Psalms · బైబిల్ (తెలుగు)

Psalms 137

1మనం బబులోను నదుల దగ్గర కూర్చుని ఏడుస్తూ సీయోనును జ్ఞాపకం చేసుకున్నాం. 1

2అక్కడ ఉన్న నిరవంజి చెట్ల కొమ్మలకు మన తంతివాయిద్యాలు తగిలించాం. 1

3మనలను బందీలుగా పట్టుకుని హింసిస్తున్నవాళ్ళు సీయోను కీర్తనల్లో ఒక పాట పాడండి, మేము విని ఆనందిస్తాం అన్నారు. 1

4మనం అన్యుల దేశంలో ఉంటూ యెహోవా కీర్తనలు ఎలా పాడగలం? 1

5యెరూషలేమా, నేను నిన్ను మరచిపోతే నా కుడి చెయ్యి తన నైపుణ్యాన్ని కోల్పోతుంది గాక. 1

6నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకోకపోతే, నాకున్న మహానంద కారణాలకు మించి యెరూషలేమును ప్రాముఖ్యమైనదిగా ఎంచకపోతే నా నాలుక నా అంగిటికి అంటుకుంటుంది గాక. 1

7యెహోవా, ఎదోము ప్రజలు ఏమి చేశారో జ్ఞాపకం చేసుకో. యెరూషలేము పాడైపోయిన రోజులను జ్ఞాపకం చేసుకో. దాన్ని నాశనం చేయండి, సమూలంగా ధ్వంసం చెయ్యండి, అని వాళ్ళు చాటింపు వేశారు గదా. 1

8నాశనం అయ్యేందుకు సిద్ధంగా ఉన్న బబులోను కుమారీ, నువ్వు మా పట్ల జరిగించిన దుష్ట క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయబోయేవాడు ధన్యుడు. 1

9నీ పసిపిల్లలను పట్టుకుని బండ కేసి కొట్టేవాడు ధన్యుడు.

← Psalms 136Read In The App, Free →Psalms 138 →

Study Psalms 137

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschCharles SpurgeonScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150