Psalms · బైబిల్ (తెలుగు)

Psalms 41

1బలహీనులను పట్టించుకునే వాడు ధన్యజీవి. కష్ట సమయంలో యెహోవా అతణ్ణి కాపాడతాడు. 1

2యెహోవా అతణ్ణి భద్రపరచి సజీవంగా ఉంచుతాడు. భూమి మీద అతణ్ణి ఆశీర్వదిస్తాడు. అతని శత్రువులు కోరుకున్నట్టుగా అతణ్ణి వాళ్ళకి స్వాధీనం చేయడు. 1

3జబ్బు చేసి పడకపై ఉన్నప్పుడు యెహోవా అతణ్ణి పరామర్శిస్తాడు. వ్యాధి పడకను నువ్వు స్వస్థత పడకగా మారుస్తావు. 1

4నేనిలా అన్నాను. యెహోవా, నీకు విరోధంగా నేను పాపం చేశాను. నన్ను కనికరించు. నా హృదయాన్ని బాగుచెయ్యి. 1

5నా శత్రువులు నాకు వ్యతిరేకంగా చెడ్డ మాటలు అంటారు, వాడు ఎప్పుడు చచ్చిపోతాడు? వాడి పేరు ఎప్పుడు మాసిపోతుంది? అంటారు. 1

6నా శత్రువు నన్ను చూడటానికి వస్తే నా గురించి పనికిమాలిన మాటలు చెప్తాడు. వాడి హృదయం నా నాశనం చూడ్డానికి సిద్ధపడి ఉంటుంది. వాడు బయటకు వెళ్లి ఇతరులకు ఆ సంగతి చెప్తాడు. 1

7నన్ను ద్వేషించే వాళ్ళంతా చేరి నాకు వ్యతిరేకంగా గుసగుసలాడుతూ ఉన్నారు. నాకు గాయం కావాలని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు + 41:7 నాకు గాయం కావాలని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు నాకు కీడు చేయాలని దురాలోచన చేస్తారు. 1

8ఒక చెడ్డ రోగం వాణ్ణి గట్టిగా పట్టుకుంది. ఇప్పుడు వాడు పడకపై ఉన్నాడు. దానిపైనుంచి వాడిక లేవడు అని చెప్పుకుంటారు. 1

9నేను నమ్మిన నా సన్నిహిత మిత్రుడు, నా ఆహారం పంచుకున్నవాడు నన్ను తన్నడానికి కాలు ఎత్తాడు. 1

10కానీ యెహోవా, వాళ్ళకు బదులు తీర్చడానికై నన్ను కరుణించి పైకి లేపు. 1

11అప్పుడు నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుస్తుంది. నా శత్రువు నాపై విజయం సాధించలేడు. 1

12నా యథార్థతను బట్టి నువ్వు నాకు సహాయం చేస్తావు. నీ సమక్షంలో నన్ను శాశ్వతంగా నిలబెట్టుకుంటావు. 1

13నిత్యత్వం నుండి నిత్యత్వం వరకూ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలుగు గాక! ఆమేన్‌. ఆమేన్‌.

← Psalms 40Read In The App, Free →Psalms 42 →

Study Psalms 41

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschCharles SpurgeonScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150