Psalms · బైబిల్ (తెలుగు)

Psalms 2

1జాతులు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాయి? ప్రజా సమూహాలు ఎందుకు వ్యర్ధమైన కుట్ర చేస్తున్నాయి? 1

2భూరాజులు కుమ్మక్కై యెహోవాకూ ఆయన అభిషిక్తుడికీ విరోధంగా నిలబడ్డారు. పాలకులు ఏకీభవించి కుట్ర చేస్తున్నారు. 1

3వాళ్ళు మనకు వేసిన సంకెళ్ళు తెంపేద్దాం రండి. వాళ్ళ గొలుసులు విసిరి పారేద్దాం రండి, అని చెప్పుకుంటున్నారు. 1

4ఆకాశాల్లో కూర్చున్నవాడు వెక్కిరిస్తున్నాడు. ప్రభువు వాళ్ళను చూసి హేళన చేస్తున్నాడు. 1

5ఆయన ఉగ్రుడై వారితో మాట్లాడతాడు. విపరీతమైన కోపంతో వాళ్ళను భయభీతులకు గురి చేస్తాడు 1

6నా పవిత్ర పర్వతం సీయోను మీద నేనే నా రాజును అభిషేకించాను. 1

7యెహోవా శాసనాన్ని నేను ప్రకటిస్తాను. యెహోవా నాకు ఇలా చెప్పాడు, నువ్వు నా కుమారుడివి. ఈ రోజు నేను నీకు తండ్రినయ్యాను. 1

8నన్ను అడుగు. జాతులను నీకు వారసత్వంగానూ భూమిని దాని సుదూర ప్రాంతాల వరకూ నీ ఆస్తిగానూ ఇస్తాను. 1

9ఇనపదండంతో నువ్వు వాళ్ళను నలగగొడతావు, మట్టి కుండలాగా వాళ్ళను ముక్కలు చెక్కలు చేస్తావు. 1

10కాబట్టి ఇప్పుడు రాజులారా, ఇదుగో హెచ్చరిక. భూలోక పాలకులారా, మిమ్మల్ని మీరు సరిచేసుకోండి. 1

11భయంతో యెహోవాను ఆరాధించండి, గడగడ వణకుతూ ఆనందించండి. + 2:11 దేవుణ్ణి ఆరాధించే వారు ఆయన పట్ల సరి అయిన భయం కూడా కలిగి ఉండాలి. ఆయన విషయంలో శృతి మించిన చనువు పనికి రాదు. ఇది పాతనిబంధన ఇశ్రాయేలు ప్రజ ఎంతో జాగ్రత్త గా గుర్తుంచుకోవలసిన విషయం. దావీదు దేవుని మందసాన్ని తీసుకు వస్తున్నప్పుడు, మందసం జారి పోతున్న సమయంలో ఉజ్జా అనేవాడు చెయ్యి చాపి దాన్ని పట్టుకున్నందుకు అక్కడికక్కడే అతడు కుప్పగూలి మరణించాడు గదా. 2 సమూ 6:6-8. 1

12దేవుడు కుమారుని పక్షం చేరండి. అప్పుడు దేవుడు మీపై కోపించడు. ఆయన కోపం త్వరగా రగులుకున్నప్పుడు మీరు చనిపోరు. దేవునిలో ఆశ్రయం పొందినవాళ్ళు ధన్యులు.

← Psalms 1Read In The App, Free →Psalms 3 →

Study Psalms 2

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschCharles SpurgeonScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150