Psalms · బైబిల్ (తెలుగు)

Psalms 26

1యెహోవా, నేను నిజాయితీగా నడుచుకున్నాను. నాకు న్యాయం తీర్చు. ఊగిసలాడకుండా యెహోవాలో నా నమ్మకం ఉంచాను. 1

2యెహోవా, నన్ను పరిశీలించు. నన్ను పరీక్షించు. నా అంతరంగంలో, నా హృదయంలో ఉన్న స్వచ్ఛతను పరీక్షించు. 1

3నీ నిబంధన నమ్మకత్వం నా కళ్ళెదుట ఉంది. నీ సత్యంలో నేను నడుచుకుంటున్నాను. 1

4మోసగాళ్లతో నేను సాంగత్యం చెయ్యను. నిజాయితీ లేని వాళ్ళతో నేను కలిసి ఉండను. 1

5దుష్టుల గుంపు నాకు అసహ్యం, దుర్మార్గులతో నేను సహవాసం చెయ్యను. 1

6నేను నిర్దోషిగా నా చేతులు కడుక్కుంటాను. యెహోవా, నేను నీ బలిపీఠం వైపు తిరుగుతాను. 1

7అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీ ఆశ్చర్యకార్యాలు వివరిస్తాను. 1

8నీ మహిమ నిలిచే స్థలం, యెహోవా, నువ్వు నివాసం ఉంటున్న నీ ఇల్లు నాకెంతో ఇష్టం. 1

9పాపులతో పాటు నా ప్రాణం, క్రూరులతో పాటు నా జీవం ఊడ్చి వేయకు. 1

10వాళ్ళ చేతుల్లో ఒక కుట్ర ఉంది. వాళ్ళ కుడిచెయ్యి లంచాలతో నిండి ఉంది. 1

11కాని నా వరకైతే నేను నిజాయితీగా నడుచుకుంటాను. నన్ను విమోచించి నన్ను కరుణించు. 1

12చదునైన చోట నా పాదం నిలిపాను. సభలలో నేను యెహోవాను స్తుతిస్తాను.

← Psalms 25Read In The App, Free →Psalms 27 →

Study Psalms 26

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschCharles SpurgeonScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150