Psalms · బైబిల్ (తెలుగు)

Psalms 36

1దుర్మార్గుడి హృదయంలో పాపం దివ్యవాణిలాగా మాట్లాడుతూ ఉంది. వాడి కళ్ళల్లో దేవుడి భయం కన్పించడం లేదు. 1

2ఎందుకంటే వాడి పాపం బయటపడదనీ, దాన్ని ఎవరూ అసహ్యించుకోరనే భ్రమలో వాడు నివసిస్తున్నాడు. 1

3వాడు పలికే మాటలు పాప భూయిష్టంగా, మోసపూరితంగా ఉన్నాయి. వాడికి జ్ఞానంగా ప్రవర్తించడం, మంచి పనులు చేయడం ఇష్టం లేదు. 1

4వాడు మంచం దిగకుండానే పాపం ఎలా చేయాలా అని ఆలోచిస్తాడు. దుర్మార్గపు మార్గాలను ఎంచుకుని వెళ్తాడు. చెడును నిరాకరించడు. 1

5యెహోవా, నీ నిబంధన కృప ఆకాశాన్ని అంటుతుంది. నీ విశ్వసనీయత మేఘాలను తాకుతుంది. 1

6నీ న్యాయం ఉన్నతమైన పర్వతాలతో సమానం. నీ న్యాయం లోతైన సముద్రంతో సమానం. యెహోవా నువ్వు మానవులను, జంతువులను సంరక్షిస్తావు. 1

7దేవా, నీ నిబంధన కృప ఎంత ప్రశస్తమైనది! నీ రెక్కల నీడన మానవ జాతి ఆశ్రయం పొందుతుంది. 1

8నీ మందిరపు సమృద్ధి వలన వాళ్ళు సంపూర్ణ సంతృప్తి పొందుతున్నారు. నీ అమూల్యమైన దీవెనల జలధారలో వాళ్ళని తాగనిస్తావు. 1

9నీ దగ్గర జీవపు ఊట ఉంది. నీ వెలుగులోనే మేము వెలుగును చూస్తున్నాం. 1

10నువ్వంటే తెలిసినవారికి నీ నిబంధన కృపనూ, యథార్ధమైన హృదయం కలిగిన వాళ్లకు నీ కాపుదలనూ అధికంగా విస్తరింపజేయ్యి. 1

11అహంకారి పాదం నా సమీపంలోకి రానియ్యకు. దుర్మార్గుడి హస్తం నన్ను తరమనియ్యకు. 1

12అదుగో పాపం చేసే వాళ్ళు అక్కడే పడిపోయారు. ఇక లేచే సామర్ధ్యం లేకుండా కూలిపోయారు.

← Psalms 35Read In The App, Free →Psalms 37 →

Study Psalms 36

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschCharles SpurgeonScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150