Psalms · బైబిల్ (తెలుగు)

Psalms 113

1యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి. యెహోవా నామాన్ని స్తుతించండి. 1

2ఇప్పుడు, ఎల్లకాలం యెహోవా నామానికి సన్నుతి. 1

3సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకూ యెహోవా నామం స్తుతినొందదగినది. 1

4యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశాన్ని అంటుతున్నది. 1

5ఉన్నత స్థలంలో ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలినవాడెవడు? 1

6ఆయన భూమినీ ఆకాశాన్నీ వంగి చూస్తున్నాడు. 1

7ఆయన దుమ్ములోనుండి దరిద్రులను లేవనెత్తుతాడు. బూడిద కుప్ప మీద నుండి పేదలను పైకెత్తుతాడు. 1

8ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చోబెట్టడం కోసం ఆయన ఇలా చేస్తాడు. 1

9ఆయన పిల్లలు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తాడు. ఆమెకు పిల్లల తల్లిగా సంతోషం కలగజేస్తాడు. యెహోవాను స్తుతించండి.

← Psalms 112Read In The App, Free →Psalms 114 →

Study Psalms 113

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschCharles SpurgeonScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150