. నా పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనం చేసుకుంటారు. 1 సాత్వికులకు ఆదరణ 1

14ఆయన ఇలా అంటాడు. “కట్టండి, కట్టండి! దారి సిద్ధం చేయండి! 1 నా ప్రజల దారిలో అడ్డంగా ఉన్న వాటిని తీసేయండి.” 1

15ఎందుకంటే, మహా ఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి అయినవాడు ఇలా చెబుతున్నాడు. “నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తూ ఉన్నాను. అయినా, వినయంగల వారితో నలిగిన వారితో కూడా ఉంటాను. వినయం గలవారి ప్రాణాన్ని సేదదీర్చడానికీ నలిగినవారి ప్రాణాన్ని తెప్పరిల్లజేయడానికీ నేనున్నాను. 1

16నేను ఎల్లప్పుడూ నిందించను. ఎప్పుడూ కోపంగా ఉండను. అలా ఉంటే మనిషి ఆత్మ నీరసించి పోతుంది. నేను సృష్టించిన మనుషులు నీరసించి పోతారు. 1

17అక్రమంగా సంపాదించిన అతని పాపాన్ని బట్టి నేను కోపపడి అతన్ని శిక్షించాను. 1 నా ముఖాన్ని కోపంతో చాటు చేశాను. అయితే అతడు తనకిష్టమైన దారిలోకి తిరిగి వెళ్ళిపోయాడు. 1

18నేనతని ప్రవర్తన చూశాను కానీ అతన్ని బాగుచేస్తాను. 1 అతనికి దారి చూపుతాను. అతన్నీ అతని కోసం దుఃఖించే వారినీ ఓదారుస్తాను. 1

19వారికి కృతజ్ఞతాపూర్వకమైన పెదాలు ఇస్తాను. దూరంగా ఉన్నవారికీ దగ్గరగా ఉన్నవారికీ శాంతి సమాధానాలుంటాయి” అని యెహోవా చెబుతున్నాడు. “నేనే వారిని బాగుచేస్తాను” 1

20అయితే దుర్మార్గులు అటూ ఇటూ కొట్టుకునే సముద్రం లాంటి వారు. 1 దాని నీళ్ళు, బురద పైకి తెస్తూ ఉంటుంది. 1

21“దుర్మార్గులకు ప్రశాంతత ఉండదు” అని దేవుడు చెబుతున్నాడు.

← Isaiah 56Read In The App, Free →Isaiah 58 →

Study Isaiah 57

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566